For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  F3 Movie Review.. నో ఫన్.. ఓన్లీ ప్రస్టేషన్.. నిరాశ పరిచిన అనిల్ రావిపూడి

  |

  Rating:
  2.5/5
  Star Cast: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్, పూజా హెగ్డే
  Director: అనిల్ రావిపూడి

  Recommended Video

  F3 Movie Review కుంభస్థలం కొట్టిందా? గురి తప్పిందా? | Filmibeat Telugu

  టాలీవుడ్‌లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన F2 చిత్రానికి ఫ్రాంచైజీగా F3 చిత్రం రూపొందింది. ఈ సారి అదనంగా ఫ్యామిలీ, ఫైనాన్స్ అనే ట్యాగ్ లైన్ జోడించి డబ్బు అనే పంచభూతం చుట్టూ కథను అల్లారని ప్రమోషన్స్‌లో గట్టిగా ప్రచారం చేశారు. అయితే ఆరో పంచభూతం ప్రేక్షకులను కనికరించిందా? ఫ్రాంచైజీ మేకర్స్‌కు ఎలాంటి ఫలితాన్ని అందించింది? ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యారా? అనే విషయాలను తెలుసుకోవాలంటే.. F3 సినిమా గురించి సమీక్షిద్దాం పదండి..

  F3 కథ ఏమిటంటే?

  F3 కథ ఏమిటంటే?

  డబ్బే సర్వస్వంగా బతికే పారిశ్రామికవేత్త ఆనంద్ ప్రసాద్ (మురళీ శర్మ). కష్టపడకుండా ఏదో మాయ చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కనే వెంకీ (వెంకటేశ్), వరుణ్ (వరుణ్ తేజ్). మంగ టిఫిన్ సెంటర్‌ నడిపిస్తూ.. కూతుళ్ల అందచందాలతో అప్పనంగా డబ్బు సంపాదించే ప్లాన్స్‌లో కుటుంబం (తమన్నా, మెహ్రీన్, వై విజయ, అన్నపూర్ణ, ప్రదీప్). అయితే డబ్బు కొట్టేయడం కోసం ఈ బ్యాచ్ అంతా ఆనంద్ ప్రసాద్ ఇంట్లో తిష్ట వేస్తారు.

  F3 మూవీలో ట్విస్టులు

  F3 మూవీలో ట్విస్టులు

  డబ్బు కోసం అత్యాశ పడే వెంకీ, వరుణ్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మంగ టిఫిన్ సెంటర్ టీమ్ ఎలాంటి మోసాలకు పాల్పడ్డారు. వెంకీ, వరుణ్‌ను మంగ టిఫిన్ సెంటర్ బ్యాచ్‌ ఎలా ఆడుకొన్నారు? డబ్బే ప్రపంచంగా బతికే ఆనంద్ ప్రసాద్‌కు ఎదురైన సమస్య ఏమిటి? ఆనంద్ ప్రసాద్‌ డబ్బును ఎందుకు వెంకి, వరుణ్ కొట్టేయాలని అనుకొంటారు? ఆనంద్ ప్రసాద్‌కు ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు వెంకీ, వరుణ్, మంగ టిఫిన్ సెంటర్ బ్యాచ్ ఎలా ప్లాన్ చేశారు. ఆనంద్ ప్రసాద్ సమస్య తీరిందా? రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలుకొన్న వెంకీ, వరుణ్ ఎలాంటి గుణపాఠం నేర్చుకొన్నారు. ఇలాంటి వ్యక్తులను డబ్బు ఎలాంటి ఆటలు ఆడించిందనే ప్రశ్నలకు సమాధానమే F3 సినిమా.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఫస్టాఫ్ అనాలిసిస్

  ఆనంద ప్రసాద్ (మురళీ శర్మ)కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో కథను సీరియస్‌గా ప్రారంభించినప్పటికీ.. వెంకీ, వరుణ్, మంగ టిఫిన్ సెంటర్ బ్యాచ్‌ ఎంట్రీతో కొంత కామెడీగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ఫన్‌గా సాగుతాయి. కథ సాగే కొద్ది చవకబారు సన్నివేశాలు, పేలవమైన సీన్లు, కథ కోసం కాకుండా అప్పటికప్పుడు సన్నివేశం కోసం రాసుకొన్న సీన్లు సహనానికి పరీక్ష పెడుతాయి. కథను సరైన దిశకు నడిపించే సరుకు సినిమాలో లేకపోవడంతో నాసిరకం ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చారు.

  సెకండాఫ్ ఎలా ఉందంటే..

  సెకండాఫ్ ఎలా ఉందంటే..

  ఆనంద్ ప్రసాద్ వారసుడి శోధన అనే ఎమోషనల్ పాయింట్‌కు వినోదం జోడించడంలో అనిల్ రావిపూడి ఫెయిల్యూర్ ఇంటర్వెల్ తర్వాత మొదలవుతుంది. ఆ వైఫల్యం చివరి వరకు అలానే కొనసాగడమే కాకుండా ప్రేక్షకుల్లో ఫన్‌కు బదులు ఫ్రస్టేషన్‌ను నింపేలా చేసింది. తమన్నా, సోహాల్ చౌహాన్ ఎపిసొడ్ డిజాస్టర్ అటెంప్ట్. ఇక, హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రే కనిపించదు. క్లైమాక్స్ కోసం పరుగులు పెడుతూ సన్నివేశాలను జొప్పించినట్టు సెకండాఫ్ సాగుతుంది.

  డబ్బు చేసుకోవడానికి అనిల్ రావిపూడి

  డబ్బు చేసుకోవడానికి అనిల్ రావిపూడి

  F2 సక్సెస్ తర్వాత ఏర్పడిన పాజిటివ్ బజ్‌ను డబ్బు చేసుకోవడానికి అనిల్ రావిపూడి చేసిన ప్రయత్నమే కనిపిస్తుంది. కథ, కథనాలను బలంగా రాసుకొనే ప్రయత్నం చేయలేదనే స్పష్టంగా కనిపిస్తుంది. F3 విషయంలో అనిల్ రావిపూడి బ్యాడ్ రైటింగ్ ప్రతీ చోట కనిపిస్తుంది. అనిల్ రావిపూడికి ప్రస్తుత స్టేటస్‌కు అటెంప్ట్ చేయాల్సిన కథే కాదు. ఈ సినిమా అనిల్ రావిపూడిని నాలుగు మెట్లు దిగజారేలా చేసింది అని చెప్పవచ్చు. తెర మీద క్యారెక్టర్లలో ఫన్ కనిపించింది కానీ.. ప్రేక్షకుల్లో నవ్వించేంతగా మాత్రం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

  వెంకటేష్, వరుణ్ తేజ్ ఫెర్పార్మెన్స్

  వెంకటేష్, వరుణ్ తేజ్ ఫెర్పార్మెన్స్

  F3 సినిమాలో నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పేలవమైన, నాసిరకం స్క్రిప్టును కూడా యావరేజ్ మూవీగా చేసేందుకు వెంకటేష్, వరుణ్ తేజ్ చేసిన ప్రయత్నాలు అభినందనీయం. డిఫరెంట్ వేరియేషన్స్‌తో వెంకటేష్, వరుణ్ చేసిన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్‌తో కొంతైనా న్యాయం జరిగింది. నత్తితో వరుణ్ తేజ్ చేసిన ఫెర్ఫార్మెన్స్ సినిమాలో హైలెట్‌గా చెప్పుకోవచ్చు. రేచీకటికి సంబంధించిన సీన్లలో వెంకటేశ్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు.

  మిగితా ఆర్టిస్టుల గురించి..

  మిగితా ఆర్టిస్టుల గురించి..

  మిగితా ఆర్టిస్టుల విషయానికి వస్తే.. తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాదా, సోనాల్ చౌహాన్ తెరపైన కనిపించినా కథలో ఎంత వెతికినా కనిపించరు. బలహీనమైన క్యారెక్టరైజేషన్ కారణంగా వారు కూడా ఏమీ చేయలేకపోయారు. ఫస్టాఫ్‌లో మెహ్రీన్ కొంత ఫర్వాలేదనిపిస్తుంది. మగ గెటప్‌లో తమన్నా మరీ అన్యాయంగా కనిపిస్తుంది. సోనాల్ చౌహాన్‌ ఆటలో అరటిపండుగా కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ల్యాండ్ కబ్జా, కొన్ని సీన్లలో సునీల్ తన హాస్యంతో పూర్వవైభవాన్ని చూపే ప్రయత్నం బాగుంది. మురళీ శర్మ భావోద్వేగమైన నటన సినిమాకు ఎక్కడ పాజిటివ్‌గా మారలేకపోయింది. సీరియస్ క్యారెక్టర్‌లో సంపత్ రాజ్ జోకర్‌గా మారింది.

  సాంకేతిక విభాగాల పనితీరు..

  సాంకేతిక విభాగాల పనితీరు..

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. కానీ పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తాతయ్యా.. తాతయ్యా హో మ్యూజిక్ ప్రయోగం బాగుంది. కొంత ఫన్ క్రియేట్ చేసింది. కథలో విషయం లేకపోవడం వల్ల సినిమాటోగ్రాఫర్‌కు పెద్దగా పనిలేకపోయింది. ఎడిటింగ్ ఒకే అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ పనితీరు మరీ నాసిరకంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే సినిమాను అదరబాదరగా చుట్టేసినట్టు కనిపిస్తుంది. దిల్ రాజు బ్యానర్, సంస్థ అంటే క్వాలిటీ మేకింగ్, ఉన్నత విలువలతో ఫ్యామిలీ సినిమాలు చేస్తారనే ఒపీనియన్ బలంగా ఉంటుంది. F3 విషయానికి వస్తే.. ఆ ప్రతిష్టను దారుణంగా దిగజార్చే విధంగా ఉంటుంది.

   F3 గురించి ఫైనల్‌గా

  F3 గురించి ఫైనల్‌గా

  కథ, కథనాలు, బలమైన సన్నివేశాలు లేకుండా F2 సినిమా క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి చేసిన నాసిరకమైన ప్రయత్నం F3 మూవీ. కథాపరంగా విలువలు లేకుండా.. ఫన్ పేరుతో చేసిన అతుకుల బొంత అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. వెంకటేష్, వరుణ్ తేజ్ డిఫరెంట్ ఫెర్ఫార్మెన్స్ కోసం వీలుంటే ఓ సారి చూడవచ్చు. ఎలాంటి లాజిక్స్ ఆశించకుండా, అంచనాల లేకుండా సినిమాకు వెళితే యావరేజ్ ఫన్ లభిస్తుంది. టికెట్ రేట్లు భారీగా ఉన్నాయని ఎందుకులే అనుకొంటే.. ఓటీటీ వరకు వేచి ఉండటం బెటర్. F3 మూవీ కమర్షియల్‌గా, వాస్తవంగా ఎంత వసూలు చేస్తుందో అనే విషయం.. కొద్ది రోజులు ఆగితే బాక్సాఫీస్ వద్ద తేలిపోతుంది.

  నటీనటులు:

  నటీనటులు:

  వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్, పూజా హెగ్డే, సునీల్, మురళీ శర్మ, ఆలీ, ప్రగతి, వై విజయ, అన్నపూర్ణ, రఘుబాబు, తులసి తదితరులు
  రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడ్
  నిర్మాత: శిరీష్, దిల్ రాజు
  సినిమాటోగ్రఫి: సాయి శ్రీరాం
  ఎడిటింగ్: తమ్మిరాజు
  మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
  ప్రొడక్షన్: దిల్ రాజు ప్రొడక్ష్‌న్
  రిలీజ్ డేట్: 2022-05-27

  ట్యాగ్ లైన్: ప్రేక్షకులకు ఫ్రస్టేషన్

  English summary
  F3 Movie Review: Venkatesh, Varun Tej's F3 hits the theatre on May 27th. Here is the exclusive review from Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X