twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    F2 – Fun and Frustration Movie Review ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్ రివ్యూ | Filmibeat Telugu

    Rating:
    3.5/5
    Star Cast: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్
    Director: అనిల్ రావిపూడి

    విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. వరుణ్ యూత్‌ను ఆకట్టుకునే హీరో. ఇలాంటి హీరోల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్. బొమ్మరిల్లు, శతమానం భవతి లాంటి ఫీల్‌గుడ్ అందించిన నిర్మాత దిల్ రాజు, పటాస్, రాజా ది గ్రేట్ లాంటి మాస్ ఎంటర్టైనర్ చిత్రాలను అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ మూవీ జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేష్, వరుణ్ కాంబినేషన్ వర్కవుట్ అయిందా? తమన్నా, మెహ్రీన్ అందాలు ఆకట్టుకొన్నాయా? దిల్ రాజు, అనిల్ రావిపూడి ఖాతాలో విజయం చేరిందా అని తెలుసుకోవాలంటే కథ, కథనాలు తెలుసుకోవాల్సిందే.

    ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్ స్టోరీ

    ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్ స్టోరీ

    ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేసే వెంకీ (వెంకటేష్)కి హారిక (తమన్నా)తో పెళ్లి జరుగుతుంది. తొలి ఆర్నెళ్లు ఎంజాయ్‌గా గడిచిపోతుంది. ఆ తర్వాత ఇగోలు, అభిప్రాయాలు తలెత్తుతాయి. దాంతో వెంకీ జీవితంలో ఫ్రస్టేషన్ మొదలవుతుంది. ఇక వరుణ్ (వరుణ్ తేజ్) తమన్నా చెల్లెలు హానీ (మెహ్రీన్‌)తో ప్రేమలో ఉంటాడు. వెంకీ వేసిన ఎత్తు విఫలమై వరుణ్, మెహ్రీన్ పెళ్లి కుదురుతుంది. కానీ పెళ్లికి ముందే అత్తారింటి, ప్రియురాలి టార్చర్‌తో జీవితం నరకంగా మారుతుంది. ఇక పొరుగింటి వ్యక్తి (రాజేంద్ర ప్రసాద్) సలహాతో పెళ్లి పీటల మీద నుంచి వరుణ్‌తోపాటు వెంకీ యూరప్‌తో పారిపోతారు. వరుణ్, వెంకీ, రాజేంద్రప్రసాద్ యూరప్‌‌లో ఓ కేసులో ఇరికిపోతారు. ఆ తర్వాత భర్తను, ప్రియుడ్ని వెతుకుంటూ అక్కాచెల్లెలు యూరప్ వచ్చి దొరస్వామి (ప్రకాశ్ రాజ్) ఇంట్లో చేరుతారు?

    ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్విస్టులు

    ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్విస్టులు

    యూరప్‌కు వెళ్లిన తర్వాత తమన్నా, మెహ్రీన్ పరిస్థితి ఏంటి? యూరప్‌కు వెళ్లిన తర్వాత వరుణ్, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ ఎలా ఫన్ చేశారు? వారు కేసులో ఇరుక్కుపోవడానికి కారణమేంటి? ఈ కథలో దొరస్వామి (ప్రకాశ్ రాజ్) పాత్ర ఏంటి? భర్తను, ప్రియుడ్ని వదలిసే దొరస్వామి ఇద్దరు కొడుకులను తమన్నా, మెహ్రీన్ ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. భార్య, ప్రేయసిల పెళ్లిని చెడగొట్టడానికి ఎలాంటి ఎత్తులు వేశారు? ఈ కథలో నూతన్ నాయుడు, వెన్నెల కిషోర్ దొరైస్వామిని ఎందుకు చంపాలని ప్రయత్నిస్తుంటారు. అనసూయ పాత్ర కథకు ఎలా కీలకంగా మారింది? చివరకు భార్య, ప్రేయసిలను వెంకీ, వరుణ్ ఎలా దక్కించుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా.

    ఫస్టాఫ్‌లో

    ఫస్టాఫ్‌లో

    యూరప్‌లో పోలీస్ అధికారి (నాజర్)కు పట్టుబడిన వెంకీ, వరుణ్, రాజేంద్రప్రసాద్‌ తమ బాధలు చెప్పడంతో సినిమా ఫ్లాష్ బ్యాక్‌తో ప్రారంభమవుతుంది. వెంకీ, హారికల పెళ్లిచూపులు అంశంతో తెరపైన కామెడీ మొదలవుతుంది. సినిమా మొదటి సీన్ నుంచే బ్రహ్మండమైన కామెడీతో సాగుతుంది. పెళ్లిచూపులు ఎపిసోడ్‌ ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తుంది. తొలిభాగంలో ఎమ్మెల్యే (రఘుబాబు), వెంకీ మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్‌గా ఉంటాయి. ఇక భార్య పెట్టే టార్చర్‌తో ఫ్రస్టేషన్‌ ఊగిపోయే వెంకీ నటన మరింత వినోదాన్ని పంచుతూ సాగుతుంది. బోరబండలో వరుణ్ చేసే హంగామా సినిమాను ఫుల్ ఎంటర్‌టైన్‌గా మారుస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే పెళ్లి షాపింగ్ సన్నివేశాలు బ్రహ్మండంగా పేలాయి.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి కథ యూరప్‌లో మొదలవుతుంది. దొరస్వామి ఇళ్లు కథకు అడ్డాగా మారుతుంది. ఒకే చోట అన్ని పాత్రలను చేర్చడంతో వినోదం పండుగ భోజనంలా మారుతుంది. కాకపోతే ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ తర్వాత సెంకడాఫ్‌లో వినోదం పాళ్లు రొటీన్‌గా అనిపిస్తుంది. కాస్త డోస్ తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ పాత్ర బిహేవ్ చేసే తీరుతో కామెడీ డోస్ మాత్రం తగ్గకుండా కథ సాగుతుంది. సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్, నూతన్ కామెడీ ట్రాక్ అదనపు ఆకర్షణగా మారుతుంది. అలాగే దొరస్వామి సోదరుడిగా ఫృథ్వీ చేసిన గుండె జబ్బు అల్లరి ఆకట్టుకొనేలా ఉంది. చివర్లో వచ్చినా గానీ అనసూయ పాటతోపాటు ఒకట్రెండు సన్నివేశాలతో ఇరుగదీసింది. భార్య, భర్తల మధ్య అవగాహన ఉంటే జీవితం ఆనందమయం అనే చక్కటి సందేశంతో ఎఫ్2 ముగుస్తుంది.

     అనిల్ రావిపూడి టాలెంట్

    అనిల్ రావిపూడి టాలెంట్

    ఎఫ్2 కథను అల్లుకోవడంలో గానీ, కథలో పలు పాత్రలను జొప్పించి, సినిమాను ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి రాసుకొన్న స్ట్రిప్టు, డైలాగ్స్ అదుర్స్ అనిచెప్పవచ్చు. పాత్రల మధ్య సమతూకం పాటించిన తీరును అభినందించాల్సిందే. అలాగే మల్టీస్టారర్‌లో ఉండే ఇబ్బందుల ఎక్కడ కనిపించకుండా అనిల్ తన ప్రతిభకు పదునుపెట్టాడని చెప్పవచ్చు. ఎఫ్2లో చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. ఏ పాత్రకు కూడా అన్యాయం చేసినట్టు కనిపించదు. అదే సినిమాను హాస్యంతో పరుగులు పెట్టించడానికి కారణమైంది. ఈ సినిమా విజయంలో నూటికి నూరు పాళ్ల క్రెడిట్ అనిల్ రావిపూడిదే అని చెప్పవచ్చు.

    వెంకీ నటన కామెడీ టైమింగ్

    వెంకీ నటన కామెడీ టైమింగ్

    రెండేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన వెంకీ తెర మీద చెలరేగిపోయాడు. కామెడీ టైమింగ్ సూపర్‌గా ఉంటుంది. అత్తవారింటిలో వెంకీ చూపించిన హావభావాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు దోహదపడ్డాయి. డ్యాన్సులు, పాటలు, పంచ్ డైలాగ్స్ విసరడంలో సహజత్వం కనిపించింది. వెంకీ తన పాత్రలో ఒదిగిపోయాడనే కంటే పరకాయ ప్రవేశం చేశాడని చెప్పవచ్చు.

    వరుణ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్

    వరుణ్ తేజ్ ఫెర్ఫార్మెన్స్

    ఇక బోరబండ వరుణ్‌గా వరుణ్ తెలంగాణ భాషతో ఆకట్టుకొన్నాడు. తెలంగాణలో పూర్తి స్వచ్ఛత లేకపోయినా దాదాపు యాసతో మెప్పించాడనే చెప్పవచ్చు. వెంకీ పక్కన జూనియర్ అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించకుండా డైలాగ్స్‌, యాక్షన్‌తో ఫటాఫట్ మనిపించాడు. మాస్, కామెడీ పాత్రలకు ఏమాత్రం తీసిపోనని వరుణ్ నిరూపించుకొన్నాడని చెప్పవచ్చు.

    గ్లామరస్‌గా తమన్నా, మెహ్రీన్

    గ్లామరస్‌గా తమన్నా, మెహ్రీన్

    తమన్నా, మెహ్రీన్ తెర మీద అందాలను కుమ్మరించడమే కాకుండా అభినయంతోనూ ఆకట్టుకొన్నారు. సీనియర్ నటుల మధ్య తమన్నా, మెహ్రీన్ మరోసారి మంచి నటన కనబరిచారు. స్విమ్ సూట్స్, చీరల్లో మరింత గ్లామర్‌గా కనిపించారు. గత చిత్రాలతో పోల్చుకొంటే తమన్నా, మెహ్రీన్‌లు యాక్టింగ్ పరంగా మెచ్చురిటీ కనిపించింది. పాటల పోటీ ఎపిసోడ్, పెళ్లి చూపుల మెహ్రీన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. తమన్నా ఎమోషనల్ సీన్లలో నటన బాగుంది.

    కీలక పాత్రల్లో

    కీలక పాత్రల్లో

    ప్రకాశ్ రాజ్, నాజర్ పాత్రలు ఈ సినిమాకు వెన్నుముక లాంటింది. కామెడీ అంశాల మధ్య ఎమోషనల్ కంటెంట్‌తో కూడిన పాత్రల ద్వారా బ్రహ్మండమైన కామెడీ పండించవచ్చని చూపించారు. యూరప్‌లో సంపన్నుడిగా ప్రకాశ్ రాజ్, పోలీస్ అధికారిగా నాజర్ నటనను ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. ఇక సెకండాఫ్‌లో డాన్‌గా వెన్నెల కిషోర్, అతని అసిస్టెంట్‌గా నూతన్ నాయుడు ఎపిసోడ్ స్పెషల్ ఎట్రాక్షన్. వారిద్దరి కాంబినేషన్ సీన్లు ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. బిగ్‌బాస్ ఫేం నూతన్ నాయుడికి మొదటి సినిమా అయినా ఆకట్టుకొన్నాడు. ఒకట్రెండు సీన్లతో శ్రీనివాసరెడ్డి కామెడీని పండించాడు.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    తమన్నా తల్లిగా ప్రగతి, వరుణ్ తేజ్ తల్లిగా ఝాన్సీ తమ పాత్రల పరిధి మేరకు ఫర్యాలేదనిపించారు. అలాగే సీనియర్ నటుడు ప్రదీప్ ‘అంతేగా' అంటూ కేవలం ఒకే ఒక డైలాగ్‌తో మంచిమార్కులు కొట్టేశారు. అలాగే తమన్నా తండ్రిగా చేసిన నటుడు సీరియల్స్‌ పిచ్చితో అలరించాడు. తమన్నా బామ్మలుగా నటించిన అన్నపూర్ణ, వై విజయ కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. వరుణ్ స్నేహితుడిగా ప్రియదర్శి రోల్ చిన్నదైనప్పటికీ తన పాత్రకు న్యాయం చేశాడు.

    సినిమాటోగ్రఫి, ఆర్ట్ వర్క్

    సినిమాటోగ్రఫి, ఆర్ట్ వర్క్

    సాంకేతిక అంశాల్లో సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. తెరనిండా పాత్రలను నింపండంలో అద్భుతమైన బ్యాలెన్స్ కనిపించింది. ఉపయోగించిన కలర్ ప్యాటర్న్ తెరను మరింత అందంగా మార్చింది. యూరప్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు కన్నుల పండువగా ఉన్నాయి. ప్రకాశ్ రాజ్ ఇంటిని డిజైన్ చేసిన ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ విభాగం వర్క్ బాగుంది. సినిమాలో కనిపించే ప్రతీ ఇల్లు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.

     మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మ్యూజిక్, ప్రొడక్షన్ వ్యాల్యూస్

    దేవీ శ్రీ ప్రసాద్ అందించిన రీరికార్డింగ్‌ సినిమాకు అదనపు ఆకర్షణ. అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కామెడీ సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి. పాటలు ఒకట్రెండు తప్ప పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సెకండాఫ్‌లో వచ్చే పాటలు చప్పగా సాగాయి. దిల్ రాజు నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. పాత్రలను నింపడంలోనూ, సన్నివేశాలను అందంగా తీర్చడానికి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని ఫీలింగ్ కలుగుతుంది. పాత్రలకు నటీనటుల ఎంపిక కూడా సినిమాకు ప్లస్ అయింది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    భార్య, భర్తల మధ్య ప్రేమానురాగాలు, కలహాలు కలబోసిన వడ్డించిన సినిమా ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్. పండుగ పూట కావాల్సినంత వినోదం ఈ సినిమా దొరుకుతుందనేది గ్యారెంటి. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మంచి సంతృప్తిని ఇచ్చే విందు భోజనంలా ఉంటుంది. కుటుంబ సమేతంగా వెళ్లి ఎలాంటి చీకు చింతా లేకుండా చూసే సినిమా ఎఫ్2 అని చెప్పవచ్చు.

     బలం, బలహీనత

    బలం, బలహీనత

    ప్లస్ పాయింట్స్

    • వెంకటేష్, వరుణ్ యాక్టింగ్
    • తమన్నా, మెహ్రీన్ గ్లామర్
    • హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ
    • కథ, కథనాలు
    • అనిల్ రావిపూడి స్క్రిప్టు, టేకింగ్
    • మైనస్ పాయింట్స్

      • సెకండాఫ్‌లో కొంత రొటీన్‌గా ఉండటం
      • ద్వితీయార్థంలో నిడివి
      • తెర వెనుక, తెర ముందు

        తెర వెనుక, తెర ముందు

        నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, ఝాన్సీ, వెన్నెల కిషోర్, ప్రియదర్శిన పులికొండ, అనసూయ భరద్వాజ్, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై విజయ, నాజర్
        రచన, దర్శకుడు: అనిల్ రావిపూడి
        నిర్మాత: దిల్ రాజు
        మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
        సినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డి,
        ఎడిటింగ్: తమ్మిరాజు
        ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్
        బ్యానర్: వెంకటేశ్వర క్రియేషన్
        రిలీజ్: 2019-01-12

    English summary
    F2 – Fun and Frustration comedy film, produced by Dil Raju on Sri Venkateswara Creations banner and directed by Anil Ravipudi. Starring Venkatesh, Varun Tej, Tamannaah Bhatia, Mehreen Pirzada in the lead roles and music composed by Devi Sri Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X