Eleven Movie Review: లెవన్ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: నవీన్ చంద్ర, రేయా హరి, శశాంక్, అభిరామి, ఆడుకాలమ్ నరేన్, రవి వర్మ, కిరిటీ దామరాజు తదితరులు
రచన, దర్శకత్వం: లోకేష్ అజ్లిస్
కథ: వాసుదేవ మూర్తి
నిర్మాతలు: అజ్మల్ ఖాన్, రేయా హరి
మ్యూజిక్: డి ఇమ్మాన్
సినిమాటోగ్రఫి: కార్తీక్ అశోకన్
ఎడిటర్: ఎన్‌బీ శ్రీకాంత్
ఆర్ట్: పీఎల్ సుబెంథార్
బ్యానర్: ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2029-05-16
విశాఖపట్నంలో వరుస హత్యలు పోలీసులకు సవాల్‌గా నిలుస్తాయి. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి రంజిత్ (శశాంక్) యాక్సిడెంట్ గురి అవుతాడు. దాంతో ఆ కేసు విచారణ బాధ్యతను సిన్సియర్ అండ్ స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ అరవింద్ (నవీన్ చంద్ర)కు అప్పగిస్తారు. బెంజమిన్ అనే సైకో ముసుగేసుకొని సీరియల్ కిల్లింగ్‌కు పాల్పడుతున్నాడని ఏసీపీ అరవింద్ తెలుసుకొంటాడు. తన సహచర ఆఫీసర్ మనోహర్‌తో కలిసి సైకోను పట్టుకొనేందుకు వేట మొదలు పెడుతాడు.

సైకో బెంజమిన్ ఎవరు? ఎందుకు సైకోగా మారాడు? ముసుగు వేసుకొని ఎందుకు హత్యలు చేస్తుంటాడు? ఈ హత్యలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి? చివరకు బెంజమిన్‌ను అరవింద్ పట్టుకొన్నాడా? హత్యల వెనుక మాస్టర్ మైండ్ ఏమిటి? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానమే లెవన్ సినిమా కథ.
సైకాలజికల్, హ్యుమన్ ఎమోషన్స్‌తో ఉండే స్టోరీ పాయింట్‌ను దర్శకుడు లోకేష్ ఎంచుకోవడంలోనే తప్పటడుగు వేశాడని చెప్పవచ్చు. ఓ కుర్రాడిని ఆటపట్టించడానికి పిల్లలు చేసిన తప్పుకు అంత మందికి అంత పెద్ద శిక్ష వేయడమనేది లాజిక్‌కు దూరంగా అనిపిస్తుంది. కానీ కథను నడిపించిన తీరు, సన్నివేశాలను రాసుకొన్న విధానం, ఫ్యాష్ బ్యాక్‌లో హ్యుమన్ ఎమోషన్స్ జొప్పించిన తీరు బాగుంది. కథలో నాలుగైదు చోట్ల దర్శకుడి ప్రతిభ ప్రశంసించేలా ఉంటుంది. మిగితా అంతా రొటీన్‌గా సాగడం ఈ సినిమాలో ఓ లోపంగా కనిపిస్తుంది. ఇంటర్వెల్‌లోను క్లైమాక్స్‌లో రెండు ట్విస్టులు ఫీల్‌గుడ్‌గా ఉంటాయి. కథను నడిపించడానికి ఎంచుకొన్న బేసిక్ పాయింట్ కన్విన్సింగ్‌గా లేదనిపిస్తుంది.
ఏసీపీ అరవింద్‌గా ఈ సినిమా భారాన్నంత నవీన చంద్ర మోశాడు. రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. పాత్రలోని వేరియేషన్స్‌కు తగిన ఎమోషన్స్‌ను, బాడీ లాగ్వేంజ్‌ను, యాటిట్యూడ్‌ను చక్కగా పలికించాడు. మనోహర్ పాత్రను చేసిన యాక్టర్ ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ రేయా, అలాగే కిరిటీ, శశాంక్ రోల్స్ కథలో కీలకమే కానీ..వాటికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో వారు కూడా ఏమి చేయలేకపోయారు. అభిరామి, రవివర్మ కథకు కావాల్సిన ఎమోషన్స్‌ను నింపే పాత్రల్లో కనిపించారు.
లెవన్ సినిమాకు ఇమ్మాన్ మ్యూజిక, కార్తీక్ అశోకన్ సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది. చాలా సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది. నైట్ ఎఫెక్ట్ షాట్స్‌ను, ఛేజింగ్ సీన్స్‌ను కార్తీక్ బాగా షూట్ చేశాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కట్ షాట్స్‌తో ట్విస్టులను రివీల్ చేసిన విధానం చూస్తే ఎడిటర్ శ్రీకాంత్ వర్క్ ఇంప్రెసివ్‌గా ఉంది. అజ్మల్ ఖాన్, రేయా హరి అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
కవల పిల్లల్లో ఒకరిపై మరొకరికి ఉండే ఎమోషనల్ బాండింగ్‌ను బేస్ చేసుకొని రాసుకొన్న క్రైమ్ థ్రిల్లర్. స్టోరీకి బేస్ అయిన బేసిక్ పాయింట్ లాజిక్ లెస్‌గా ఉండటం వల్ల సినిమాకు కనెక్ట్ కావడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ లోపాన్ని నవీన్ చంద్ర తన పెర్ఫార్మెన్స్‌తో కప్పిపుచ్చాడు. దర్శకుడు అనుసరించిన స్క్రీన్ ప్లే, రాసుకొన్న ట్విస్టులు ఈ సినిమాకు కొంత పాజిటివ్‌గా మార్చాయి. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











