Ekka Movie Review: ఎక్కా మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: యువ రాజ్‌కుమార్, సంజనా ఆనంద్, సంపద, అతుల్ కులకర్ణి, ఆదిత్య, రాహుల్ దేవ్ శెట్టి, శృతి, సాధు కోకిల, పూర్ణ చంద్ర మైసూర్ తదితరులు
దర్శకత్వం: రోహిత్ పడకి
నిర్మాతలు: అశ్వినీ పునీత్ రాజ్‌కుమార్, జయన్న, భోగేంద్ర, కార్తీక్ గౌడ, యోగీ జీ రాజ్
మ్యూజిక్: చరణ్ రాజ్ ఎంఆర్
సినిమాటోగ్రఫి: సత్య హెగ్డే
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
ఆర్ట్: అమర్
బ్యానర్: పీఆర్కే ప్రొడక్షన్స్, జయన్న ఫిల్మ్స్, కేఆర్జీ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2025-07-18
తల్లి రత్నకు ముత్తు (యువ రాజ్‌కుమార్) ముద్దుల కొడుకు. ఉద్యోగం లేకుండా స్నేహితులతో అల్లరి చిల్లరగా తిరుగుతూ జూదం ఆడుతూ కాలం గడపుతుంటాడు. తల్లికి సొంత ఇల్లంటే ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం. అలాంటి ఇల్లు ఓ కారణంగా బలవంతంగా వడ్డీ వ్యాపారీ అమ్మకానికి పెడుతాడు. అయితే 6 నెలల్లో 20 లక్షలు కట్టి ఇంటిని సొంతం చేసుకొంటానని వడ్డీ వ్యాపారీకి ముత్తు మాట ఇచ్చి.. దానిని అమ్మకుండా ఆపుతాడు. డబ్బు సంపాదన కోసం బెంగళూరులో అడుగుపెట్టి కారు డ్రైవర్‌గా మారుతాడు. అతడు ఒకటి అనుకొంటే.. విధి మరోలా ఆట ఆడుతుంది. తన చేతుల్లోనే ఓ చిన్నారి చావుకు కారణం అవుతాడు. ఆ సంఘటన మనశ్శాంతి, నిద్ర లేకుండా చేస్తుంది. ఇష్టం లేకపోయినా బలమైన కారణంగా బెంగళూరు మాఫియాలో భాగమైతాడు.

తల్లికి ఇష్టమైన ఇల్లు అమ్మకానికి ఎందుకు వెళ్లింది? బెంగళూరులో కారు డ్రైవర్‌గా ముత్తు లైఫ్ ఎలా సాగింది? చిన్నారి చావుకు ముత్తు ఎలా కారణమయ్యాడు? చిన్నారి ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయింది? చిన్నారికి ముత్తుకు ఏమిటి సంబంధం? మాఫియా డాన్ మస్తాన్ భాయ్ (అతుల్ కులకర్ణి)కి శిష్యుడిగా ఎందుకు చేరాడు? మాఫియా వ్యవహారాల్లో ముత్తుకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అప్పు చెల్లించి సొంత ఇంటిని చేజిక్కించుకొన్నాడా? చిన్నారి మరణానికి కారణమైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఎక్కా సినిమా కథ.
చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న యువకుడు మృగంలా ఎలా మారాడు అనే పాయింట్ చుట్టు పక్కా కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలను జోడించి మాఫియా కథను దర్శకుడు రోహిత్ పడకి అల్లుకొన్నాడు. లవ్, మదర్, చైల్డ్ సెంటిమెంట్ అంశాలను ప్రధాన ఆస్త్రాలుగా చేసుకొని స్టోరీని నడిపించాడు. ఫస్టాఫ్‌లో ఎమోషనల్‌గా, గ్రిప్పింగ్‌గా, కథను చెప్పిన డైరెక్టర్.. సెకండాఫ్‌లో రొటిన్, రెగ్యులర్ మాఫియా అంశాలతో నెట్టుకొచ్చాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి అత్యంత బలంగా నిలిచింది.
ఇద్దరు హీరోయిన్లతో లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ముత్తు క్యారెక్టర్‌ను డ్రైవ్ చేయడానికే ఆ రెండు క్యారెక్టర్లను వాడుకొన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో మాఫియా వ్యవహారాలతో యాక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్లి.. ఫుల్ కమర్షియల్ సినిమాగా మార్చేశాడు. మాస్, క్లాస్ అంశాలను బేరిజు చేసుకొని యువ రాజ్‌కుమార్ ఇమేజ్‌కు తగినట్టుగా ఫినిష్ చేశాడు. ఎలాంటి కొత్తదనం లేకుండా మాస్, మసాల సినిమాను అందించే ప్రయత్నం చేశాడు.
సాధారణ యువకుడు, మాఫియా డాన్ లాంటి రెండు రకాల వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్‌తో యువ రాజ్‌కుమార్ మాస్ హీరోగా చెలరేగిపోయాడు. పాత్రలో ఉండే వేరియేషన్స్‌కు తగినట్టుగా బాడీ లాంగ్వేజ్‌ను చక్కగా చూపించాడు. ఫస్టాఫ్‌లో చిన్నారితో ఫీల్‌గుడ్ సన్నివేశాల్లో ఎమోషనల్‌గా ఆకట్టుకొన్నాడు. సెకండాఫ్ హాఫ్‌లో మాస్ హీరోగా విజృంభించాడు. సంపద, సంజనా పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయింది.మాఫియా డాన్ పాత్రలో అతుల్ కులకర్ణి హుందాగా, బ్యాలెన్స్‌గా నటించాడు. పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఆర్టిస్ట్, పూర్ణచంద్ర మైసూర్, తల్లి రత్న ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.
సాంకేతికి విభాగాల విషయానికి వస్తే.. ఎక్కా సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్స్. చరణ్ రాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాయి. ఎక్కా టైటిల్ సాంగ్, మరో రెండు పాటలు బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్‌ను, అలాగే బెంగళూరు మాస్ ఏరియాలను సత్య హెగ్డే చక్కగా తన కెమెరాలో బంధించాడు. మాస్, రిచ్ ఏరియా వాతావరణాన్ని బాగా కనెక్ట్ చేశాడు. అశ్వినీ పునీత్ రాజ్‌కుమార్, జయన్న, భోగేంద్ర, కార్తీక్ గౌడ, యోగీ జీ రాజ్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
మాస్, క్లాస్ అంశాలతో రూపొందిన మాఫియా కథ ఎక్కా. సాధారణ యువకుడు తనకు సంబంధం లేని మాఫియా వ్యవహారాల్లో ఎలా కూరుకుపోయాడనే పాయింట్ పాతదే. కానీ దర్శకుడు రోహిత్ పడకి ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. లవ్, మదర్ సెంటిమెంట్ ఈ స్టోరీలో బోనస్ పాయింట్స్. ఫస్టాఫ్‌లో చైల్డ్ సెంటిమెంట్‌తో ఎంగేజ్ చేశాడు. సెకండాఫ్‌లో ఫ్యూర్‌గా మాస్ అంశాలతో మెప్పించాడనే చెప్పాలి. రెండున్నర గంటలపాటు సాగే కమర్షియల్ సినిమా. కామన్ ఆడియెన్ కావాల్సిన అంశాలన్నీ దట్టించిన ఫుల్స్ మీల్స్ లాంటి సినిమా. కమర్షియల్, యాక్షన్, మాస్, మసాలా సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











