Farhana Review ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టిన ఐశ్వర్య రాజేశ్.. హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్ నెల్సన్!

Rating: 3/5

నటీనటులు: ఐశ్వర్య రాజేశ్, కే సెల్వరాఘవన్, అనుమోల్ కే మనోహరన్, ఐశ్వర్య దత్తా, జితన్ రమేష్ తదితరులు
దర్వకత్వం: నెల్సన్ వెంకటేశన్
కథ, స్క్రీన్ ప్లే: శంకర్ దాస్, రంజిత్ రవీంద్రన్, నెల్సన్ వెంకటేశన్
నిర్మాతలు: ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు
మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫి: గోకుల్ బినోయ్
ఎడిటింగ్: వీజే సబు జోసెఫ్
రిలీజ్ డేట్: 2023-05-12

ఫర్హానా కథ గురించి: ఇస్లాం కట్టుబాట్లను, సంప్రదాయాలను పాటించే ముస్లిం కుటుంబానికి చెందిన ఫర్హానా (ఐశ్వర్య రాజేశ్) ఇద్దరు పిల్లలకు తల్లి. భర్త చెప్పుల షాపు నడుపుతూ జీవితాన్ని నెట్టుకొంటూ వస్తుంటాడు. కటిక పేదరికంతో బాధపడుతూ పిల్లల ఆరోగ్యం, స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటారు.

Farhana Review and Rating: Aishwarya Rajesh career best performance

ఆ క్రమంలో సంప్రదాయాలను, కట్టుబాట్లను ఎదురించి ఉద్యోగం చేయాలని ఫర్హానా నిశ్చయించుకొంటుంది. అలా ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగం సంపాదిస్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించే పనిలో ఫోన్‌లో సెక్సువల్ విషయాలపై చాటింగ్ చేసేందుకు కూడా వెనుకాడదు. అలాంటి ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ మిస్టీరియస్ వ్యక్తి ఫర్హానా జీవితంలోకి ప్రవేశిస్తాడు.

ఫర్హానా మూవీలో ట్విస్టులు: ఫర్హానాను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడిన కాలర్ ఎవరు? తన జీవితానికి ముప్పుగా మారిన వ్యక్తిని ఎలా ఫేస్ చేసింది. మిస్టీరియస్ కాలర్ వేసిన ఎత్తుకు పైఎత్తు ఎలా వేసింది? ఆ మిస్టీరియస్ వ్యక్తి గ్యాంగ్ నుంచి ఎలా తప్పించుకొన్నది? మిస్టీరియస్ వ్యక్తిని కుట్రను ఎలా ఫర్హానా చేధించిందనే ప్రశ్నలకు సమాధానమే ఫర్హానా సినిమా కథ.

Farhana Review and Rating: Aishwarya Rajesh career best performance

ఫర్హానా మూవీ ఎలా సాగిందంటే?: ఫర్హానా కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితులతో కథను ఆసక్తికరంగా మార్చి ఆలస్యం చేయకుండా అసలు స్టోరీలోకి వెళ్లడం సినిమాలో లీనమయ్యేలా చేసింది. కాల్ సెంటర్ ఎన్విరాన్‌మెంట్‌ను ఆసక్తికరంగా చిత్రీకరించడం ప్రేక్షకుడిని కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇక మిసీరియస్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఆసక్తికరంగా సాగుతుంది. సెకండాఫ్‌లో మిస్టిరియస్ మ్యాన్‌తో ఫర్హానా ఛేజింగ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌తో గొప్ప అనుభూతిని పొందేలా చేస్తుంది.

Farhana Review and Rating: Aishwarya Rajesh career best performance

దర్శకుడు నెల్సన్ వెంకటేశన్: ముస్లిం కుటుంబం, వారి పరిస్థితులను బేరిజీ వేస్తూ మూల కథగా దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ రాసుకొన్న తీరు బాగుంది. ప్రాణం కంటే పరువుకు విలువనిచ్చే ముస్లిం ఫ్యామిలీలో ఉండే ఆర్థిక పరిస్థితులను చక్కగా రాసుకొన్నారు. ప్రస్తుత సమాజంలో ముస్లిం యువతులు బయటకు వచ్చి.. ఉద్యోగం చేయాలంటే ఎంత కష్టం అనే పాయింట్ చుట్టూ రాసుకొన్న మిస్టరీ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌ సినిమాకు బలంగా మారాయి. కథను ట్రాక్‌పైకి ఎక్కించి ఎక్కడ పట్టాలు తప్పకుండా రాసుకొన్న తీరు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు.

Farhana Review and Rating: Aishwarya Rajesh career best performance

ఐశ్వర్య రాజేశ్ పెర్ఫార్మెన్స్: నటీనటులు గురించి చెప్పాల్సి వస్తే.. ఐశ్వర్య రాజేష్ కెరీర్‌ ఫెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా బెస్ట్ సినిమాగా కూడా చెప్పుకోవచ్చు. సంప్రదాయలు, కట్టుబాట్ల మధ్య కష్టాలను అనుభవించే ముస్లిం మహిళగా, కుటుంబం కోసం ఎలాంటి పరిస్థితులను ఎదురించే యువతిగా మంచి వేరియేషన్స్ చూపించారు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఐశ్వర్య రాజేష్ కథా భారాన్ని మొత్తం తన భుజాలపై మోసింది. మిస్టరీ మ్యాన్‌గా సెల్వ రాఘవన్ గురించి ఎంత రాసినా తక్కువే. తెరపైనే ఆయన ఫెర్ఫార్మెన్స్ చూడాల్సిందే. ఐశ్వర్య దత్తా, జితన్ రమేష్ తమ పాత్రల పరిధి మేరకు సూపర్‌గా నటించారు.

Farhana Review and Rating: Aishwarya Rajesh career best performance

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?: ఫర్హానా సినిమా సాంకేతిక విభాగాల గురించి చెప్సాల్సి వస్తే.. జస్టిన్ ప్రభాకర్ అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను అందించారు. గోకుల్ బిజోయ్ కెమెరా వర్క్ ఒక సూపర్ ఎలిమెంట్. శివకుమార్ ఆర్గ్ విభాగం, ఇతర విభాగాలు కథ డిమాండ్ మేరకు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మంచి నిర్మాణ విలువలు పాటించడమే కాకుండా విభిన్నమైన కథతో మంచి చిత్రాన్ని అందించేందుకు చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి.

Farhana Review and Rating: Aishwarya Rajesh career best performance

ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే?: కొన్ని సినిమాలు కంటెంట్ బాగుంటే.. కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపించవు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే కథ ఎంగేజింగ్‌గా ఉండదు. ఇలాంటి అన్నీ అంశాలు కలబోసిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫర్హానా. ఓరు నాల్ కూత్తు, మాన్‌స్టర్ చిత్రాలతో సక్సెస్ జోరు కొనసాగిస్తున్న నెల్సన్ వెంకటేశన్ తన ఖాతాలో మరో హిట్ వేసుకొన్నడని చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉన్న చిత్రం ఫర్హానా. ఎలాంటి అంచనాతో వెళ్లినా మంచి అనుభూతిని అందిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X