twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Exposed Web Series Review: అఫైర్స్, రివేంజ్ డ్రామాగా ఎక్స్‌పోజ్‌డ్ వెబ్ సిరీస్

    |

    రేటింగ్: 2.25/5

    టైటిల్: ఎక్స్‌పోజ్‌డ్ (వెబ్ సిరీస్)
    నటీనటులు: చెన్నమనేని వాసుదేవ్ రావు, హర్షిత, శిరీష నూలు, ఆర్జే కాజల్, జశ్వంత్ పడాల తదితరులు
    దర్శకత్వం: విజయ్ కృష్ణ
    మ్యూజిక్: ఎమ్ సాయి మధుకర్
    సమర్పణ: కే రాఘవేంద్ర రావు
    ఎడిటింగ్: వెంకట్ సీహెచ్
    ప్రొడక్షన్: ఆర్కే టెలీషో
    విడుదల తేది : 06-10-2022
    ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (ప్రస్తుతం 5 ఎపిసోడ్ లు)

    టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం పలు చిత్రాలకు సమర్పిస్తున్నారు. ఇటీవల వాంటెడ్ పండుగాడ్ సినిమాను సపర్పించిన ఆయన.. తాజాగా ఎక్స్‌పోజ్‌డ్ అనే వెబ్ సిరీస్ ను సమర్పించారు. మీడియా రంగం నేపథ్యంలో జరిగే ఈ వెబ్ సిరీస్ లో అధికంగా బుల్లితెర తారలు నటించడం విశేషం. అక్టోబర్ 6 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథ:

    కథ:

    గ్రీష్మ (హర్షిత), ఆకాష్ (చెన్నమనేని వాసుదేవ రావు) ఇద్దరు భార్యాభర్తలు. వీరిద్దరు ఎక్స్‌పోజ్‌డ్ 24 అవర్స్ అనే మీడియా ఛానెల్ టాప్ యాంకర్స్ గా పేరు పొందుతారు. అందులో గ్రీష్మ చెప్పిందే వేదం. ఆమెకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాడు ఆ ఛానెల్ సీఈవో. ఓ రిపోర్టర్ కారణంగా అందులో పనిచేసే ఒక యాంకర్ ను రిజైన్ చేస్తుంది. ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే కొత్త యాంకర్ గా వర్ష (శిరీష నూలు) చేరుతుంది. అయితే ఆమె గ్రీష్మ కోసమే ఆ ఛానెల్ లో జాబ్ కోసం ట్రై చేస్తుంది. ఉద్యోగం సంపాదించిన వర్ష.. గ్రీష్మకు బుద్ధి చెప్పాలనుకుంటుంది. గ్రీష్మకు వర్షకు ఉన్న సంబంధం ఏంటీ.. ఎందుకు గ్రీష్మకు వర్ష బుద్ధి చెప్పాలనుకుంటుంది.. గ్రీష్మ వల్ల వర్ష ఏం కోల్పోయిందనేదే కథ.

    విశ్లేషణ:

    విశ్లేషణ:


    ఓ రాజకీయ వేత్త ఒక సెజ్ లో ముడుపులు తీసుకున్నాడని ఆధారాలతో ఆకాష్, గ్రీష్మ నిరూపించడంతో ఎక్స్ పోజ్ డ్ వెబ్ సిరీస్ ప్రారంభం అవుతుంది. తర్వాత గ్రీష్మ వల్లే ఛానెల్ నడుస్తుందని ఆ కంపోనీ సీఈవీ పదే పదే చెప్పడం, ఆమెకు సమస్య తెచ్చే పనులు చేయకూడదని వార్నింగ్ ఇవ్వడం మీడియా సంస్థల్లో పాపులారిటీ ఉన్న వాళ్ల డామినేషన్ ఎలా ఉంటుందో చూపించనట్లుగా తెలుస్తోంది. అలాగే ఆ పాపులారిటీని చూసి వెనక్కి నెట్టే వారు, వారిని ఏదైనా చిక్కుల్లో పడేయాలని చూసేవారు, గాసిప్స్ చెప్పేవాళ్లు కూడా ఉంటారని చూపించారు. అలాగే ఎంతటి మీడియా ఫీల్డ్ అయినా సరే, ఎక్కడైనా వుమనైజర్లు ఉంటారని రిపోర్టర్ క్రిష్ పాత్రతో, స్పోర్ట్ రిపోర్టర్ తో సీఈవో అఫైర్ వంటి సన్నివేశాలతో ఆవిష్కరించారు.

    అలాగే ప్రఫెషనల్, పర్సనల్ విషయాలు ఎలా మారతాయో మంచి ట్విస్ట్ లతో చూపించారు. అంతేకాకుండా మీడియా వాళ్లు టేకప్ చేసే కథనాలు ఒక్కోసారి రాంగ్ సైడ్ లో వెళితే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయి, సాధారణ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనేది చూపించే ప్రయత్నం చేశారు. వాళ్లు కవర్ చేసే స్టోరీల్లో వారికే తెలియకుండా బాధితులు ఇరుక్కుంటారని, అలా ఇరుక్కుని పరువు పోతే ఆత్మహత్య చేసుకుంటారని, అప్పుడు వాళ్లు పడే బాధ ఎలా ఉంటుందనేది చూపించారు. గ్రీష్మ టేకప్ చేసిన ఒక కవరేజ్ మిస్ యూజ్ కావడం, దానివల్ల తన తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో రివేంజ్ తో రగిలిపోయే ఒక అమ్మాయి ఎలా ప్రతీకారం తీర్చుకుందో చూపెట్టే ప్రయత్నం చేశారు. మధ్యతరగతి వాళ్లకు పరువు పోతే ఎలా ఉంటుందో అలానే గ్రీష్మకు తెలిసిరావాలనే చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి.

     ఎవరెలా చేశారంటే..

    ఎవరెలా చేశారంటే..


    పాపులర్ అండ్ పొగరు ఉన్న టాప్ యాంకర్ గ్రీష్మ పాత్రలో బాగా నటించింది హర్షిత. తన గ్లామర్ తో పాటు మంచి నటనను కనబరిచేందుకు ప్రయత్నించింది. ఇక ఆమె భర్తగా తనకంటే ఎక్కువగా అతని భార్య గురించే మాట్లాడుకుంటారని బాధపడే ఆకాష్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు వాసుదేవ్ రావు. సీరియల్స్ లో చేసిన అనుభవం ఆయనకు ఇక్కడ చాలా ఉపయోగపడిందనే చెప్పవచ్చు. ఇక గ్రీష్మ పతనాన్ని కోరుకునే వర్షగా శిరీష్ నూలు బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక ఛీఫ్ ఎడిటర్ గా ఆర్చే కాజల్ చాలా చక్కగా నటించింది. వుమనైజర్, రిపోర్టర్ క్రిష్ గా అవోన్ స్కైస్ అద్భుతంగా నటించాడు. అలాంటి పాత్రకు తన హావాభావాలతో రక్తికట్టించాడు.

    సాంకేతిక అంశాల గురించి..

    సాంకేతిక అంశాల గురించి..


    వెబ్ సిరీస్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఎమ్ సాయి మధుకర్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడింటిగ్ చాలా బాగుంది. అయితే ఇప్పటివరకు సాగిన ఐదు ఎపిసోడ్ లు ఆద్యంతం ఆసక్తిగా కలిగించేలా సాగాయి. ఈ వెబ్ సిరీస్ కు డైరెక్టర్ గా విజయ్ కృష్ణ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. అలాగే అక్కడక్కడ కరుణ వంటి బుల్లితెర తారలు కనిపించడం సర్ ప్రైజింగ్ గా తోస్తుంది.

    ఫైనల్ గా..

    ఫైనల్ గా..


    ఇక మీడియా రంగానికి సంబంధించిన కథతో వచ్చిన ఈ ఎక్స్ పోజ్ డ్ వెబ్ సిరీస్ మొదటి ఐదు ఎపిసోడ్ లు థ్రిల్లింగా ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఇలాంటి ఫార్మాట్ లో ఇప్పటికి చాలానే కథలు వచ్చాయి. కథ పరంగా కొత్తదనం లేకుండా ఆసక్తిగా మలిచిన ఈ వెబ్ సిరీస్ వీకెండ్ లో చూసేందుకు మంచి ఆప్షన్.

    English summary
    K Raghavendra Rao Presented Exposed Web Series Review And Rating In Telugu And Starring By Serial Actor Chennamaneni Vasudev Rao And Harshitha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X