Fateh Movie Twitter Review: ఫతే మూవీ ట్విట్టర్ రివ్యూ.. హీరోగా, డైరెక్టర్‌గా ఇరగదీసిన సోనుసూద్
ఇండియన్ సినిమా రంగంలో స్టార్ యాక్టర్ సోనుసూద్ తొలిసారి హీరోగా మారడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రూపొందించిన చిత్రం ఫతే. ఈ సినిమాను శక్తి సాగర్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్లు నిర్మించాయి. సొనాలి సూద్, ఉమేష్ కేఆర్ భన్సాల్ నిర్మాతలుగా, అజయ్ ధర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో జాక్వలైన్ ఫెర్నాండేజ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా, దివ్యేందు భట్టాచార్య తదితరులు నటించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూ వివరాల్లోకి వెళితే..
సోనుసూద్ తొలిసారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ ఫతే. ఈ సినిమా చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. ఊహకు అందని యాక్షన్ సీక్వెన్స్, పాత్రల మధ్య సమన్వయం, సోను సూద్ డైరెక్షన్, యాక్టింగ్, రైటింగ్ అదిరిపోయింది. ఈ సినిమాలో నటించిన వారందరూ మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్షన్ లవర్స్ మస్ట్ వాచ్ సినిమా ఇది అని క్రిటిక్ తన రివ్యూను అందించారు.

#Fateh is a full-throttle action ride! Sonu Sood's directorial debut is impressive, with incredible action sequences. Balancing multiple roles, Sonu aces direction, acting, and writing. A solid performance from the entire cast. A must-watch for action lovers! #SonuSood… pic.twitter.com/5H3RRNC33r
— Ramesh Bala (@rameshlaus) January 10, 2025
ఫతే గురించి చెప్పాలంటే.. గ్రేట్ యాక్టింగ్, వావ్ అనిపించేలా మ్యూజిక్, అబ్బురపరిచే స్టోరి కారణంగా బ్లాక్ బస్టర్‌గా నిలువబోతున్నది. కథ బాగుండటమే కాకుండా స్పూర్తిని ఇచ్చేలా ఉంది. ఈ సినిమాను అద్బుతంగా తెరకెక్కించారు. కొన్ని సీన్లు చూస్తే ఊహకు అందని విధంగాఉన్నాయి. ఓవరాల్‌గా ఈ మూవీ సుపీరియర్‌గా ఉంది అని నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
#Fateh
— SOLDIER (@BHAGATSINGH0002) January 10, 2025
Great Acting ✅
WowMusic✅
AwesomeStory✅
Blockbuster✅
Rocking✅
inspiring✅
Wellmade✅
Unbelievable✅
Superior overall 🫶🏻♥️♥️♥️♥️😊Ganganagar @SonuSood pic.twitter.com/o2LchCYyFW
సైబర్ క్రైమ్ నేపథ్యంగా సాగే ఫతే సినిమాలో సోనుసూద్ యాక్టింగ్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. వారిద్దరూ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదరడంతో సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. హృదయాన్ని గుప్పిట్లో పెట్టుకొని ధైర్యంగా సినిమా చూడాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Fateh Movie Review: Sonu Sood And Jacqueline Fernandez Shine In a Cyber Action Thriller With A Heart In The Right Place!
— Box Office Worldwide (@BOWorldwide) January 10, 2025
Critics Rating: 2.5/5
Box Office Rating: 3/5https://t.co/7OUSmeRTVO#fateh #sonusood #jacquelinefernandez #NaseeruddinShah #VijayRaaz #ShivJjyotiRajput…
ఫతే సినిమా పవర్ ప్యాక్డ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్. మితీమీరిన రక్తపాతం, డేంజరస్ ట్విస్టులు సినిమాకు బలంగా మారాయి. సోనుసూద్ డైరెక్షన్ చాలా ప్రెష్‌గా ఉంది. స్టోరి గ్రిప్పింగ్‌గా ఉంది. యాక్షన్ లవర్స్ తప్పక చూడాల్సిన సినిమా ఇది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
#FatehReview
— Vicky Kumar (@Vicky19wwww) January 10, 2025
Packed with intense action😳 and a bloody, dangerous twist, Sonu Sood’s direction shines in this fresh and gripping story. A must-watch for action lovers!”🔥🔥#sonusood #Fateh #FatehAt99
ఫతే సినిమా ఇప్పుడే చూశాను. నిజంగా నేను ఎంత థ్రిల్ అయ్యానో మాటల్లో చెప్పలేను. హై రేంజ్ యాక్షన్ సీన్లు చూస్తుంటే సీట్లకు అతుకుపోయాను. స్టోరీలైన్ యూనిక్‌గా, ఎంగేజింగ్‌గా ఉంది. సూనుసూద్ కేవలం నటనపరంగానే కాదు.. డైరెక్షన్ పరంగా కూడా ఇరగదీశాడు. రెండు పాత్రలతో ప్రేక్షకులనకు కొత్త అనుభూతిని పంచాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Just watched #Fateh and I'm absolutely thrilled! 🔥
— Ankit panwar🇮🇳 (@Ankitkumar3033) January 10, 2025
From the get-go, the movie hooks you with its blend of high-octane action and a storyline that's both unique and engaging. Sonu Sood not only stars but also directs, and he's nailed it on both fronts.@SonuSood sir
పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్‌లో సోనుసూద్ ఇరుగదీశాడు. స్టోరీలైన్ యావరేజ్‌గా ఉన్నప్పటికీ, ఎమోషన్స్ కొంత లోపించినప్పటికీ సినిమా బాగుంది. డైలాగ్స్ చాలా ఉత్తేజాన్ని కలిగిస్తాయి. యాక్షన్ సీన్లు ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. సైబర్ క్రైమ్ కథగా సాగిన ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
#Sonusood #Fateh Review: @SonuSood shines brilliantly in action-packed film,but lacks emotional depth & compelling storyline.Dialogues are effective!Action:Extraordinary!Supporting cast-underutilized,cybercrime mafia's portrayal falls flat. Rating: ⭐️⭐️2/5 pic.twitter.com/LENiV8WMPx
— Rajeev Chaudhari (@rajeevcreations) January 10, 2025


Click it and Unblock the Notifications











