twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఫలక్‌నుమా దాస్’ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Falaknuma Das Movie Review And Rating | Viishwaksen Naidu | Karate Raju | 1.5/5

    Rating:
    1.5/5
    Star Cast: విశ్వక్ సేన్, సలోని మిశ్రా, తరుణ్ భాస్కర్, ఉత్తేజ్, అభినవ్ గోమటం
    Director: విశ్వక్‌సేన్

    రొటీన్ కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లింది. భిన్నమైన కథతో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు, నేటివిటీకి దగ్గరగా ఉండే కల్ట్ స్టోరీలకే ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తెలుగులో రెండు మూడేళ్లుగా విభిన్నమైన చిత్రాలు బాక్సాఫీసు మంచి విజయం అందుకున్నాయి. ఈ వయసలో ట్రైలర్ ద్వారానే అంచనాలు పెంచిన చిత్రం 'ఫలక్‌నుమా దాస్'. 'ఈ నగరానికి ఏమైంది' మూవీ ఫేం విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ విడుదల చేయడంతో 'అర్జున్ రెడ్డి' స్థాయి చిత్రం అవుతుందని అంతా భావించారు. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుందా? ఈ మూవీ కథా కమామిషు ఏమిటో సమీక్షిద్దాం...

    దాస్ అనే కుర్రాడి కథ

    దాస్ అనే కుర్రాడి కథ

    ఫలక్‌నుమా‌లో దాస్ (విశ్వక్‌సేన్) తన దోస్తులతో అల్లరిచిల్లరిగా తిరిగే యువకుడు. అఫైర్లు, బ్రేకప్‌ల మధ్య ఫ్రెండ్స్‌తో మటన్ వ్యాపారం చేయడానికి సిద్ధమవుతాడు. కానీ రవిరాజ్ బ్యాచ్‌తో గొడవల కారణంగా మర్డర్ కేసులో ఇరుక్కుపోతాడు. ఆ కేసు నుంచి బయటపడటానికి రూ.20 లక్షలు అవసరమవుతాయి. ఫలక్‌నుమా దాస్ మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? 20 లక్షలు సంపాదించడానికి ఏం చేశాడు? తన ప్రేమించిన మూడో ప్రేయసినైనా పెళ్లి చేసుకొన్నాడా? రవిరాజ్‌ గ్యాంగ్‌తో విభేదాలు ఎక్కడి వరకు వెళ్లాయి. చివరకు ఫలక్‌నుమా దాస్ ఎలా సెటిల్ అయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

    మొదటి భాగం ఎలా ఉందంటే..?

    మొదటి భాగం ఎలా ఉందంటే..?

    తండ్రి లేని ఓ బాలుడు రౌడీగా ఎందుకు మారాడనే అంశంతో కథ ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. శంకర్ అనే రౌడీని స్ఫూర్తిగా పొంది ఫలక్‌నుమాలో గ్యాంగ్ తయారు చేసుకొనే అంశం బాగుంటుంది. అర్జున్ రెడ్డి ప్యాటర్న్‌లో సినిమా వెళ్తుందనే మొదట ఫీలింగ్ కలుగుతుంది. కానీ తీరా చూస్తే కథ, కథనాలు చేతులెత్తేసినట్టు కనిపిస్తాయి. సన్నివేశాలకు నేటివిటీ బాగున్నా.. ప్రేక్షకుడికి కనెక్ట్ కాకపోవడం ప్రతికూలంగా అనిపిస్తుంది. రవిరాజ్ గ్యాంగ్‌తో గొడవల కారణంగా మర్డర్ కేసులో ఇరుక్కుపోవడంతో మొదటి భాగం పూర్తయి ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

    రెండో భాగంలో కథ మరీ నాటుగా..

    రెండో భాగంలో కథ మరీ నాటుగా..

    ఇక రెండో భాగంలో కథ మరీ నాటుగా అనిపిస్తుంది. జోయా అనే ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడే ఎపిసోడ్ తప్ప మిగితా అంతా బోర్‌గానే ఉంటుంది. ఎక్కడా ఎమోషన్స్ పండినట్టు కనిపించదు. ఎక్కువ భాగం కథను విపరీతంగా సాగదీసినట్టు ఫీలింగ్ కలుగుతుంది. కథలో బలమైన సన్నివేశాలు లేకపోవడం ప్రేక్షకుడిని సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అంత బలంగా లేకపోవడం వల్ల భారీ అంచనాలు పెట్టుకొన్న ప్రేక్షకుడికి ఊహించిన ఫలితం కనిపిస్తుంది.

    రెండిటి భారం మోయలేక పోయిన విశ్వక్ సేన్

    రెండిటి భారం మోయలేక పోయిన విశ్వక్ సేన్

    దర్శకుడిగా, హీరోగా విశ్వక్ సేన్ ప్రయత్నం బాగుంది. ఏక్‌దమ్‌గా పాతబస్తీ యువకుడిగా కనిపించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ పాత్రలోకి ఒదిగిపోయినట్టు కొన్ని సందర్భాల్లోనే కనపడుతాడు. దర్శకత్వ భారం కారణంగా యాక్టింగ్‌పై దృష్టి పెట్టలేకపోయాడా అనే అనుమానం కలుగుతుంది.

    అందుకే వర్కౌట్ కాలేదు

    అందుకే వర్కౌట్ కాలేదు

    మలయాళ రీమేక్‌‌లో ఉండే ఎమోషన్స్‌, గ్రిప్పింగ్‌గా కథను నడిపించలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథలో మార్పులు చేశాడు కానీ.. తెలుగు ప్రేక్షకులందరకీ నచ్చే విధంగా అంశాలు లేకపోవడం కొంత మైనస్ అని చెప్పవచ్చు. సెంటిమెంట్ అంశాలు పెద్దగా వర్కవుట్ అయినట్టు కనిపించదు.

    కథ పక్కదారి పట్టిన ఫీలింగ్ కలుగుతుంది

    కథ పక్కదారి పట్టిన ఫీలింగ్ కలుగుతుంది

    లోకల్ టాలెంట్‌తో సినిమా తెరకెక్కించడం వల్ల ప్రయోగం కొత్తగా అనిపించినా.. రెగ్యులర్ ప్రేక్షకుడికి యాక్టర్లు అంతగా కనెక్ట్ అవుతాడా అనే సందేహం కలుగుతుంది. హీరోయిన్లలో పెద్దగా చెప్పకోవడానికి ఏమీ ఉండదు. మూడు ప్రేమ కథలు ఉన్నా హృదయానికి టచ్ చేసినట్టు ఎక్కడా అనిపించవు. ముద్దులు, రొమాన్స్‌కే పరిమితం అయ్యాయి. జోయా పాత్ర కొంతలో కొంత మెరుగ్గా అనిపిస్తుంది. సినిమా అంతా గొడవలకే పరిమితం కావడంతో హీరోయిన్ పాత్రలు, ఇతర పాత్రలు పక్కదారి పట్టాయా అనిపిస్తాయి.

    ఇతర నటీనటులు

    ఇతర నటీనటులు

    మిగితా క్యారక్టర్లలో ఉత్తేజ్, దర్శకుడు తరుణ్ భాస్కర్ పాత్రలు బాగా డిజైన్ చేశాడు. ఉత్తేజ్ పాండు పాత్రలో బాగా రాణించాడని చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించాడని చెప్పవచ్చు. ఎస్ఐగా తరుణ్ భాస్కర్ నటన బాగుంది. సెకండాఫ్‌లో వచ్చే రెండు సీన్లలో నాలో నటుడు ఉన్నాడనే ఫీలింగ్ కలిగించాడు. మిగితా వారిలో వారి పాత్రలకు వారు న్యాయం చేశాడని చెప్పవచ్చు.

    టెక్నికల్ అంశాల పరంగా..

    టెక్నికల్ అంశాల పరంగా..


    టెన్నికల్ అంశాల పరంగా కూడా సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు. వివేక్ సాగర్ సంగీతం ఆకట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్ అనేలా ఉంది. ఎడిటింగ్ చాలా దారుణంగా ఉంది. కథకు అవసరం లేని చాలా సీన్లు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనే విధంగా ఉంది.

    వీక్ స్టోరీ, ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే

    వీక్ స్టోరీ, ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే

    ఏ సినిమాకైనా కథే ప్రధాన బలం. అందులో దమ్ము లేకుంటే ఎన్ని హంగులు జొప్పించినా ఫలితం దక్కదు. ‘ఫలక్‌నుమా దాస్' స్టోరీ విషయంలో అదే జరిగింది. సినిమా ప్రారంభంలో స్క్రీప్లే కాస్త కొత్తగా అనిపించినా... క్రమక్రమంగా బోర్ ఫీలింగ్ వస్తుంది.

    సమీక్ష

    సమీక్ష

    ప్రేక్షకుడు రెండున్నర గంటల పాటు ఆసక్తికరంగా చూస్తూ ఉండాలంటే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తప్పనిసరి. కానీ ‘ఫలక్‌నుమా దాస్'లో అవేవీ కనిపించవు. భావోద్వేగాలు లేని మూడు ప్రేమకథ అసంపూర్తిగా ముగించారు. అసలు కథ ఎటు పోతుంది? ముగింపు ఏమిటనే విషయంలో దర్శకుడికే సరైన క్లారిటీ లేదనే ఫీలింగ్ కలిగిస్తుంది. సినిమాలో ఎక్కడా కూడా భావోద్వేగాలు, వినోదాత్మక అంశాలు సరైన విధంగా ఎగ్జిక్యూట్ చేసినట్లు కనిపించదు.

    చివరగా

    చివరగా

    ‘ఫలక్‌నుమా దాస్' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే తాగుడు సీన్లు, చిల్లర పంచాయితీలు తప్ప విషయం కనిపించలేదు. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా తీసిన ఈ చిత్రం వారి అంచనాలను రీచ్ అయ్యే స్థాయిలో లేదని చెప్పక తప్పదు.

    ఫలక్‌నుమా దాస్

    ఫలక్‌నుమా దాస్

    నటీనటులు: విశ్వక్ సేన్, సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి చారులింగా, తరుణ్ భాస్కర్, ఉత్తేజ్, అభినవ్ గోమటం
    దర్శకత్వం: విశ్వక్ సేన్
    నిర్మాతలు: కరాటె రాజు, చర్లపల్లి సందీప్, మనోజ్ కుమార్, కటోకర్
    సంగీతం: వివేక్ సాగర్
    ప్రొడక్షన్: వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్సర్స్, మీడియా9 క్రియేటివ్ వర్క్స్
    సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్
    విడుదల తేదీ: మే 31

    English summary
    Falaknuma Das Review and Rating. Falaknuma Das directed by Vishwaksen Naidu. This romantic action thriller movie is produced by Karate Raju, Cherlapally Sandeep Goud & Manoj Kumar Katokar under Vanmaye Creations in association with Vishwak Sen Cinemas, Terranova Pictures & Media9 Creative Works while Vivek Sagar scored music for this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X