అదరగొట్టిన శ్రీదేవి (ఇంగ్లిష్ వింగ్లిష్ రివ్యూ)
కథ : హౌస్ వైఫ్ అయిన శశి(శ్రీదేవి) ఫ్యామిలీతో కలిసి ముంబైలో ఉంటుంది. వంటలు వండటంలో ఓక్స్ పర్ట్. స్మాల్ హోం ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. అయితే శశికి సరిగా ఇంగ్లీష్ రాక పోవడంతో తన ఇద్దరు పిల్లలు, భర్తలు ఆమెను సరిగా గౌరవించకుండా ఆటపట్టిస్తుంటారు. అనుకోకుండా ఆమె ఒకసారి న్యూయార్క్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో చేరుతుంది. శ్రీదేవి ఇంగ్లీష్ పై పట్టు సాధించడానికి ఏం చేసింది? అనేది తర్వాతి కథ.
పెర్ఫార్మెన్స్ : శశి పాత్రకు శ్రీదేవి పర్ ఫెక్టుగా సూటయింది. ఆ పాత్రలో వేరొకరిని ఊహించుకోలేం. తన నటన, అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు తన హావభావాలతో ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించింది. శశి భర్త పాత్రలో ఆదిల్ హుస్సేన్ ఇమిడిపోయాడు. ఆమె అక్క కూతురు పాత్రలో ప్రీయా ఆనంద్ పరిమిత పాత్రలో కనిపించింది. ఫ్రెంచ్ యాక్టర్ మెహ్ది నెబ్బు తన ఫ్రెంచి యాసతో ప్రేక్షకుల మది దోచాడు. ఇక హిందీ వెర్షన్లో అమితాబ్, తమిళ వెర్షన్లో అజిత్ అతిథి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
విశ్లేషణ : దర్శకురాలు గౌరీ షిండే ఒక ఫ్రెష్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యారు. సినిమాను ప్రేక్షక రంజకంగా తీర్చి దిద్దారు. సినిమాలో బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే నడిపించారు. స్క్రిప్టు పర్ ఫెక్టుగా రాసుకుని, దానికి తగిన విధంగా నటీనటులను ఎంచుకుని, బ్యాలెన్డ్స్ గా ముంగిపు ఇవ్వడంలో గౌరీ షిండే సఫలం అయ్యారు. కమర్షియల్ అంశాలు లేవనే పాయింట్ తప్ప సినిమాలో మైనస్ పాయింట్లే ఏమీ లేవు.
తీర్పు : ఓవరాల్ గా సినిమా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్, తప్పకుండా చూడాల్సిన సినిమా. శ్రీదేవి రీ ఎంట్రీ ఊహించిన దానికంటే బెటర్ గా ఉంది. గతంలో రీ ఎంట్రీ ఇచ్చిన మాధురి దీక్షిత్(ఆజా నచ్ లే), కరిష్మా కపూర్(డేంజరస్ ఇష్క్) చిత్రాలతో పోలిస్తే....శ్రీదేవి రీ ఎంట్రీ సినిమా 'ఇంగ్లీష్ వింగ్లిష్' ఎంతో బాగుంది.


Click it and Unblock the Notifications











