For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Fast and Furious 9 Movie Review: 2021లో చెత్త సినిమా అంటే ఇదేనా?

  |

  Rating:
  1.0/5
  Star Cast: విన్ డీజిల్, మిచెల్ రోడ్రిగ్స్, జాన్ సెనా, హెలెన్ మిరెన్, కర్ట్ రస్సెల్, చార్లిజ్ థెరాన్
  Director: జస్టిన్ లిన్

  ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో గుర్తింపు ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రదర్స్, ఫ్రెండ్స్ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ లోనే రోమాలు నిక్కబొడిచే కార్ రేసింగ్ సీన్స్ మంత్ర ముగ్దులను చేస్తుంటాయి. గత ఏడాది నుంచి వరల్డ్ వైడ్ గా ఎంతోమంది అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

  ఇక ఫైనల్ గా నేడు ఇండియాలో కూడా భారీ స్థాయిలో విడుదల అయ్యింది. ఇక జస్టిన్ లిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9లో విన్ డీజిల్, మిచెల్ రోడ్రిగ్స్, జాన్ సెనా, హెలెన్ మిరెన్, కర్ట్ రస్సెల్, చార్లిజ్ థెరాన్ నటించారు. ఇక సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం..

  కథ ఏమిటంటే..

  కథ ఏమిటంటే..

  ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ లో ఎలాంటి సినిమా రూపొందినా కూడా అందులో అధునాతనమైన కార్లు, రేసింగ్స్ ఉండడం సర్వసాధారణం. ఇక సూపర్ హీరోల తరహాలో అతిపెద్ద సమస్యలను ఎదుర్కొని మంచి చేయడం కామన్ గా వస్తున్నదే. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎమోషన్స్ కూడా టచ్ చేస్తూ వస్తున్నారు.

  ఇక ఈసారి F9 లో కూడా అలాంటి లైన్ ఒకటి ఉంది. డొమినిక్ టోరెట్టో (విన్ డీజిల్), అతని తమ్ముడు జాకబ్ (జాన్ సెనా) వారి తండ్రి మరణానికి కారణం అని అనుకుంటాడు. "చెప్పు, మీరు ఎందుకు తండ్రిని చంపారు?" అని జాకబ్ సమాధానం చెప్పే ముందు, డోమ్, "ఇప్పుడు, రేస్ చేద్దాం" అని కథను స్టార్ట్ చెప్పాడు.

  ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 ట్విస్టులు

  ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 ట్విస్టులు

  మొదట్లో కొంత ఫ్లాష్‌బ్యాక్‌తో సినిమా కొనసాగుతుంది. డోమ్ గతంలో ప్రస్తావించని సోదరుడు జాకబ్ తండ్రి జాక్ టోరెట్టో (జె. డి. పార్డో) ను రేసులో చూస్తాడు. ఒక ప్రత్యర్థి కారు జాక్ కారును ఢీకొట్టింది, అది గోడకు డీ కొట్టిన తర్వాత బ్లాస్ట్ అవుతుంది. ఈ సంఘటన తర్వాత, డోమ్ దాదాపు ప్రత్యర్థిని కొట్టినట్లు సన్నివేశాలు వస్తాయి. ఇక అతను ఆ తర్వాత జైలు పాలయ్యాడు. ఇక ఆ తరువాత డోమ్ జైలు నుంచి వచ్చిన అనంతరం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. అతని సోదరుడు పగను ఎలా తీర్చుకుంటాడు? అసలు నిజంగానే డోమ్ అతని తండ్రిని చంపాడా? ఇక ఆ తరువాత విలన్స్ నుమచి ప్రపంచాన్ని ఎలా కాపాడారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

   ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే..

  ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే..

  దర్శకుడు జస్టిన్ లీన్ కథ కంటే కూడా ఎక్కువ భాగం యాక్షన్ సన్నివేశాలకు తావిస్తాడు అనేది అందరికి తెలిసిందే. ఇక ఈసారి ఫస్ట్ హాఫ్ లోనే మొదట వచ్చే రేస్ సీన్ తోనే సినిమా హడావుడి మొదలవుతుంది. డొమినిక్ టోరెట్టో (విన్ డీజిల్), అతని తమ్ముడు జాకబ్ (జాన్ సెనా) మధ్య తండ్రి మర్థర్ కారణంగా మొదలైన శత్రుత్వంతో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఎక్కువగా కొనసాగుతాయి. డొమినిక్ టోరెట్టో కూడా జైలు జీవితం అనంతరం ప్రశాంతంగా గడిపే సన్నివేశాలు కొంత బోరింగ్ గా అనిపిస్తాయి. ఆ తరువాత జాకబ్ ఎంట్రితో కథ కీలక మలుపులు తిరుగుతోంది.

  సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే..

  సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే..

  కథలో ట్విస్ట్ పై దర్శకుడు జస్టిన్ లిన్ అంతగా జాగ్రత్తలు ఏమి వహించలేదు అనిపిస్తుంది. ఆడియెన్స్ ముందుగానే ఏం జరిగుతుందో అనే విషయాన్ని కాస్త ఉహించేస్తారు. ఎక్కువ భాగం కార్ రేసుల మధ్య సన్నివేశాలు కొనసాగడం వలన కథకు అంతరాయంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మధ్యలో జాకబ్ నటన సినిమాకు కొంత ప్లస్ అని చెప్పవచ్చు. డొమినిక్ టోరెట్టోతో వచ్చే సీన్స్ కూడా ఓ వర్గం వారిని ఆకట్టుకుంటాయి. అయితే క్లయిమ్యాక్స్ కు వచ్చేసరికి మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు.

  డైరెక్టర్ పనితీరు గురించి..

  డైరెక్టర్ పనితీరు గురించి..

  ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ సంఘటనల తరువాత దర్శకుడు జస్టిన్ లిన్ కథను నడిపించిన విధానం ప్రేక్షకుల అంచనాలను అంతగా అందుకోలేకయిందనే చెప్పాలి. బ్రదర్స్ మధ్య వైరాన్ని దాటించి మళ్ళీ దుర్మార్గుల నుంచి ప్రపంచాన్ని కాపాడాలనే పాయింట్ ను ఆకట్టుకునే విధంగా చెప్పలేకపోయారు. స్క్రీన్ ప్లే కూడా చాలా నీరసంగా ఉంది. ఎక్కువగా యాక్షన్ కార్ రేసులతో హడావుడి కనిపించింది.

  పోని ఆ కోణంలో అయినా ఆకట్టుకున్నారు అంటే అది లేదు. సెకండ్ హాఫ్ అయితే మరీ సాగాదీసినట్లుగా ఉంది. ఫైనల్ గా జస్టిన్ లిన్ ఈసారి తన మేకింగ్ విజన్ తో అంతగా సక్సెస్ అవ్వలేదని తెలుస్తోంది.

  నటీనటుల ఎలా చేశారంటే..

  నటీనటుల ఎలా చేశారంటే..

  విన్ డీజిల్, మిచెల్ రోడ్రిగ్స్, జాన్ సెనా, హెలెన్ మిరెన్, కర్ట్ రస్సెల్, చార్లిజ్ థెరాన్ వంటి స్టార్ నటులు లిస్టు చూడగానే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అందుతాయని చెప్పవచ్చు. అయితే ఈ నటీనటులు వారి స్టైల్ లో బాగానే నటించారు. కానీ విన్ డీజిల్ కొన్ని చోట్ల చెప్పిన సీరియస్ డైలాగ్స్ మాత్రం కామెడీగా ఉన్నాయి. జాన్ సెనా, హెలెన్ మిరెన్ మరోసారి వారి బాడీ లాంగ్వేజ్ తో మెప్పించారు. చార్లిజ్ థెరాన్ కూడా తన చూపులతో ఓ వర్గం కుర్రాళ్లను అమితంగా ఆకట్టుకుంటుంది.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఇందులో బెస్ట్ వర్క్ సినిమాటోగ్రఫీ అని చెప్పవచ్చు. గతంలో F7 అనంతరం చాలా గ్యాప్ తరువాత స్టీఫెన్ ఎఫ్. విండన్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చాడని చెప్పవచ్చు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అతని కష్టం కనిపిస్తుంది. ఇక 143 నిమిషాల నిడివిగల ఈ సినిమాకి డైలాన్ హైస్మిత్, కెల్లీ మాట్సుమోటో, గ్రెగ్ డి ఆరియా ఎడిటింగ్ వర్క్ చేశారు. సెకండ్ హాఫ్ లో కూడా వారు ఇంకా బాగా వర్క్ చేయాల్సింది. ఇక ఈ సినిమాను ఒరిజినల్ ఫిల్మ్ ప్రొడక్షన్ తో కలిసి మరొ నాలుగు బడా కంపెనీలు నిర్మించాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

  ఫైనల్ గా F9 ఎలా ఉందంటే

  ఫైనల్ గా F9 ఎలా ఉందంటే

  గత ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలతో పోలిస్తే F9 వాటి స్థాయిలో అయితే ఎట్రాక్ట్ చేయలేకపోయింది. రేసింగ్ సీన్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు కూడా అంతగా ఆకట్టుకోదనే చెప్పవచ్చు. చాలా రొటీన్ యాక్షన్ సీన్స్ ను కాస్త మార్చేసినట్లు ఉంది. ప్రధానమైన పాత్రలు కూడా నటనతో అంత బాగా ఏమి ఎట్రాక్ట్ చేసింది లేదు. ఫస్ట్ హాఫ్ రేసింగ్ సీన్ తో పాటు సెకండ్ హాఫ్ మీడ్ లో యాక్షన్ సీన్స్ కొంత ఆకట్టుకుంటాయి. క్లయిమ్యాక్స్ ఎండింగ్ కూడా అంత కొత్తగా ఏమి లేదు. ఫైనల్ గా F9 అయితే బిగ్ స్క్రీన్ పై అంతగా మెప్పించలేకపోయిందని చెప్పవచ్చు.

  Bigg Boss Telugu 4 : Abhijeet, Sohel Fight | Silver Coins Task Made Housemates Furious
  నటీనటులు, సాంకేతిక విభాగం

  నటీనటులు, సాంకేతిక విభాగం

  ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 సినిమా తారాగణం: విన్ డీజిల్, మిచెల్ రోడ్రిగ్స్, జాన్ సెనా, హెలెన్ మిరెన్, కర్ట్ రస్సెల్, చార్లిజ్ థెరాన్

  ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 మూవీ డైరెక్టర్: జస్టిన్ లిన్
  నిర్మాతలు: నీల్ హెచ్. మోరిట్జ్, విన్ డీజిల్, జస్టిన్ లిన్
  మ్యూజిక్ డైరెక్టర్: బ్రియాన్ టైలర్
  సినిమాటోగ్రఫీ: స్టీఫెన్ ఎఫ్. విండన్
  ఎడిటింగ్: హైస్మిత్, కెల్లీ మాట్సుమోటో, గ్రెగ్ డి ఆరియా
  బ్యానర్: ఒరిజినల్ ఫిల్మ్, వన్ రేస్ సినిమాలు, పర్ఫెక్ట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్
  రిలీజ్ డేట్: 03/09/2021

  English summary
  Fast and Furious 9 Movie Review And Rating: Vin Diesel's Worst Movie Of His Career 2021
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X