twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యామిలీ సర్కస్సే!

    By Staff
    |

    Family Circus
    -జలపతి గూడెల్లి
    చిత్రం: ఫ్యామిలీ సర్కస్‌
    నటీనటులు: జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రోజా,
    ఝాన్సీ, కాంచీకౌల్‌, కోట
    సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌
    నిర్మాత: మధు
    కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వం: తేజ

    చిత్రంతో పేరు తెచ్చుకొన్న దర్శకుడు తేజ రెండో ప్రయత్నం ఫ్యామిలీ సర్కస్‌. అతిసాధారణంగా తీసిన ఈ సినిమా నిజంగానే ఫ్యామిలీ సర్కస్‌. కొన్ని కుటుంబాలు కలిసి చేసే కోతి చేష్టల సమాహారం ఈ సినిమా. కామెడీ సినిమా తీయాలనుకొన్న తేజ ప్రయత్నం చివరికి సర్కస్‌ గా మారిపోయింది. రింగ్‌ మాస్టర్‌ తేజ గొప్పదనం ఏమిటో తెలిసిపోయింది. ఇప్పటి కొత్త దర్శకులందరి లాగే రెండో చిత్రంతో తేజ చతికలపడ్డాడు. ఆర్భాటం తప్ప సరుకు లేని సినిమా. దర్శకుడునూ. ఇలాంటి సినిమా ఇదివరకు మనం ఎన్నోసార్లు చూశాం. కథ, కథనం అంతా ఇలాంటి సినిమాల్లోనిదే. చిన్నపిల్లలకు మాత్రం బాగా నచ్చుతుంది. కొంత కామెడీ కూడా బావుంది. కానీ అంతా ఇదివరకు మనం చూసిన, విన్న కామెడియే.

    జగపతిబాబు, రోజాకు పెళ్ళి అవుతుంది. జగపతిబాబు హైదరాబాద్‌ లో ఇళ్ళు కట్టుకుంటాడు. పై పోర్షన్‌ అద్దెకిచ్చి ఇంటికైనా ఖర్చును తీర్చుదామనుకుంటాడు. రాజేంద్రప్రసాద్‌ అద్దెకు దిగుతాడు. రాజేంద్రప్రసాద్‌ భార్య ఝాన్సీ. మహా ఖతర్‌ నాక్‌ లేడీ. ఝాన్సీ చెల్లెలు కాంచీకౌల్‌. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ పిల్లలు అంతా కలిసి నానా అల్లరి చేస్తుంటారు. జగపతిబాబు పిల్లల కన్నా రాజేంద్రప్రసాద్‌ పిల్లలు చేసే అల్లరి ఎక్కువ. ఈ అల్లరిని, తన వెంటపడే కాంచీకౌల్‌ నుంచి తప్పించుకునేందుకు జగపతిబాబు ప్రయత్నిస్తాడు. తన మెడకు చుట్టుకున్న లంపటాన్ని జగపతిబాబు ఎలా డీల్‌ చేస్తాడు అనేది క్లైమాక్స్‌.

    ధర్మవరపు సుబ్రమణ్యం కామెడీ(పాతదే ఐనా) బావుంది. చిన్నపిల్లల చేష్టలు నవ్విస్తాయి. వారికే ఎక్కువగా నచ్చే చిత్రం ఇది. కథ, స్క్రన్‌ ప్లే రచయితగానే కాకుండా దర్శకుడిగా కూడా తేజ విఫలమయ్యాడు. తేజ కూడా అందరిలాగా అతిసాధారణ దర్శకుడే అని రుజువైంది. సంగీతం నిరాశపరుస్తుంది. సినిమా మొత్తంలో ఝాన్సీ నటన అధ్బుతం అని చెప్పొచ్చు.

    తెలంగాణ యువతి పాత్రను చాలా చక్కగా పోషించింది. కాకపోతే ఆమె చేత చెప్పించిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇది తేజ అవగాహన రాహిత్యం తప్ప ఝాన్సీ పొరపాటు కాదు. జగపతిబాబు ఇలాంటి పాత్రలు ఎన్నో చేశాడు కాబట్టి అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజా, రాజేంద్రప్రసాద్‌ ల పాత్రలు చెప్పుకోదగ్గవి కాదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X