twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్ రివ్యూ

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5

    హైదరాబాద్: డైరెక్టర్ వంశీ అంటే... 80ల నాటి డైరెక్టర్. ఆ కాలంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన సితార, అన్వేషణ, లేడీస్ టైలర్ లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. అయినా సరే 20 ఏళ్ల కుర్రాళ్లను సైతం మెప్పించే సినిమాలు తీస్తానంటూ తను ఎప్పుడూ ఫాలో అయ్యే స్టైల్‌నే ఫాలో అవుతూ 'వంశీ' అనే బ్రాండ్ ఇంకా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు.

    వంశీ దర్శకత్వంలో 30 ఏళ్ల క్రితం వచ్చిన 'లేడీస్ టైలర్' అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇపుడు ఆ లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్ కథతో ప్రేక్షకులు ముందుకొచ్చిన ఆ తరం డైరెక్టర్ ఈ తరం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో చూద్దాం.

    కథ ఏమిటంటే....

    కథ ఏమిటంటే....

    లేడీస్ టైలర్ సుందరం, సుజాత టీజర్ల కొడుకైన గోపాళం(సుమంత్ అశ్విన్) తండ్రి వృత్తినే కొనసాగిస్తూ చుట్టు పక్కల ఊర్లలో మంచి పనితనం ఉన్న లేడీస్ టైలర్‌గా ఫేమస్ అవుతాడు. చేసేది టైలరింగే అయినా ఎవరైనా తనను లేడీస్ టైలర్ అంటే అస్సలు నచ్చదు గోపాళానికి. తనను తాను ఫ్యాషన్ డిజైనర్ గా చెప్పుకుంటాడు. వీలైనంత త్వరగా సిటీలో షాపు తెరిచి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని, బాగా డబ్బు సంపాదించాలనే డ్రీమ్స్ లో ఉంటాడు.

    మన్మధరేఖ

    మన్మధరేఖ

    ఓ రోజు జ్యోతిష్కుడు ఫ్యాషన్ డిజైనర్ చేతిలో ఉన్న రేఖ చూసి అది మామూలు రేఖ కాదని, మన్మధరేఖ అని..... ఈ రేఖ లక్షల్లో ఒకరికి మాత్రమే ఉంటుందని, ఈ రేఖ ఉన్నవాళ్లు ఎలాంటి అమ్మాయిలనైనా ఇట్టే ప్రేమలో దింపే శక్తి కలిగి ఉంటారని చెబుతాడు. దీంతో ఊర్లో బాగా డబ్బున్న అమ్మాయిలను చూసి వారిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుని..... అలా వచ్చిన డబ్బుతో సిటీలో పెద్ద షాపు పెట్టాలనే ఆలోచనలో ఉంటాడు.

    ఫ్యాషన్ డిజైనర్ అత్యాశ

    ఫ్యాషన్ డిజైనర్ అత్యాశ

    ఈ క్రమంలోనే మొదట గేదెల రాణి(మానస), తర్వాత అమ్ములు(మనాలి రాథోడ్), ఆ తర్వాత మహాలక్ష్మి(అనీషా ఆంబ్రోస్) ...... ఇలా ఒకరికంటే ఒకరు బాగా డబ్బున్న అమ్మాయిలను ప్రేమలో దించే ప్రయత్నం చేసి చివరకు తన చావు మీదకు తెచ్చుకుంటాడు. చివరకు గోపాళం పరిస్థితి ఏమైంది? ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది తెరపై చూడాల్సిందే.

    నటీనటుల పెర్ఫార్మెన్స్

    నటీనటుల పెర్ఫార్మెన్స్

    లేడీస్ టైలర్లో రాజేంద్రప్రసాద్ రేంజి కాకపోయినా..... ఫ్యాషన్ డిజైనర్ గా సుమంత్ అశ్విన్ ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్లు అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస పెర్ఫార్మెన్స్ పరంగా యావరేజే అయినా... గ్లామర్ పరంగా ఆకట్టుకున్నారు. కృష్ణ భగవాన్, ఇతర నటీటనలు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాల పరంగా సినిమాటోగ్రఫీ, సంగీతం సినిమాలో బాగా హైలెట్ అయ్యాయి. మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్సయింది. ఒక వేళ సినిమాలో పాటలు బాగోలేకపోయి ఉంటే సినిమా చూడలేని పరిస్థితి ఉండేదేమో. అదే విధంగా నగేష్ బన్నెల్ సినిమాటోగ్రఫీ కూడా. పాపికొండలు, కోనసీమ అందాలను ఎంతో అద్భుతంగా చూపించారు. సినిమా నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమా తెరకెక్కించిన విధానం చూస్తుంటే మధుర శ్రీధర్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని స్పష్టమవుతుంది.

    ఏ మాత్రం మారని వంశీ...

    ఏ మాత్రం మారని వంశీ...

    తను తీసే సినిమాల్లో తన మార్కు కనపడేలా కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తుంటాడు వంశీ. ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' విషయంలో కూడా తన మార్కును కొనసాగించాడు. ఈ విషయంలో ఆయన ఏ మాత్రం మారలేదు. ఈ సినిమాకే కాదు... ఆయన గత పది సినిమాలు పరిశీలించినా ఇదే మార్కు కనిపిస్తుంది.

    కోనసీమ అందాలు

    కోనసీమ అందాలు

    వంశీ సినిమాలు అంటేనే గోదావరి, కోనసీమ అందాలు చూపించకుండా సినిమా ఉండదు. ‘ఫ్యాషన్ డిజైనర్' సినిమా మొత్తం కూడా కోనసీమ, పాపికొండలు ప్రాంతాల్లోనే తెరకెక్కించారు. ఇక పాపికొండల అందాలను వంశీ ఈ సినిమాలో చూపించినంత అందంగా మరే సినిమాలోనూ చూపించలేదు.

    కథ-స్క్రీన్ ప్లే

    కథ-స్క్రీన్ ప్లే

    డైరెక్షన్ విషయంలో వంశీకి వంక పెట్టలేం. కానీ ఆయన సినిమాను నడిపించే విధానమే కాస్త రొటీన్ గా అనిపిస్తుంది. ఫ్యాషన్ డిజైనర్ స్క్రీన్ ప్లే అంత ఆసక్తికరంగా ఏమీ లేదనే చెప్పొచ్చు. వంశీ సినిమాల అభిమానులైతే ఆయన సినిమాలు ఇలానే ఉంటాయని వాదిస్తుంటారు కానీ... కథ కూడా అంత గొప్పగా ఏమీలేదు.

    హాస్యం

    హాస్యం

    సినిమాలో హాస్యం కూడా పడిపడి నవ్వేంత ఏమీ లేదు.... అక్కడక్కడ వంశీ మార్క్ డైలాగులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. కృష్ణ భగవాన్, ఇంకా కొందరు కమెడియన్లు ఉన్నప్పటికీ పేలాల్సిన స్థాయిలో కామెడీ పేలలేదు.

    ఆ విషయంలో వంశీ సూపర్

    ఆ విషయంలో వంశీ సూపర్

    ఇవన్నీ పక్కన పెడితే....సినిమాలో కొన్ని చోట్లు క్రియేటివిటీ విషయంలో వంశీ తనదైన మార్కు చూపించారు. సినిమాపై ఆయనకు ఎంత పాషన్ ఉందో వాటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ వయసులోనూ ఆయనలో సినిమా మేకింగుపై ఉన్న కసి ఏమాత్రం తగ్గలేదు. ఈ విషయంలో వంశీ సూపర్.....

    సినిమా ఎలా ఉందంటే....

    సినిమా ఎలా ఉందంటే....

    కోనసీమ అందాలు, పాపికొండల సోయగాలు.... గోదావరి జిల్లాల వెటకారానికి తోడు దర్శకుడు వంశీ మార్కు క్యారెక్టర్లు, స్పెషల్ ఎఫెక్టులు కలగలిపి లేడీస్ టైలర్ రేంజి కాక పోయినా..... ఎంటర్టెనింగ్ పరంగా ఓకే.

    ఫైనల్ వర్డ్

    ఫైనల్ వర్డ్

    వంశీ మార్కు కామెడీ, స్క్రీన్ ప్లే ఇష్టపడే వారు సినిమాను ఎంజాయ్ చేయగలుగుతారు.

    ఫ్యాషన్ డిజైనర్

    ఫ్యాషన్ డిజైనర్

    దర్శకత్వం : వంశీ
    నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి
    సంగీతం : మణి శర్మ
    తారాగణం: సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్ష

    English summary
    'FASHION DESIGNER s/o LADIES TAILOR' is a Telugu feature film directed by the legendary director, VAMSY. This film comes as a sequel to 1986 super hit film 'LADIES TAILOR'. It has 5 superb melody songs given by music director Mani Sharma. The film is produced by Madhura Sreedhar Reddy, starring SUMANTH ASHWIN in the lead role starring opposite actresses, Anisha, Manali, Manasa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X