Farzi web series review షాహీద్ కపూర్, విజయ్ సేతుపతి టాప్ క్లాస్ ఫెర్ఫార్మెన్స్.. రాశీఖన్నా, రెజీనా ఎలా చేశారంట

Rating:
3.0/5

నటీనటులు: షాహీద్ కపూర్, విజయ్ సేతుపతి, కేకే మీనన్, రాశీ ఖన్నా, భువన్ ఆరోరా, రెజీనా కసండ్రా, అమోల్ పాలేకర్ తదితరులు
దర్శకత్వం: రాజ్ అండ్ డీకే
నిర్మాతలు: D2R ఫిలింస్
మ్యూజిక్ డైరెక్టర్: కేతన్ సోదా
సినిమాటోగ్రఫి: పంకజ్ కుమార్
ఎడిటర్: సుమీత్ కొటియాన్
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్ నిడివి: 42 నిమిషాల నుంచి 66 నిమిషాలు
రిలీజ్ డేట్: 2023-02-10

Farzi కథ ఏమిటంటే?

Farzi కథ ఏమిటంటే?

క్రాంతి అనే పత్రికలో పనిచేసే సందీప్ అలియాస్ సన్నీ టాలెంటెడ్ ఆర్టిస్టు. స్వతంత్ర సమరయోధుడైన తన తాత నడిపే పత్రికలోనే పనిచేస్తుంటాడు. విలువలు, నైతికతను పాటించడం వల్ల ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అయితే నకిలీ కరెన్సీ తయారు చేసే తన స్నేహితుడు ఫిరోజ్ (భువన్ అరోరా)తో సన్నీ చేతులు కలుపుతాడు. ఆ తర్వాత విదేశాల్లో ఉండే మాఫియా డాన్ మన్సూర్ దలాల్‌ (కేకే మీనన్)తో చేతులు కలిపి భారీ ఎత్తున నకిలీ కరెన్సీ తయారు చేసేందుకు సిద్దమవుతారు. దేశంలో నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడానికి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్‌గా కరడుగట్టిన నిజాయితీ అధికారి మైఖేల్ (విజయ్ సేతుపతి), మేఘా (రాశీఖన్నా) రంగంలోకి దిగుతారు.

Farzi లో ట్విస్టులు

Farzi లో ట్విస్టులు


నకిలీ కరెన్సీ తయారీలో సన్నీ ఎలాంటి టాలెంట్ ప్రదర్శించారు. మన్సూర్ దలాల్‌తో చేతులు కలిపిన తర్వాత వారి పరిస్థితి ఏమిటి? నకిలీ కరెన్సీని అరికట్టేందుకు మేఘా ఎలాంటి సాఫ్ట్‌వేర్ రూపొందించింది. మైఖేల్ తన వ్యక్తిగత జీవితంలో భార్య (రెజీనా కసండ్రా)తో ఫ్యామిలీపరమైన సమస్యలు ఎందుకు తలెత్తాయి. సన్నీ, ఫిరోజ్ అక్రమ దందాకు మైఖేల్ ఎలాంటి ఎత్తులు వేశారు. సన్నీతో మేఘా ఎందుకు ప్రేమలో పడాల్సి వచ్చింది. మన్సూర్ దలాల్‌కు వందల కోట్ల ఫేక్ కరెన్సీని సన్నీ చేరవేశాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఫర్జీ వెబ్ సిరీస్ కథ.

రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన విధానం

రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన విధానం


దేశాన్ని హడలెత్తిస్తున్న నకిలీ కరెన్సీ నేపథ్యంగా దర్శకులు రాజ్ అండ్ డీకే ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఆ పాయింట్ కోసం భారీగానే పరిశోధన చేసినట్టు ప్రతీ ఫ్రేమ్ తెలియజేస్తుంది. ఫేక్ కరెన్సీ పాయింట్ చుట్టూ దర్శకులు అల్లుకొన్న సన్నివేశాలు.. డిజైన్ చేసిన క్యారెక్టర్లతో ఆద్యంతం ఈ వెబ్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది. స్టోరి బ్యాక్ డ్రాప్, డిటైయిలిటీ కారణంగా తొలి మూడు ఎపిసోడ్‌లు స్లోగా సాగినట్టు అనిపించినా.. మేకింగ్ పరంగా ప్రతీ ఎపిసోడ్ ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇక ప్రతీ ఎపిసోడ్ ముగించుకొంటే వెళ్తుంటే.. మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. రాజ్ అండ్ డీకే టాలెంట్‌కు ఫర్జీ చిత్రం మరో మచ్చు తునకలా అనిపిస్తుంది.

షాహీద్ కపూర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్

షాహీద్ కపూర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సందీప్ అలియాస్ సన్నీగా షాహీద్ కపూర్ మరోసారి అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నాడు. చివరి నాలుగు ఎపిసోడ్స్‌లో షాహిద్ కపూర్ నటన పీక్స్‌లో ఉంటుంది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్‌లో వీరవిహారం చేశాడనిపిస్తుంది. సందీప్ స్నేహితుడు ఫిరోజ్ పాత్రలో భువన్ పోటీపడి నటించాడు. ఈ రెండు పాత్రలు కథకు మరింత బలంగా మారాయి. షాహీద్ కపూర్ కెరీర్‌లో మరో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు.

విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా గురించి

విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా గురించి


సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా ఇక ఎప్పటి మాదిరిగానే విజయ్ సేతుపతి తన మార్క్ నటనతో వెబ్ సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా మలిచారు. ప్రొఫెషనల్‌గా సవాళ్లను, ఫ్యామిలీ లైఫ్ పరంగా సమస్యలను ఎదుర్కొనే వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. సీజన్ 1లో కాస్త డోస్ తగ్గిందనిపిస్తుంది. కానీ సీజన్ 2లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం కలుగుతుంది. గ్లామర్ పాత్రలకు పరిమితమైన రాశీ ఖన్నా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. రెజీనా కంసాండ్రా పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా.. తన ఉనికిని వెబ్ సిరీస్‌లో నిలబెట్టుకొన్నది. కేకే మీనన్ టిపికల్ విలన్ రోల్‌లో మెప్పించాడు.

Farzi టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

Farzi టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

Farzi Web Series టెక్నికల్ విషయాలకు వస్తే.. పంజక్ కుమార్ టీమ్ అందించిన సినిమాటోగ్రఫి టాప్ క్లాస్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు, ముంబై స్ట్రీట్ ఛేజింగ్స్ విజువల్ ట్రీట్‌గా ఉంటాయి. వెబ్ సిరీస్ టింట్, లైటింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా అనిపిస్తాయి. ఇక కేతన్ సోదా అందించిన మ్యూజిక్ మరో హైలెట్. పలు సన్నివేశాలను బీజీఎం హైలెట్ చేసింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ టాప్ క్లాస్‌ అనిచెప్పవచ్చు.

Farzi ఫైనల్‌గా ఎలా ఉందంటే?

Farzi ఫైనల్‌గా ఎలా ఉందంటే?

ఫేక్ కరెన్సీ కథా నేపథ్యంగా సాగే ఫ్యామిలీ, యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఫర్జీ. షాహీద్, విజయ్ సేతుపతి, భువన్, రాశీ ఖన్నా ఫెర్ఫార్మెన్స్ ఈ వెబ్ సిరీస్‌కు అత్యంత బలంగా మారాయి. రాజ్ అండ్ డీకే రీసెర్చ్, మైన్యూట్ డిటైల్స్‌ను చూపించడం పరిశీలిస్తే.. వారికి సినిమాపై ఉన్న తపన, తాపత్రయం కనిపిస్తుంది. మీకు సరైన టైమ్, మూడ్ ఉంటే.. ఒకే స్ట్రెచ్‌లో వెబ్ సిరీస్ చూసేయండి.. ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్లి బయటకు వచ్చినట్టు ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వెర్షన్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X