పాత పచ్చడే, కానీ...

By Staff

Evandoy Sreevaru
విడుదల తేదీ: 22-04-2006
నటీనటులు: శ్రీకాంత్‌, స్నేహ, నికిత, ఎం. ఎస్‌. నారయణ,
రమాప్రభ, సునీల్‌, శరత్‌బాబు, హేమ, వేణుమాధవ్‌,
ధర్మవరం, కృష్ణభగవాన్‌, లక్ష్మీపతి తదితరులు
కథ: ఉదయరాజ్‌
మాటలు: మరుదూరి రాజా
కెమెరా: శ్రీరాం ప్రసాద్‌
ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌
సంగీతం: శ్రీకాంత్‌ దేవా
నిర్మాత: దశరథ రాజు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ. సత్తిబాబు

కథల కరువో, కంఫర్ట్‌ జోన్‌పై నమ్మకమో గానీ తెలుగు సినిమా పాత హిట్ల చుట్టూ పరిభ్రమిస్తోంది. తాజాగా 'ఓ చిన్నదానా' వంటి కామెడీలు అందించిన దర్శకుడు 'రాధా గోపాలం' జంటతో 'సంతోషం' సినిమాను మళ్లీ అందించారు. ఓపెనింగ్స్‌ కూడా సరిగా లేని ఈ సినిమాలో సెంటిమెంట్‌, కామెడీ బాగా పండినా ఫ్యామిలీలు, ముఖ్యంగా మహిళల ఆదరణపై విజయం ఆధారపడి వుంటుంది.

రఘుపతి (శరత్‌బాబు) వృత్తికి ఉపాధ్యాయుడైనా తన మాటే కుటుంబంలో చెల్లాలని అనుకునే పెద్ద మనిషి. ఉద్యోగం చేస్తూ తన కాళ్లపై నిలబడిన పెద్ద కూతురు దివ్య (స్నేహ), ఓ పెద్దింటి కుమారుడు సూర్య (శ్రీకాంత్‌)తో ప్రేమలో పడడాన్ని ఒప్పుకోడు. తెగించి ఆమె అతన్ని పెండ్లి చేసుకుంది. ఓ బాబును కని అనుకోని స్థితిలో మరణిస్తుంది. ఆమె చివరి కోరిక తన బాబుని తాతగారి వద్దకు చేర్చమనేది. అర్థం చేసుకున్న ఆమె భర్త పనులన్నీ మానేసి ఆమె అంతిమ కోర్కెను ఎలా తీర్చాడో, మరదలు స్వప్న (నికిత)కు ఎలా దగ్గరయ్యాడనేది మిగతా కథ.

కాకతాళీయమైనా స్క్రేన్‌ప్లే పూర్తిగా పౌర్ణమి చిత్రాన్ని పోలి ఉంది. అదే ఫ్లాష్‌బ్యాక్‌, అలాగే ఫస్టాఫ్‌. కాకపోతే ఇక్కడ ఫ్లాష్‌బ్యాక్‌ అయ్యాక రియల్‌ టైమ్‌లో కొంత కథ నడపటంతో పాత్రలు ముఖాముఖి సంఘర్షణకు అవకాశం ఏర్పడి బోర్‌ రాదు. ఇదే దీని ప్లస్‌ పాయింట్‌. ఇటువంటి చిత్రాల్లో ఫస్టాఫ్‌కి పెద్ద ప్రాముఖ్యం ఉండదు. దాన్ని మొత్తాన్ని స్టోరీ సెటప్‌కు ఉపయోగించుకోవడంతో కథ కదలదు. 'నువ్వొస్తానంటే..' చిత్రం పేరడీతో కామెడీకి ప్రత్యేక ట్రాక్‌ వేసినా బాగానే ఉంది. మరుదూరి రాజా మాటలు మధ్య మధ్యలో పేలాయి. దర్శకత్వం సాదాసీదాగా వుంది. పాటల్లో 'అడిగా బ్రహ్మని...' మెలోడిగా బాగుంది. నటీనటులు కొత్త సన్నివేశాలు లేకపోవడంతో పాతగా ఎప్పటిలాగానే చేశారు. ధర్మవరం, కృష్ణభగవాన్‌ కామెడీ బాగా వున్నా అంగవైకల్యంపై కామెడీ చేయడం అంత ఆరోగ్యకరం కాదు. చంద్రమోహన్‌ సెల్‌లో స్నేహతో మాట్లాడే సీన్‌ బాగా పండింది. మన్మథ రాజా పాట పేరడీ బాగుంది.

ఏదేమైనా, మహిళలను టార్గెట్‌ చేసుకుని తీసినా, కామెడీ, సెంటిమెంటు బాగా పండించటంతో కాలక్షేపానికి ఫరవాలేదనిపించేట్లు తయారైంది. మహిళలు టీవీని వదిలి థియేటర్ల దారి పడితే తప్ప ఈ సినిమాకు విజయం చేకూరదు.

గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X