F1 The Movie Twitter Review: ఎఫ్1 ది మూవీ ట్విట్టర్ రివ్యూ.. బ్రాడ్ పిట్ వన్ మ్యాన్ షో

హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ హీరోగా జోసెఫ్ కోసిన్‌స్కీ దర్వకత్వంలో రూపొందిన అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా F1 (ఎఫ్1). ఫార్మూలా వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ బ్యాక్ డ్రాప్‌లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ సౌజన్యంతో రూపొందిన ఈ సినిమాకు ఎహ్రెన్ క్రూజర్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాకు స్వయంగా బ్రాడ్ పిట్, జెరెమీ క్లీనర్, జెర్నీ బ్రూక్‌హైమర్, డేడ్ గార్డనర్ నిర్మాతలుగా మారారు. జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్ ప్రదర్శన తర్వాత క్రిటిక్స్, నెటిజన్స్ సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

న్యూయార్క్ క్యాబ్ డ్రైవర్, ప్రొఫెషనల్ గ్యాంబ్లర్‌గా బ్రాడ్ పిట్ నటించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను సుమారుగా 300 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2580 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రంలో డామ్సన్ ఐడ్రీస్, కెర్రీ కాండన్, తోబియాస్ మెంజీస్, విల్ మెర్రిక్, సారా నైల్స్, సైమన్ ఆష్లే తదితరులు నటించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, యాపిల్ ఒరిజినల్ ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను న్యూయార్క్ సిటీలోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో జూన్ 16వ తేదీన ప్రీమియర్ షోను నిర్వహించారు. ఈ సినిమా గురించిన నెటిజన్ల కామెంట్స్ ఎలా ఉన్నాయంటే?

F1 The Movie Twitter Review

సన్నీ హేయెస్ (బ్రాడ్ పిట్) ఫార్మూలా వన్ కారు డ్రైవర్. 1990లో జరిగిన రేసింగ్ సందర్భంలో తీవ్రమైన ప్రమాదానికి గురైన ఆయన ఫార్మూలా వన్ రేసింగ్ నుంచి రిటైర్ అవుతాడు. ఆ తర్వాత టాక్సీ డ్రైవర్‌గా మారుతాడు. అయితే రిటైర్మెంట్‌కు స్వస్తి చెప్పి తిరిగి అపెక్స్ గ్రాండ్ ప్రీ టీమ్‌లో పాల్గొనాలని తన స్నేహితుడు కోరుతాడు. ఆ రేసింగ్‌లో సోని హేయస్ పాల్గొన్నాడా? ఆ తర్వాత అతడి జీవితంలో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకొన్నాయనేది ఈ సినిమా కథ.

F1 (ఎఫ్1) మూవీ బ్రిల్లియంట్‌గా ఉంది. ఎఫ్1 ఫ్యాన్స్‌కు కొన్ని సీన్లు అంతగా నచ్చకపోవచ్చు. రేసింగ్ స్పీడ్‌ను క్యాప్చర్ చేసిన విధానం ఇన్‌క్రెడిబుల్. ఈ సినిమాకు జోసెఫ్ కోసిన్‌స్కీ స్క్రీన్ ప్లే ప్లస్ పాయింట్. స్పోర్ట్స్ డ్రామాలో ఇది భారీ సినిమా. లెవిస్ హామిల్టన్ జీవితం ఆధారంగా ఈ లెజెండరీ మూవీని నిర్మించినందుకు కంగ్రాట్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

F1 (ఎఫ్1) మూవీ నేను ఊహించుకొన్నట్టే తీశారు. హై ఆక్టేన్ యాక్షన్ సీన్లు సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించాయి. కథ, కథనాలు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. ఈ సినిమాలో బ్రాడ్ పిట్ ఓ బీస్ట్‌ మాదిరిగా కనిపించాడు. కాక్‌పిట్‌లో కూర్చొన్న అనుభవం లభించలేదు. కానీ అలాంటి అనుభూతిని కలిగించిన చిత్ర యూనిట్ సభ్యులందరికీ థ్యాంక్స్. సాహసోపేతమైన డ్రైవర్ల జీవితాన్ని చూసే భాగ్యం తెర మీద కలిగింది. హాన్స్ జిమ్మర్ కథను కూడా సీక్వెల్‌గా తెరకెక్కిస్తే బాగుంటుందని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.


F1 (ఎఫ్1) మూవీ టెర్రిఫిక్ సమ్మర్ ఎంటర్‌టైన్‌మెంట్. వీలైతే బిగ్ స్క్రీన్‌పైన ఈ సినిమాను ఎక్స్‌పీరియెన్స్ పొందండ. ఈ సినిమాకు సాలీడ్ ఆత్మను, స్టైల్‌ను, ఎనర్జీని జోసెఫ్ కోసిన్‌స్కీ అందించారు. బ్రాడ్ పిట్, ఐడ్రీస్, ఇతర నటీనటులు అద్బుతంగా నటించచారు. హాన్స్ జిమ్మర్ అందించిన రేసింగ్, థ్రిల్లింగ్ మూమెంట్స్ బాగున్నాయి అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

F1 (ఎఫ్1) మూవీ చూసి నా బుర్ర తిరిగిపోయింది. ఈ సినిమాలోని స్పీడ్ నాకు లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్ అందించింది. బ్రాడ్ పిట్ యాక్టింగ్ వావ్ అనిపించేలా ఉంది. ఐమాక్స్ వెర్షన్‌లో సినిమాను చూడటం థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఫార్ములా 1 రేసింగ్ కారులో కూర్చొంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో..అలాంటి అనుభూతిని ఈ సినిమా అందించింది. ఈ సినిమాను తప్పకుండా చూడండి అంటూ నెటిజన్ తన అనుభూతిని తెలిపాడు.


F1 (ఎఫ్1) మూవీ అద్బుతంగా ఉంది. జోసెఫ్ కోసిన్‌స్కీ మరోసారి అద్బుతమైన కథతో మంచి సినిమాను అందించాడు. ఈ సినిమా ఫన్, ఎనర్జీ, ఎంగేజింగ్‌గా ఉంది. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు థ్రిల్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. ఈ సమ్మర్ సీజన్‌ను గ్రేట్ మూవీతో స్టార్ట్ అయింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X