Ekka Movie Twitter Review: ఎక్కా కన్నడ మూవీ ట్విట్టర్ రివ్యూ
కన్నడలో లెజెండరీ యాక్టర్ శివరాజ్ కుమార్ మనవడు యువ రాజ్‌కుమార్ నటించిన తాజా చిత్రం ఎక్కా. సంజనా ఆనంద్, సంపద హీరోయిన్లుగా నటించారు. రోహిత్ పడకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, ఆదిత్య, రాహుల్ దేవ్ శెట్టి, శృతి, సాధు కోకిల, పూర్ణ చంద్ర మైసూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను అశ్వినీ పునీత్ రాజ్‌కుమార్, జయన్న, భోగేంద్ర, కార్తీక్ గౌడ, యోగీ జీ రాజ్ నిర్మించారు. ఈ సినిమాకు చరణ్ రాజ్ సంగీతం అందించారు. సత్య హెగ్డే సినిమాటోగ్రఫి, దీపు ఎస్ కుమార్ ఎఢిటర్‌గా వ్యవహరించారు. జూలై 18వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ మూవీ గురించి నెటిజన్లు, క్రిటిక్స్ ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇచ్చారనే వివరాల్లోకి వెళితే..
కర్ణాటక వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. రాజ్ కుమార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఈ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. కన్నడ సినిమా పరిశ్రమలో సందడిని ఈ సినిమా తీసుకొచ్చిందనే కామెంట్ చేస్తున్నారు. నిస్తేజంగా ఉన్న సాండల్ ఉడ్‌కు ఎక్కా సినిమా కొత్త జోష్‌ను తెచ్చిందనే కామెంట్స్ సోషల్ మీడయాల కనిపిస్తున్నాయి.

నేను న్యూట్రల్ వ్యూవర్‌ను. ఎక్కా సినిమా చూశాను. మంచి మూవి. కన్నడ సినిమా పరిశ్రమకు అవసరమైన రిలీఫ్‌ను ఇచ్చింది. ఫ్యామిలీ అందరూ చూడదగిన క్లీన్ ఎంటర్‌టైనర్. సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
ప్యూర్ మ్యాడ్‌నెస్. రోహిత్ పడకి నుంచి ఇలాంటి అవుట్‌పుట్ ఊహించలేదు. యువ రాజ్‌కుమార్‌లో ఉన్న టాలెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకొన్నాడు. నిన్ను ట్రోల్ చేసే వాళ్ల నోళ్లను నీ యాక్టింగ్ టాలెంట్‌తో మూయించావు. స్క్రిప్టు రైటర్స్, డైలాగ్స్ బాగా రాశారు. చరణ్ రాజ్ బీజీఎం బాగుండటమే కాకుండా సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచింది. టోటల్‌గా వర్త్ వాచ్ మూవీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఎక్కా సినిమా మాస్ క్లాస్ ఎంటర్‌టైనర్. యువ రాజ్‌కుమార్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. కెరీర్‌కు బూస్ట్ కలిగించే సినిమా ఇది. డైరెక్టర్, కో స్టార్, మ్యూజిక్, బీజీఎం, పాటలు బాగున్నాయి. స్టోరీ డిపార్ట్‌మెంట్ పనితీరు టాప్ లెవెల్‌లో ఉంది. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా ఉంది. ఈ సినిమాకు నా రేటింగ్ 5 పాయింట్లకు 4 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఎక్కా సినిమా సక్సెస్‌కు రోహిత్ పడక్ క్రెడిట్ ఇవ్వాలి. ఎక్కా సూపర్ హిట్ కావడం పక్కా. స్వాగ్ ఫుల్ సుక్క, ఈ సినిమా కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. యువ విజృంభించి తనలోని ప్రతిభను చాటుకొన్నాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఎక్కా సినిమా సెకండాఫ్ బాగుంది. మాగు నుంచి మృగ వరకు యువ ట్రాన్స్‌ఫర్మేషన్ బాగుంది. రా ఎమోషన్స్‌తో యువ ఆకట్టుకొన్నాడు. ఫైర్ ప్యాక్డ్ డైలాగ్స్, మంచి క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. క్యారెక్టర్లను బాగా రాశారు. పవర్‌ఫుల్ మూమెంట్స్ బాగున్నాయి. చాలా రోజుల తర్వాత కన్నడ సినిమా సక్సెస్‌తో హౌస్‌ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకొంటున్నది అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
రా క్రైమ్ డ్రామాస్‌ను కోరుకొనే ప్రేక్షకుల కోసం ఎక్కా రూపొందించారు. ఫిలాసఫీతో కూడిన డైలాగ్స్ టచింగ్‌గా ఉంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. కొన్ని ఎమోషనల్ సీన్లు ఫుల్ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉన్నాయి. రోహిత్ పడకి ఎమోషనల్ సీన్లను బాగా తీశాడు. చరన్ రాజ్ మ్యూజిక్ అమేజింగ్‌గా ఉంది. యువ యాక్టింగ్ బాగుంది. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఎక్కా సినిమా గురించి ఓ నెటిజన్ ఎమోషనల్‌గా సుదీర్ఘమైన రివ్యూను ప్రజెంట్ చేశాడు. కన్నడ సినిమా పరిశ్రమలో ఈ ఏడాది బెస్ట్ ఎంటర్‌టైనర్. స్టోరీ, క్యారెక్టర్లు బ్రిల్లియెంట్‌గా రాశారు. రోహిత్ పడక్కి డైరెక్షన్ బాగుంది. చరణ్ రాజ్ మ్యూజిక్ బాగుంది. హీరోయిన్ సంపద, సంజన క్యారెక్టర్ అంతగా మెప్పించలేకపోయాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











