Fateh Movie Review: ఫతే మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: సోనుసూద్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా, దివ్యేందు భట్టాచార్య తదితరులు
దర్శకత్వం: సోనుసూద్
కథా రచన: సోనుసూద్, అంకూర్ పజ్నీ
నిర్మాతలు: సొనాలి సూద్, ఉమేశ్ కేఆర్ భన్సాల్
సినిమాటోగ్రఫి: విన్సెంజో కొండోరెల్లి
ఎడిటింగ్: యష్ పారిఖ్, చంద్రశేఖర్ ప్రజాపతి
మ్యూజిక్: జాన్ స్టివార్ట్ ఎడూరి
పాటలు: యో యో హానీ సింగ్, షబ్బీర్ అహ్మద్, హారూన్ గవిన్
బ్యానర్లు: శక్తి సాగర్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2025-01-10.

పంజాబ్‌లోని ఓ గ్రామంలో ఫతే సింగ్ (సోనుసూద్) మిల్క్ డైరీ నడిపిస్తుంటాడు. తన ఫ్యామిలీకి దగ్గరైన అమ్మాయి నిమ్రత్ కౌర్ (శివజ్యోతి రాజ్‌పుత్) యాప్ ద్వారా లోన్ ఇచ్చే వ్యాపారంలో ఏజెంట్‌గా ఉంటుంది. అయితే లోన్ యాప్ ద్వారా ఎంతో మంది నష్టపోతుంటారు. ఇది తెలిసి నిమ్రత్ ఎదురిస్తుంది. అయితే ఆ అమ్మాయిని సైబర్ క్రైమ్ ముఠాకు చెందిన సత్యప్రకాశ్ (విజయ్ రాజ్), రాజా (నసీరుద్దీన్ షా) కిడ్నాప్ చేస్తారు.

Fateh Hindi Movie Review in Telugu

లోన్ యాప్ ద్వారా బాధితులుగా మారిన తన గ్రామస్తులను చూసి ఫతే సింగ్ ఎలా చెలించాడు? నిమ్రత్ కౌర్ కిడ్నాప్ తర్వాత ఫతే సింగ్ తీసుకొన్న నిర్ణయం ఏమిటి? సత్య ప్రకాశ్, రాజా ముఠాను ఫతే సింగ్ ఎలా ఎదురించాడు? సైబర్ క్రైమ్ ముఠాను ఎదురించే క్రమంలో ఎథికల్ హ్యాకర్ ఖుషీ శర్మ (జాక్వలైన్ ఫెర్ణాండేజ్) సహాయాన్ని ఫతే సింగ్ ఎలా తీసుకొన్నారు? నిమ్రత్ కౌర్రను కాపాడాడా? సత్య ప్రకాశ్, రాజా ముఠాకు ఎలాంటి శిక్ష విధించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఫతే సినిమా కథ.

ఫతే సినిమా విశేషమేమిటంటే.. ఇప్పటి వరకు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సంఘ సేవకుడిగా ప్రజల స్థానాల్లో స్థానం సంపాదించుకొన్న సోనుసూద్ తొలిసారి హీరోగా మారడమే కాకుండా డైరెక్టర్‌గా మారి ఈ సినిమాను రూపొందించారు. రూరల్, అర్బన్ బ్యాక్ డ్రాప్‌ మిక్స్ చేసి.. దానికి సైబర్ నేరాలు అనే చిన్న పాయింట్ చుట్టు అల్లుకొన్న కథలో అంతా తానై వ్యవహరించారు. ఇండియన్ ప్రేక్షకులకు జాన్ విక్, జేమ్స్ బాండ్ తరహాలో తన పాత్రను డిజైన్ చేసుకొని పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా మారిపోయాడు.

Fateh Hindi Movie Review in Telugu

ఇక మిగితా పాత్రల విషయానికి వస్తే.. నిమ్రత్ కౌర్ ఒక ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయారు. విజయ్ రాజా, ససీరుద్దీన్ షా విలన్ పాత్రలో ఆకట్టుకొన్నాడు. జాక్వలైన్ కొత్తగా గ్లామర్‌తోపాటు పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించారు. మిగితా పాత్రల్లో నటించిన వారు ఫర్వాలేదనిపించారు.

ఫతే సినిమా విషయానికి వస్తే.. సింగిల్ పాయింట్‌తో నడిచే ఎమోషనల్, యాక్షన్ డ్రామా. యానిమల్, మార్కో మాదిరిగా మితిమీరిన హింసతో ఈ సినిమాను డిజైన్ చేశారు. అయితే కథ డైలాగ్ వెర్షన్‌తో ఎక్కువగా ఉండటం వల్ల స్లోగా సాగుతుంది. ఇంకాస్త ఎమోషనల్ కంటెంట్‌కు స్కోప్ ఇస్తే మరింత బాగుండేదనిపిస్తుంది. నటుడిగా, డైరెక్టర్‌గా ఓ క్లాస్ సినిమాను అందించడంలో సోను సూద్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. యాక్షన్ లవర్స్‌కు ఈ సినిమా మంచి ఫుల్ మీల్స్ లాంటింది. థియేటర్‌లో చూస్తే మంచి అనుభూతిని పంచుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X