Fear Movie Review: ఫియర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: వేదిక, పవిత్ర లోకేష్, అరవింద్ కృష్ణ, సయాజీ షిండే, సత్య కృష్ణ, జయప్రకాశ్, అనీష్ కురువిల్లా తదితరులు
దర్శకత్వం: డాక్టర్ హరిత గోగినేని
నిర్మాతలు: డాక్టర్ వంకి పెంచలయ్య, ఏఆర్ అభి
సహ నిర్మాత: సుజాత రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్
సినిమాటోగ్రఫి: ఐ ఆండ్రూ
సాహిత్యం: కేకే
కొరియోగ్రాఫర్: విశాల్
బ్యానర్: దత్తాత్రేయ మీడియా
రిలీజ్ డేట్: 2024-12-14

సింధూ, ఇందూ (వేదిక) కవల పిల్లలు. బాల్యంలో తల్లి చేసిన ఓ పని కారణంగా సింధూలో ఓ మానసిక రుగ్మత పెరిగిపోతుంది. సైకాలజికల్‌గా తనలో ఆ రుగ్మత భయంగా మారుతుంది. ఎప్పుడూ ఓ అపరిచిత వ్యక్తి వెంటాడుతున్నట్టు భ్రమ కలుగుతుంది. అయితే స్కూల్‌లో పరిచయమైన సంపత్ (అరవింద్ కృష్ణ)కు క్లోజ్ అవుతుంది. అయితే సంపత్‌కు సింధూ క్లోజ్ కావడం ఇందూకు నచ్చదు. అతడికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తుంది.

Fear Movie Review in Telugu  Actress Vedika lives upto Character

తల్లి కారణంగా సింధూలో ఏర్పడిన సైకలాజికల్ డిజాస్టర్ ఏమిటి? సింధూను స్కూల్ మాన్పించి మానసిక చికిత్సాలయంలో ఎందుకు చేర్పించారు? సింధూకు సంపత్ ఎలా దూరమయ్యాడు? సింధూను నిజంగా ఎవరైనా వెంటాడుతున్నారా? అసలు సింధూకు ఉన్న మానసిక సమస్య ఏమిటి? దానిని ఆమె ఎలా అధిగించింది? సింధూపై ఇందూకు ఈర్ష్య ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానమే ఫియర్ (Fear Movie) మూవీ సినిమా కథ.

పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా సంరక్షించాలి? అనే పాయింట్‌తో సైకలాజికల్ థ్రిల్లర్‌గా డాక్టర్ హరిత గోగినేని రాసుకొన్న కథ బాగుంది. తాను రాసుకొన్న పాత్రలకు తగినట్టుగా ఎంచుకొన్న యాక్టర్లతోనే సినిమాను సక్సెస్ బాట పట్టించే ప్రయత్నం చేశారనే ఫీలింగ్ కల్పించారు. సింధూ, ఇందూ పాత్ర కోసం వేదికను ఎంచుకోవడం కథపై ఉన్న దర్శకురాలికి ఉన్న నమ్మకాన్ని తెలియజెప్పేలా చేసింది. ఫస్టాఫ్‌లో పాత్రలను భావోద్వేగంగా నడిపించిన తీరు బాగుంది. సన్నివేశాలు బలంగా ఉండటం వల్ల కథపై పట్టు సడలినివ్వకుండా చేయడంలో డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

Fear Movie Review in Telugu  Actress Vedika lives upto Character

సెకండాఫ్‌లో కథను ట్విస్టులు, టర్నులతో ఆసక్తికరంగా నడిపించిన విధానం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ సినిమాను మరింత గ్రిప్పింగ్‌గా మార్చాయి. పిల్లల్లో అనవసరమైన భయాలను క్రియేట్ చేస్తే వారి జీవితం ఎలాంటి విపత్కర పరిస్థితులకు గురిచేస్తుందనే పాయింట్ చాలా బాగుంటమే కాకుండా ఆలోచింప చేస్తుంది. ఘోస్ట్ కాన్సెప్ట్‌తో సోషల్ మెసేజ్ ఇచ్చిన తీరు బాగుంది.

సింధూ, ఇందుగా వేదిక తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఓ మానసిక రోగిగా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందా? అనే విధంగా ఉన్నాయి. ఆమె ప్రదర్శించిన హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో సినిమా భారాన్ని తన భుజాలపై మోసిందని చెప్పవచ్చు. మరోసారి తనలోని టాలెంట్‌ను విభిన్నంగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. సంపత్‌గా అరవింద్ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేష్, డాక్టర్‌గా అనీష్, సయాజీ షిండే తదితరులు తప పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

Fear Movie Review in Telugu  Actress Vedika lives upto Character

ఫియర్ సినిమాకు అనూప్ రూబెన్ అందించిన మ్యూజిక్ బాగుంది. సస్పెన్స్, ఎమోషనల్ థ్రిల్లర్ కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేశారు. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫి మరో హైలెట్. లైటింగ్, కలర్ ప్యాలెట్ సినిమాను మరింత రిచ్‌గా మార్చాయి. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై వంకి పెంచలయ్య, అభి పాటించిన నిర్మాణ విలువలు క్లాస్‌గా ఉన్నాయి.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల సంరక్షణ, పేరెంటింగ్ అంశాలను ఆధారంగా చేసుకొని స్కిజోఫ్రెనియా (Schizophrenia) అనే మానసిక సమస్యతో రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్. హరిత డైరెక్షన్, వేదిక, ఇతర నటీనటుల ఫెర్ఫార్మెన్స్, అనూప్ మ్యూజిక్, ఆండ్రూ సినిమాటోగ్రఫి మూవీకి బలంగా మారాయి. ట్విస్టులు సినిమాను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేశాయి. కథను డీటైల్‌గా చెప్పే క్రమంలో ఏర్పడిన కొంత ల్యాగ్‌ను తగ్గించాల్సిందనిపిస్తుంది. స్టోరీలో సమస్య మరింత ఎమోషనల్‌గా ఉండి.. కథాపరంగా ఇంకాస్త వర్క్ చేసి ఉంటే డెఫినెట్‌గా సైకాలజికల్ థ్రిలర్ జోనర్‌లో బెస్ట్ మూవీ అయి ఉండేదనిపిస్తుంది. పేరెంటింగ్ తరహా వచ్చే కథలను, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే వారికి ఫియర్ తప్పకుండా నచ్చుతుంది. మంచి అనుభూతిని పొందేందుకు వారాంతంలో థియేటర్‌లో ఈ సినిమాను చూసేందుకు ఓ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.

More from Filmibeat

Read more about: fear vedika haritha gogineni
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X