twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎందుకో ఏమో మూవీ రివ్యూ, రేటింగ్

    |

    Rating: 2.5/5

    కథ బాగుంటే చిన్న చిత్రమా? భారీ బడ్జెట్ చిత్రమా? అనే విషయాన్ని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. చిన్న చిత్రాలపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ ఔత్సాహిక దర్శక, నిర్మాతలకు మంచి స్ఫూర్తిని కలిగిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు కోటి వడ్డినేని, నిర్మాత మాలతి వడ్డినేని చేసిన వినూత్న ప్రయోగం ఎందుకో ఏమో. నందు, పునర్నవి భూపాలం జంటగా, యువ హీరో నోయల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న రిలీజైంది. ట్రాయాంగిల్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమాను సమీక్షించాల్సిందే.

     ఎందుకో ఏమో కథ

    ఎందుకో ఏమో కథ

    సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన కార్తీక్ (నందు), హరిక (పునర్నవి భూపాలం)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. కానీ అతడిని హారిక అపార్థం చేసుకొంటుంది. ఆ తర్వాత నందు గురించి తెలుసుకొన్న తర్వాత ప్రేమను అంగీకరిస్తుంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకొంటారు. అంతలోనే ప్రిన్స్ (నోయల్) వీరి ప్రేమలోకి ఎంట్రీ ఇస్తాడు. ఇంతకీ నందు ఎవరు? కార్తీక్‌తో ప్రిన్స్‌కు ఉన్న రిలేషన్ ఏమిటి? హారికను ఎవరు పెళ్లి చేసుకొంటారు అనే ప్రశ్నలకు సమాధానమే ఎందుకో ఏమో చిత్ర కథ.

    నటీనటుల ప్రతిభ

    నటీనటుల ప్రతిభ

    హీరో నందు ఇలాంటి పాత్రలు ఎన్నో చేశాడు. కానీ ఈ చిత్రంలో సహజమైన రీతిలో పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. కీలక సన్నివేశాల్లో నోయల్ పలు రకాల వేరియేషన్స్‌ చూపించాడు. ప్రధానంగా క్లైమాక్స్‌లో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రను బాగా చేశాడు. హారిక తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. సుడిగాలి సుధీర్ కామెడీ కొత్తగా అనిపిస్తుంది. ఎప్పటిలానే పోసాని తన పాత్రకు న్యాయం చేశాడు.

     దర్శకుడు, సాంకేతిక నిపుణులు

    దర్శకుడు, సాంకేతిక నిపుణులు

    ఎందుకో ఏమో కథ పాతదైనా కొత్తరకం ట్రీట్‌మెంట్‌తో నూతన దర్శకుడు కోటి సినిమాను తెరకెక్కించాడు. నోయెల్ పాత్రను రాసుకొన్న తీరు అభినందనీయం. ప్రేమను మెయిన్ ట్రాక్ చెబుతూనే అంతర్లీనంగా సమాజంలో జరుగుతున్న విషయాలను చక్కగా చెప్పేందుకు ప్రయత్నించాడు. కొన్ని చోట్ల ఆయన అనుభవలేమి కనిపిస్తుంది. కానీ కొత్త దర్శకుడనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు.

     సంగీతం

    సంగీతం

    ప్రవీణ్ సంగీతం, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు బలంగా మారింది. సెకండాఫ్‌లో సినిమా ట్రీట్‌మెంట్ బాగుంటుంది. మాలతి వడ్డినేని నిర్మాతగా మంచి అవుట్ ఫుట్‌ను అందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: నందు, నోయల్, పునర్నవి భూపాలం
    దర్శకత్వం: కోటి వడ్డినేని
    నిర్మాత: మాలతి వడ్డినేని
    మ్యూజిక్: ప్రవీణ్
    రీరికార్డింగ్: శేఖర్ చంద్ర
    సినిమాటోగ్రాఫర్: రాజ్
    రిలీజ్ డేట్: 2018-09-12

    English summary
    Enduko Emo movie is a romantic entertainer in the Lead roles of Nandu, Punarnavi Bhupalam and Noel Sean and directed by Koti Vaddineni and produced by Malathi Vaddineni while Praveen scored music for this movie. This movie released on september 12th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X