Euphoria First Review: యుఫోరియా తెలుగు మూవీ ఫస్ట్ రివ్యూ

ధురంధర్ మూవీతో దేశవ్యాప్తంగా విశేషంగా పాపులారిటీని సంపాదించుకొన్న సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యుఫోరియా. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమా గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా, రాగిణి గుణ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో భూమికా చావ్లా, గౌతమ్ మీనన్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృథ్వీరాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకావ్, నవీనా రెడ్డి, సాయి శ్రీనికా రెడ్డి తదితరులు నటించారు.

యూత్ ఓరియెంటెడ్, సామాజిక సమస్యల ఆధారంగా, కొన్ని వాస్తవ సంఘటనల స్పూర్తిగా తీసుకొని రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్, సోషల్ డ్రామాకు కాల భైరవ సంగీతం అందించగా, ప్రవీన్ కే పోతన్ సినిమాటోగ్రఫిని, ప్రవీణ్ పుడి ఎడిటింగ్ బాధ్యతలను, శ్రీనివాస్ కళింగ ఆర్ట్ డైరెక్షన్స్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాపై సెన్సార్ అధికారులు రివ్యూ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? ఈ చిత్రంపై వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Euphoria Censor Review

సమాజంలో పేరుకుపోతున్న డ్రగ్స్ కల్చర్. వాటి వల్ల యువతీ, యువకుల్లో చోటు చేసుకొంటున్న దుష్పరిణామాలు బ్యాక్ డ్రాప్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ అధికారులు కంటెంట్ గురించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే కంటెంట్ విషయంలో రాజీ పడలేని చిత్ర యూనిట్ వారు సూచించిన కొన్ని మార్పులు, చేర్పులు చేయడానికి విముఖత ప్రదర్శించారు. కంటెంట్ మార్చడం ద్వారా స్టోరీలోని సోల్ దెబ్బ తింటుందని చిత్ర నిర్మాత, దర్శకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అయితే ఈ మూవీ కథ విషయంలో దర్శకుడు ఆలోచించిన విధానం, కథను, పాత్రలను నేటి సమాజంలోని పరిస్థితులకు అద్దంపట్టేలా తెరకెక్కించిన తీరుపై సెన్సార్ అధికారులు ప్రశంసలు గుప్పించారు. సామాజిక బాద్యతగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంపై అభినందించారు. అయితే చిత్ర యూనిట్ అభిప్రాయలను పరిగణనలోకి తీసుకొని ఈ సినిమాను A సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దాంతో ఈ సినిమాను 18 సంవత్సరాలు దాటిన వారు చూడాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు ఈ సినిమాను వీక్షించడానికి అనుమతులు ఉండవనే విషయాన్ని సెన్సార్ సర్టిఫికెట్‌లో స్పష్టంగా తెలిపారు.

యూఫోరియా సినిమా అత్యంత భావోద్వేగంతో కూడిన కథ, ఇంటెన్స్ సన్నివేశాలు. డ్రగ్ కల్చర్, మహిళలపై లైంగిక దాడి, సంపన్న వర్గాల యువతీ, యువకుల జీవనశైలి ఇలాంటి అంశాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. సమాజంలోని ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా సినిమాను, సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సినిమా సవివరంగా చెప్పేందుకు స్వేచ్ఛను తీసుకొన్నారు. దాంతో ఈ మూవీని 2.30 గంటల నిడివిని అంటే.. 150 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు అని చిత్ర యూనిట్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X