Extra Ordinary Man Review ఫన్ అండ్ ఫ్రస్టేషన్.. నితిన్ హిట్టుకొట్టాడా? ఎక్ట్రా ఆర్డినరీ మేన్ సమీక్ష

Rating:
2.5/5

నటీనటులు: నితిన్, శ్రీలీల, సంపత్ రాజ్, రాజశేఖర్, రావు రమేష్, హరితేజ, సుదేవ్ నాయర్, హర్షవర్దన్, హైపర్ ఆది, పవిత్రా లోకేష్, బ్రహ్మజీ, రోహిణి, అన్నపూర్ణ తదితరులు
రచన,దర్శకత్వం: వక్కంతం వంశీ
నిర్మాత: సుధాకర్ రెడ్డి
మ్యూజిక్: హ్యారీస్ జైరాజ్
సినిమాటోగ్రఫి: ఆర్థర్ ఏ విల్సన్, హెచ్ యువరాజ్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
రిలీజ్ డేట్: 2023-12-08

ప్రతీ రోజు కొత్త అనుభూతి కోరుకొనే అభి (నితిన్) జూనియర్ ఆర్టిస్ట్. ఎప్పటికైనా హీరో కావాలని కలలు కంటుంటాడు. అయితే తన ఇష్టానికి వ్యతిరేకంగా ఉండటంతో అభిపై తండ్రి (రావు రమేష్) కోపం పెంచుకొంటాడు. అలాంటి పరిస్థితిలో యువ పారిశ్రామిక వేత్త లిఖిత (శ్రీలీల)తో ప్రేమలో పడుతాడు. హీరో అవుదామని అనుకొన్న పోలీస్‌గా మారి ఐజీ అర్జున్ బలదేవ్ (రాజశేఖర్) చేతులు కలుపుతాడు.

Extra Ordinary Man Telugu Movie Review and Rating

తండ్రితో అభికి ఏ విషయంలో అభిప్రాయ బేధాలు తలెత్తాయి? కొడుకును మార్చేందుకు తండ్రి చేసిన ప్రయత్నాలు ఏమిటి? లిఖితతో అభి ఎలా ప్రేమలో పడ్డాడు? వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎలా సాగింది? అక్రమ వ్యాపారాలు చేసే బిజినెస్ మ్యాన్ (సుదేశ్ నాయర్)తో వైరుధ్యం ఎందుకు? తాను ఎస్ఐ అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? పోలీస్ ఐజీ బలదేవ్‌తో అభి ఎందుకు చేతులు కలిపాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఎక్ట్రా ఆర్డినరీ మేన్ సినిమా కథ.

దర్శకుడు వక్కంత వంశీ హ్యుమర్, కామెడీకి పెట్టింది పేరు అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్స్ మిక్స్ చేసి కథలను అందించడం ద్వారా మంచి విజయాలను సొంతం చేసుకొన్నారు. తన బలం, బలహీనతలైన అదే జోనర్‌ను మిక్స్ చేసివా ఎక్ట్రా ఆర్డినరీ మేన్ సినిమాను అందించాడు. అయితే బలమైన కథ లేకుండా హ్యుమర్‌తో సన్నివేశాలను రాసుకొని ఓ సవాల్‌తో ముందుకొచ్చాడనిపిస్తుంది. తనకు సౌలభ్యంతో ఉండే కామెడీ ట్రాక్స్ ఫస్టాఫ్‌ను సరదాగా ముందుకు తీసుకెళ్లి కామెడీని పండించాడు.

Extra Ordinary Man Telugu Movie Review and Rating

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. స్క్రిప్టును బేస్ చేసుకొని కథను నడిపించిన విధానం అతడి ప్రతిభకు అద్దంపట్టింది. సెకండాఫ్‌లో రాజశేఖర్ పాత్రను పట్టుకొచ్చి..డ్రాప్ అయిన సినిమాను పట్టాలెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ సెంటిమెంట్, ఎమోషన్స్ ఇంకాస్త ప్లాన్ చేసుకొంటే ఇంకా బెటర్ అయి ఉండేదనిపించింది. ఓవరాల్‌గా చెప్పుకొంటే.. కామెడీ తప్ప కథలో మరో విషయం కనిపించదు.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. గత సినిమాలతో పోల్చుకొంటే నితిన్ బాడీలాంగ్వేజ్, యాటిట్యూడ్ పరంగా ఓపెన్ అయ్యాడు. మంచి ఎనర్జీతో ఉన్న అభి పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా లుక్, స్టైలింగ్ చాలా బాగుంది. తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. ఇక శ్రీలీల రోల్ పెద్దగా స్కోప్ లేకపోయింది. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో అలా కనిపించి ఆటపాటలతో మెప్పించే తప్ప. పెద్దగా నటించడానికి అవకాశం లేకపోయిన రోల్‌లో కనిపించింది. రావు రమేష్ క్యారెక్టర్ లౌడ్ తప్ప ఎమోషన్స్ కనిపించలేదు. రాజశేఖర్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. హైపర్ ఆది బ్యాచ్ కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది.

Extra Ordinary Man Telugu Movie Review and Rating

ఇక ఎక్ట్రా ఆర్డినరీ మేన్ మూవీకి టెక్నికల్ విషయాలకు వస్తే.. సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగం, మ్యూజిక్ విభాగాల పనితీరు బలంగా మారింది. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు రిలీఫ్ ఇచ్చాయని చెప్పవచ్చు. డైలాగ్స్, కామెడీ ట్రాక్‌ను డిజైన్ చేసిన విధానం బాగుంది. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కొంత లెంగ్త్ తగ్గిస్తే సినిమా స్పీడ్ ఇంకాస్త పెరిగి ఉండేదనిపిస్తుంది.

హ్యుమర్, ఎమోషన్స్‌తో నితిన్ ఇమేజ్‌కు తగినట్టుగా రాసుకొన్న టైలర్ మేడ్ మూవీ ఎక్ట్రా ఆర్డినరీ మేన్. బలహీనమైన కథతో వక్కంతం వంశీ చేసిన ప్రయోగమే చెప్పాలి. కానీ తనకు బలంగా ఉండే కామెడీ ఎలిమెంట్స్ మెప్పించే ప్రయత్నం చేశారు. కొత్తదనం లేకుండా రెగ్యులర్ రొటీన్ మూవీగా ఉంటుంది. శ్రీలీల గ్లామర్, డ్యాన్సులు, నితిన్ ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ ఆశించే వారికి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం టైంపాస్ కోసం ఏదైనా సినిమా చూడాలనే వారికి ఈ సినిమాను తమ ఛాయిస్ లిస్టులో చేర్చుకొవచ్చు. అతిగా ఆశపడి వెళితే భంగపాటు ఉంటుంది. కాబట్టి అంచనాలు లేకుండా వెళితే.. కొంత ఫన్.. మరికొంత ఫ్రస్టేషన్ కూడా లభిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X