For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఫన్నే ఖాన్’ రివ్యూ: ఫన్, ఎమోషనల్ రైడ్...

By Bojja Kumar
|

Rating:
2.5/5
Star Cast: అనిల్ కపూర్, ఐశ్వర్య రాయ్, రాజ్ కుమార్ రావ్, దివ్యా దత్తా
Director: అతుల్ మంజ్రేకర్

చాలా కాలం తర్వాత అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్ కలిసి నటిస్తున్న చిత్రం. వీరితో పాటు రాజ్ కుమార్ రావ్ లాంటి టాలెంట్ యాక్టర్. ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు ఇందులో కావాల్సినంత ఫన్, ఎమోషనల్ కంటెంటుతో పాటు మనసుకు హత్తుకునే సీన్లు ఉంటాయనే అభిప్రాయం ఏర్పడులా చేశారు మేకర్స్. అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక మంచి మెలో డ్రామా అనే అభిప్రాయం కల్పించారు. ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కిన 'ఫన్నే ఖాన్' ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది? రివ్యూలో చూద్దాం.

కథ ఏమిటంటే

కథ ఏమిటంటే

ఒక సాధారణ మధ్యతరగతి జీవి ప్రశాంత్(అనిల్ కపూర్) అందరితో ఫన్నే ఖాన్ (కళాకారుడు) పిలిపించుకోవాలని ఆశ పడుతుంటాడు. ఎప్పటికైనా మహ్మద్ రఫీ లాంటి పెద్ద సింగింగ్ స్టార్ కావాలనేది అతడి డ్రీమ్. కానీ ఆ కల నెరవేరకుండానే వయసు దాటిపోతుంది. తన వల్ల కానిది తన కూతురు సాధిస్తే చూడాలనుకుంటాడు, ఆమెను ఎప్పటికైనా ‘లతా మంగేష్కర్' స్థాయిలో నిలబెట్టాలనుకుంటాడు. అందుకే ఆమెకు లత(పిహు సంద్) అని పేరు పెడతాడు.

కూతురు కల నిజం చేసేందుకు కిడ్నాప్

కూతురు కల నిజం చేసేందుకు కిడ్నాప్

కూతురు మాత్రం లతా మంగేష్కర్‌‌లా కాకుండా పెద్ద పాప్ స్టార్ అవ్వాలని ఆశ పడుతుంది. ప్రతి కాంటెస్టులోనూ పాల్గొంటుంది. అయితే ఓవర్ వెయిట్ కారణంగా ఆమెకు ఎవరూ మ్యూజిక్ ఆల్బం చేసే అవకాశం ఇవ్వరు. దీంతో కూతురు కల నిజం చేయాలని నిర్ణయించుకున్న ప్రశాంత్ ఆల్బంకు అయ్యే డబ్బు సమకూర్చుకోవడం కోసం కిడ్నాప్ ప్లాన్ చేస్తాడు.

అసలు స్టోరీ...

అసలు స్టోరీ...

తన స్నేహితుడు ఆదిర్(రాజ్ కుమార్ రావ్)తో కలిసి పాపులర్ సింగర్ బేబీ సింగ్ (ఐశ్వర్యరాయ్)ని కిడ్నాప్ చేస్తారు. ఈ కిడ్నాప్ ద్వారా డబ్బులు వసూలు చేసి తన కూతురు కలను నిజం చేయాలని ఆశ పడ్డ ప్రశాంత్ ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అనేది తర్వాతి కథ.

అనిల్ కపూర్ అదుర్స్

అనిల్ కపూర్ అదుర్స్

బాలీవుడ్లో అనిల్ కపూర్ ఎవర్ గ్రీన్ స్టార్, ఫెంటాస్టిక్ యాక్టర్. 61 ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం ఎనర్జీ లెవన్స్ తగ్గకుండా ప్రశాంత్ పాత్రలో జీవించాడు. తన కూతురు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే తండ్రి పాత్రకు ఆయన పర్ఫెక్టుగా సూటయ్యాడు. సినిమాకు ఎంతో కీలకమైన పాత్ర చేసిన ఆయన ఇటు హ్యూమర్‌తో పాటు అటు ఎమోషనల్ సీన్లను అద్భుతంగా పండించారు.

రాజ్ కుమార్ రావ్

రాజ్ కుమార్ రావ్

రాజ్ కుమార్ రావ్ తన సహజసిద్ధమైన పెర్ఫార్మెన్స్‌తో మరోసారి సూపర్ అనిపించుకున్నాడు. అతడి కామెడీ టైమింగ్, హావభావాలు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఐశ్వర్యరాయ్‌తో అతడి కెమిస్ట్రీ సైతం తెరపై అద్భుతంగా పండింది.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

అందాల సుందరి ఐశ్వర్యరాయ్ మరోసారి తెరపై అభిమానులకు తన ముగ్దమనోహరమైన రూపంతో కనువిందు చేసింది. గ్లామర్ ప్రపంచంలో సెలబ్రిటీల జీవితం వెనక ఎంత పెయిన్ ఉంటుందో చెప్పే పాత్రలో ఆకట్టుకున్నారు. సూపర్ స్టార్ బేబీ సింగ్ పాత్రలో ఆమె అదరగొట్టారు.

ఇతర పాత్రల్లో..

ఇతర పాత్రల్లో..

పిహు సంద్ తొలి సినిమాయే అయినా బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఫన్నే ఖాన్ భార్య పాత్రలో దివ్యా దత్తా, బేబీ సింగ్ మేనేజర్ పాత్రలో గిరీష్ కులకర్ణి వారి పరిధిమేర నటించారు.

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

తిరు సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉంది. మెనిషా ఆర్ బల్దేవా సినిమాలో బోరింగ్ సీన్లు లేపేసి మరింత ట్రిమ్ చేస్తే బావుండేది. అమిత్ త్రివేది సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

స్క్రీన్ ప్లే, డైరెక్షన్

స్క్రీన్ ప్లే, డైరెక్షన్

ముస్సేన్ దలాల్ అందించిన కథ బావుంది. స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. అయితే అతుల్ మంజ్రేకర్ తొలి ప్రయత్నం కావడంతో డైరెక్షన్ పరంగా కొన్ని లోపాలు కనిపించాయి. కొన్ని చోట్ల సీన్లను పెర్ఫెక్టుగా తీయడంలో తడబడ్డ ఫీలింగ్ కలుగుతుంది. అయితే అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్, రాజ్ కుమార్ రావు తమ పెర్ఫార్మెన్స్‌తో వాటిని కవర్ చేశారు.

ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్, ఐశ్వర్యరాయ్

కథ, సంగీతం, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్

అతుల్ మంజ్రేకర్ దర్శకత్వం

లాజిక్ లేని సీన్లు

ఫైనల్‌గా

ఫైనల్‌గా

‘ఫన్నే ఖాన్' మూవీ సెంటిమెంట్, హాస్యంతో కూడిన మంచి వినోదాత్మక చిత్రం. లాజిక్స్ పట్టించుకోకుండా చూస్తే ఎంజాయ్ చేయగలుగుతారు.

నటీనటులు

నటీనటులు

సినిమా: ఫన్నే ఖాన్

నటీనటులు: అనిల్ కపూర్, ఐశ్వర్య రాయ్, రాజ్ కుమార్ రావ్, దివ్యా దత్తా

దర్శకత్వం: అతుల్ మంజ్రేకర్

విడుదల తేదీ: 2018-08-03

English summary
Fanney Khan has its heart in the right place, but it's Atul Manjrekar's inconsistent direction that spoils the show. One of the songs in the film has lyrics which says, "Sach mein kabhi has na sake, khilke roh bhi paate nahin, kya rok hai hum kyun bhala, joh hai woh ho jaate nahin." Despite all its flaws, Fanney Khan still manages to make some place in your heart for sometime purely for this strong point.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more