F1 Movie Review: ఎఫ్1 ది మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: బ్రాడ్ పిట్, డామ్సన్ ఐడ్రీస్, కెర్రీ కాండన్, జేవీయర్ బార్డెమ్, జేవియర్ మెంజీస్, కిమ్ బోడ్నియా తదితరులు
దర్శకత్వం: జోసెఫ్ కిసిన్‌స్కీ
స్క్రీన్ ప్లే: ఎరెన్ క్రూజర్
కథ: జోసెఫ్ కిసిన్‌స్కీ, ఎరెన్ క్రూజర్
నిర్మాతలు: జార్రీ బ్రక్‌హీమర్, జోసెఫ్ కొసిన్‌స్కీ, లెవీస్ హామిల్టన్, బ్రాడ్ పిట్, డేడ్ గార్డనర్, జెరెమీ క్లెనర్ చాడ్ ఓమన్
సినిమాటోగ్రఫి: క్లాడియో మిరాండా
ఎడిటింగ్: స్టెఫాన్ మిర్రివన్
మ్యూజిక్: హాన్స్ జిమ్మర్
బ్యానర్స్: ఆపిల్ స్టూడియోస్, జెర్రీ బ్రక్‌హీమర ఫిల్మ్స్, ప్లాన్ బీ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 20-06-27

ఫార్మూలా 1 రేస్‌లో డ్రైవర్‌గా రాణించిన సన్నీ హెయస్ (బ్రాడ్ పిట్) తాత్కాలికంగా రిటైర్మెంట్ తీసుకొని తన కెరీర్‌కు దూరమవుతాడు. వ్యాన్ డ్రైవర్‌గా ఉద్యోగం చేసుకొంటూ వివిధ ప్రాంతాల్లో సంచరిస్తుంటాడు. అలాంటి వయసుపై బడిన డ్రైవర్‌కు ఏపీఎక్స్‌జీపీ (APXGP) అనే టీమ్‌లో రేసర్‌గా పనిచేయాలని అవకాశం ఇస్తారు. చాలా రోజుల తర్వాత మారిన టెక్నాలజీ పరిస్థితుల నేపథ్యంలో రేసింగ్ డ్రైవర్‌గా హేయస్‌కు అనేక సమస్యలు ఛాలెంజింగ్‌గా మారుతాయి. ముఖ్యంగా తన టీమ్‌లో యువకుడైన జోషువా పియర్స్ (డామ్సన్ ఐడ్రీస్) దూకూడు తట్టుకోవడం, అతడి నుంచి ఎదురైన అవమానాలు భరించడం కష్టంగా మారుతుంది.

F1 The English Movie Review

స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసింగ్ తర్వాత సన్నీ హేయస్ ఎందుకు తన వృత్తి నుంచి తాత్కాలికంగా రిటైర్మెంట్ తీసుకొన్నాడు? ఫార్మూలా వన్ రేసింగ్ డ్రైవర్‌గా సత్తా చాటిన హేయస్ వ్యాన్ డ్రైవర్‌గా ఎందుకు మారాడు? వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న హేయస్‌కు ఫార్మాలా వన్ రేసింగ్ డ్రైవర్‌గా పనిచేయాలని ఏపీఎక్స్‌జీపీ ఎందుకు ఆఫర్ ఇచ్చింది. మళ్లీ ఫార్మూలా వన్ రేసింగ్ ట్రాక్‌ పైకి వచ్చిన హేయస్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు ఫార్మూలా వన్ రేసింగ్ టైటిల్‌ను గెలిచాడా? ఓటమి పాలయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే F1 సినిమా కథ.

టాప్ గన్ మావెరిక్ లాంటి సినిమాను అందించిన జోసెఫ్ కిసిన్‌స్కీ అందించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా F1. ఈ సినిమా కథను ట్రాక్‌పైకి ఎక్కించిన విధానం.. ఆ తర్వాత ట్విస్టులు, టర్న్‌లతో ముందుకు నడిపించిన తీరు బాగుంటుంది. ఫస్టాఫ్‌లో రేసింగ్ ట్రాక్ మీద కథ వేగంగా దూసుకెళ్లకపోయింది. కథను, క్యారెక్టరలను, ఎమోషన్స్‌ను చెప్పడానికి కొంత ఎక్కువగానే సమయం తీసుకొన్నాడు. విజువల్ డ్రామా కాకుండా డైలాగ్ డ్రామాగా ఈ సినిమాను నడిపించడం ఈ మూవీకి ఓ మైనస్ పాయింట్‌గా కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో మళ్లీ రేసింగ్ ట్రాక్‌‌పైకి వచ్చిన హేయస్‌కు ఐడ్రీస్ నుంచి, టెక్నికల్ నిపుణుల నుంచి ఎదురైన సమస్యలు మూవీపై ఆసక్తిని పెంచేలా చేస్తుంది.

ఇక సెకండాఫ్‌‌లో ఉమెన్ టెక్నికల్ డైరెక్టర్ కేట్ మెక్‌కెనా (కెర్రీ కాండన్)తో కెమిస్ట్రీ, ఆ ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు మంచి జోష్ కలిగిస్తాయి. సెకండాఫ్‌లో ట్విస్టులు కథపై బిగించేలా చేస్తాయి. తన కెరీర్‌కు తాడో పేడో‌గా మారిన చివరి టోర్నమెంట్‌లో సన్నీ హేయస్ చూపిన సత్తా ప్రేక్షకుడికి మంచి కిక్ అందించేలా ఉంటుంది. ప్రేక్షకుడిని రేసింగ్ డ్రైవర్ సీటులో కూర్చొబెడితే ఎలాంటి అనుభూతి కలుగుతుందో.. అలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను జోసెఫ్ కిసిన్‌స్కీ అందించడం సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

బ్రాడ్ పిట్ గొప్ప నటుడని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోషన్స్ ఫుల్లుగా ఉండి.. హీరోయిజానికి తక్కువగా స్కోప్ ఉన్న కామన్ మ్యాన్ పాత్ర లాంటి సన్నీ హేయస్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. అవమానాలు తట్టుకొంటూ జీవిత అనుక్షణం పెట్టే పరీక్షలో నెగ్గుకొంటూ వచ్చే పాత్రలో జీవించాడు. భావోద్వేగాలు, రొమాంటిక్, అనుక్షణం సమస్యలను ఎదురించే పాత్రలో నా కంటే ఎవరు బెటర్ అనే విధంగా నటించాడు. ఇక ఈ సినిమాకు బ్రాడ్ పిట్‌కు టఫ్ పోటీ ఇచ్చే జోషువా పియర్స్ పాత్రలో డామ్సన్ ఐడ్రీస్ గొప్పగా నటించడమే కాకుండా ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందేలా పెర్ఫార్మెన్స్ చేశారు. కేట్ మెక్‌కెన్నాగా కెర్రీ కాండన్, జేవియర్ బార్డెమ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో నటించిన వారందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

F1 ది మూవీ సినిమాలోని సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫుల్ మార్కులు కొట్టేశాయి. క్లాడియో మిరాండా రేసింగ్ ట్రాక్‌పై కెమెరాలను పరుగులు పెట్టించారు. లైవ్ ఎక్స్‌పీరియెన్స్ అందించడంతోపాటు గొప్ప అనుభూతిని పంచాడు. ఈ సినిమా హ్యాన్స్ జిమ్మర్ అందించిన మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఫార్మూలా వన్ రేసర్ లెవీస్ హామిల్టన్, మెర్సెడెస్ టీమ్ సీఈవో టోటో వుల్ఫ్ నిర్మాణంలో భాగమయ్యారు. ఈ సినిమా రిచ్ వాల్యూస్, హై స్టాండర్డ్స్‌తో రూపొందాయి.

ప్రొఫెషనల్ రేసింగ్ డ్రైవర్ ఎమోషనల్ కథతోపాటు అడ్వెంచరస్ స్పోర్ట్స్ డ్రామా F1 The Movie. బ్రాడ్ పిట్, ఐడ్రీస్, కెర్రీ కాండన్ యాక్టింగ్ ప్లస్ పాయింట్. టెక్నికల్ అంశాలు, మేకింగ్ వాల్యూస్ ఈ సినిమాను అదనపు బలాన్ని అందించాయి. ఈ సినిమా ఫుల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స ఉన్న చిత్రం. అనుక్షణం థ్రిల్లింగ్ మూమెంట్స్‌ అందిస్తూ కథ సాగుతుంది. స్పోర్ట్స్ డ్రామాలు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందే సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. కాబట్టి ఈ సినిమాను మిస్ చేసుకోకుండా చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X