twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిదా మూవీ రివ్యూ: శేఖర్‌ కమ్ములకు మళ్లీ హ్యాపీడేస్

    లోఫర్, మిస్టర్ చిత్రాల తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ చేస్తున్న మరో చిత్రం ఫిదా. మలయాళంలో ప్రేమమ్ చిత్రం ద్వారా వెండితెరపైకి దూసుకొచ్చి.. యువతకు గిలిగింతలు పెడుతున్న సాయి పల్లవి ఈ చిత్రంలో కథానాయిక. తమి

    By Rajababu
    |

    Rating:
    3.5/5
    Star Cast: వరుణ్ తేజ్, సాయి పల్లవి, సాయిచంద్
    Director: శేఖర్ కమ్ముల

    లోఫర్, మిస్టర్ చిత్రాల తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ చేస్తున్న మరో చిత్రం ఫిదా. మలయాళంలో ప్రేమమ్ చిత్రం ద్వారా వెండితెరపైకి దూసుకొచ్చి.. యువతకు గిలిగింతలు పెడుతున్న సాయి పల్లవి ఈ చిత్రంలో కథానాయిక. తమిళంలో ధామ్ ధూమ్, మలయాళంలో ప్రేమమ్, కలి తర్వాత కెరీర్‌లో ఆమెకు ఫిదా నాలుగో చిత్రం.

    ఆనంద్, హ్యాపీడేస్ చిత్రాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకొన్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకుడు. 2014లో అనామిక చిత్రం తర్వాత శేఖర్ చేస్తున్న సినిమా ఇది. వరుణ్, శేఖర్ కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే ప్రస్తుతం కొంత ఒఢిదుడుకులు కనిపిస్తున్నాయి. వరుణ్‌కు లోఫర్, మిస్టర్ సినిమాలు మంచి విజయాలను అందించలేకపోయాయి.

    శేఖర్‌కు అనామిక చిత్రం చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మంచి విజయాన్ని చేజిక్కించుకొనేందుకు వారిద్దరూ ఫిదాతో సిద్దమయ్యారు. ఇక సాయిపల్లవి తెలుగులో పాగా వేసేందుకు చేస్తున్న ప్రయత్నమే ఫిదా. ఇలా ముగ్గురికి కీలకంగా మారిన ఫిదా చిత్రం గురించి తెలుసుకోవాలంటే కథలోకి వెళ్తాం..

    ఫిదా అయ్యే కథ ఇది..

    ఫిదా అయ్యే కథ ఇది..

    వరుణ్ ( వరుణ్ తేజ్) తన అన్నయ్య (రాజా), తమ్ముడితో కలిసి అమెరికాలో ఉంటారు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో ఆ ముగ్గురే కలిసి ఉంటారు. అన్నయ్యకు పెళ్లి జరిగితే ఒంటరిగా బతుకున్న ఆ ముగ్గురు ఓ కుటుంబంగా మారుతుందనే భావిస్తాడు వరుణ్. ఇంటర్నెట్‌లో మ్యారేజ్ వెబ్‌సైట్ చూసి బాన్సువాడలో ఉంటున్న భానుమతి (సాయిపల్లవి) ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు. భానుమతి అక్కయ్య (రేణు)తో వరుణ్ అన్నయ్య పెళ్లిచూపులు జరగడం, ఇరువర్గాలకు నచ్చడంతో వారంలోపే పెళ్లి జరుగుతుంది. ఈ వారంలో వరుణ్, భానుమతి చాలా దగ్గరవుతారు. ఇద్దరు ప్రేమించుకొంటారు. కానీ మనసు విప్పి చెప్పుకోలేకపోతారు. ఓ కారణంగా వరుణ్‌ను తప్పుగా భానుమతి అర్థం చేసుకొని అతనిపై ప్రేమను చెరిపేసుకుంటుంది.

    Recommended Video

    Fidaa Movie Review : Varun Tej, Sai Pallavi, Shekar Kammula
    చిరు కోపం, ద్వేషం..

    చిరు కోపం, ద్వేషం..

    వరుణ్‌పై కోపం, ద్వేషం పెంచుకొని అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. వరుణ్‌పై ఉండే ద్వేషంతో ఊర్లో ఉండే ఓ వ్యాపారవేత్త (హర్షవర్థన్ రాణే) తో పెళ్లికి ఒప్పుకుంటుంది భానుమతి. దీంతో భానుమతి ప్రేమలో పీకల్లోతు మునిగిన వరుణ్ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఈ క్రమంలో భానుమతి బాన్సువాడ నుంచి అమెరికా వెళ్తుంది. అక్కడ భాను, వరుణ్ మధ్య లవ్ అండ్ హేట్ సీన్లు బాగానే జరుగుతాయి. ఆ తర్వాత ప్రేమను పక్కన పెట్టి స్నేహితులుగా మారుతారు. ఆ తర్వాత కొన్ని రోజులకు భాను బాన్సువాడకు తిరిగివస్తుంది. కానీ భానుమతిని వదలేక వరుణ్ బాన్సువాడకు వస్తాడు. ఆ తర్వాత వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీసిందా? వరుణ్ ప్రేమను భాను అంగీకరిస్తుందా? హర్షవర్థన్‌తో పెళ్లి ఆగిపోతుందా? పెళ్లైన తర్వాత వరుణ్, భాను అమెరికా వెళ్లకుండా బాన్సువాడలోనే ఎందుకు స్థిరపడుతాడు? భానుపై అంతగా ఫిదా అయ్యే అంశాలు వరుణ్‌కు ఏమి కనపడ్డాయి? ఇలాంటి ప్రశ్నలకు వెండితెర మీద భావోద్వేగ సమాధానాలే ఫిదా చిత్రం.

    ఫస్టాఫ్..

    ఫస్టాఫ్..

    తొలిభాగంలో అన్నదమ్ముల మధ్య అనుబంధం, అక్కా, చెలెల్లు, తండ్రి, కుటుంబాల మధ్య అనుబంధాలను చాలా చక్కగా తెరెక్కించాడు శేఖర కమ్ములు. శేఖర్ విజన్‌ తగినట్టు వరుణ్, సాయి పల్లవి తెరమీద అద్భుతంగా కనిపించారు. ప్రధానంగా సాయి పల్లవి చుట్టూ అల్లుకున్న తీరు శేఖర్ ప్రతిభకు మరోసారి అద్దం పట్టింది. ఆనంద్, గోదావరి చిత్రాల్లో కమలిని ముఖర్జీని నటనపరంగా ఎలా వాడుకొన్నాడో.. అంతుకుమించి సాయిపల్లవి నుంచి నటన రాబట్టాడు. ప్రతీ ఫ్రేమ్‌లో సాయి పల్లవి అందం, అభినయంతో ప్రేక్షకుడిని ప్రేమతో కట్టిపడేస్తుంది. సాయి పల్లవి నటన చూస్తే తెలుగు పరిశ్రమకు సావిత్రి, జయసుధ, సౌందర్య లాంటి నటి దొరికిందనే భావనను కల్పించడంలో శేఖర్ సఫలమయ్యాడు. వరుణ్‌ విషయానికి వస్తే తొలి భాగంలో చాలా చలాకీగా గత చిత్రాలకు భిన్నంగా పరిణతితో కూడిన మంచి నటనతో కనబరిచాడు. తొలి భాగంలో వరుణ్, సాయి పల్లవి కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా హెల్తీగా కనిపించడం ఫ్యామిలీ ఆడియెన్స్ ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతాయి.

    రెండో భాగంలో

    రెండో భాగంలో

    సాయి పల్లవి, వరుణ్ ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు, వారి మధ్య విభేదాలు, ద్వేషం, కోపం, ప్రేమ ఇవన్నీ అంశాలను కలబోసి సరికొత్తగా సీన్లను ఆవిష్కరించారు. భావోద్వేగమైన నటనతో ఒకరికొకరు పోటీ పడ్డారు. సినిమా రెండో భాగంలో ఫీల్‌గుడ్ సన్నివేశాలను పక్కా సన్నివేశాలతో పరుగులు పెట్టించాడు. సాధారణంగా కామెడీ ట్రాక్‌ను సపరేట్‌గా పెట్టి సినిమాలు తీయడం టాలీవుడ్ ట్రెండ్. కానీ ఈ ట్రెండ్‌ను శేఖర కమ్ముల గండికొట్టాడు. పాత్రల మధ్య సన్నివేశాల్లోనే ఆరోగ్యకరమైన కామెడీని పండిస్తూ కాఫీ లాంటి సినిమాను మళ్లీ అందించాడు శేఖర్ కమ్ముల. అనామిక మిగిల్చిన చేదు అనుభవంతో శేఖర కమ్ముల.. ఫిదాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గత మూడేళ్లుగా కసితో ఉన్నట్టు కనిపించింది. అందుకు అందుకు మించిన ఫలితమే రాబట్టాడు.

    శేఖర్ కమ్ముల అమేజింగ్..

    శేఖర్ కమ్ముల అమేజింగ్..

    రెండు లైన్ల చిన్న కథను రెండున్నర గంటలపాటు సినిమాగా మార్చాడు శేఖర్ కమ్ముల. ప్రేక్షకుడిని ఎక్కడా ఇబ్బందిపెట్టకుండా కూర్చొపెట్టడంతోనే ఈ సినిమా బలమేంట్ చెప్పాడు శేఖర్. మధ్య తరగతి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలు, అత్త, మామ, అక్క, తండ్రి మధ్య ఉండే ప్రేమను అమోఘంగా తెరపై ఆవిష్కరించారు. ఆనంద్, హ్యాపీడేస్, గోదావరి లాంటి ఫ్యామిలీ, ఫీల్‌గుడ్ సినిమాల కొరతను తీర్చే విధంగా ఫిదాను రూపొందించారు. ఫిదాను చూసి ప్రేక్షకుడి ఫిదా అవ్వడమనేది గ్యారెంటీ.. కానీ సాయి పల్లవి, వరుణ్ ఫెర్మార్మెన్స్ చూసి మాత్రం తప్పకుండా ప్రేమలో పడటం ఖాయం.

    సన్నివేశాలకు బలంగా తెలంగాణ యాస

    సన్నివేశాలకు బలంగా తెలంగాణ యాస

    తెలుగు సినీ పరిశ్రమలో నిరాదరణకు గురైన తెలంగాణ యాస, భాషను తెలుగు వారందరూ ఇష్టపడేంతగా చిత్రీకరించి ఫిదాను గొప్పగా తెరకెక్కించారు. తెలంగాణ యాస కీలక సన్నివేశాలకు బలంగా మారాయి. అయితే కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు ట్విస్టులు ఉంటే బాగుండేదని సరదాపడటం సహజం. కానీ నిజాయితీగా, ప్రేమతో సినిమాలను నిర్మించే శేఖర్ కమ్ముల అలాంటి వాటికి తాను అతీతుడని మరోసారి ఫిదా చెప్పాడు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడికి పక్కాగా పైసా వసూల్ చేసే చిత్రమనే భావన కల్పించడంలో సఫలమయ్యాడు.

    సాయిపల్లవి యాక్టింగ్ అదుర్స్

    సాయిపల్లవి యాక్టింగ్ అదుర్స్

    చలాకీగా, చిలిపిగా కనిపించే ప్రేమను పంచే మన పక్కింటి అమ్మాయిలా సాయి పల్లవి నటన హ్యాట్సాఫ్. గ్లామర్ అంటే వెస్ట్రన్ దుస్తులు వేసుకోవడం అనే పిచ్చి కాన్సెప్ట్‌ను సాయి పల్లవి దూరం చేసింది. చక్కగా తెలుగు అమ్మాయిలా లంగా ఓణిలో తెర మీద చూడగానే ముచ్చట పడేలా కనిపించింది. అందం పక్కన పడితే.. ఆ నటన మామూలు నటన కాదు. ఆ డ్యాన్సులు మాటల్లో చెప్పకోలేం. ప్రేమమ్‌లో కొంచెం శ్యాంపిల్ చూపించిన సాయి పల్లవి ఫిదాలో ఏకంగా నటన, గ్లామర్‌తో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టేసింది. భానుమతి పాత్రతో టాలీవుడ్‌లో జెండా పాతినట్టే కనిపిస్తున్నది.

     వరుణ్ చాలా హ్యాపీగా..

    వరుణ్ చాలా హ్యాపీగా..

    గత కొద్దికాలంగా కొన్ని సినిమాల్లో నటించిన వరుణ్‌కు సరైన పాత్రలు కుదర్లేదు. గత చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలో ఏదో ఒక వెలితి కనిపించేది. కానీ ఫిదాలో మాత్రం అన్ని అంశాలు చక్కగా కుదిరాయి. వరుణ్‌కు ఈ సినిమాలోని పాత్ర హండ్రెడ్ పర్సెంట్ టైలర్ మేడ్ రోల్. డైలాగ్ డెలివరిలోనూ, నటనపరంగా బెస్ట్ అనిపించేలా రాణించాడు. ఇక లుక్స్ విషయానికి వస్తే మాత్రం స్టయిల్‌తొ పడగొట్టేసాడు. ఎమోషనల్ సీన్లలో వరుణ్ నటన సహజంగానే గుండెను తడుముతుంది. ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తుంది. బాబాయ్ పవన్ కల్యాణ్‌కు ఖుషీ ఎలానో.. కెరీర్‌లో వరుణ్‌కు ఫిదా అలా మారిందని చెప్పవచ్చు.

    మళ్లీ తెలుగు తెరపై సాయిచంద్

    మళ్లీ తెలుగు తెరపై సాయిచంద్

    సాయి పల్లవికి తండ్రిగా సాయిచంద్‌కు టాలీవుడ్‌లో కమ్ బ్యాక్ ఫిలిం. సాయిచంద్‌ను చూస్తే మంచి నటుడు టాలీవుడ్‌కు దూరమయ్యాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. బాధ్యత కలిగిన తండ్రిగా, కూతురు ప్రేమలో తడిసి ముద్దయ్యే వ్యక్తిగా మంచి ఫెర్ఫార్మెన్స్‌ను కనబరిచారు. ఈ చిత్రంలోని నటనతో సాయిచంద్ మళ్లీ తెలుగు తెరపై నిలదొక్కుకునే అవకాశం ఉంది. గతంలో విప్లవ చిత్రాలతో సాయిచంద్ సుపరితుడన్న సంగతి తెలిసిందే.

    సిరివెన్నెల తనయుడు..

    సిరివెన్నెల తనయుడు..

    మిగితా పాత్రల్లో సిరివెన్నెల సీతారాంశాస్త్రి కుమారుడు రాజా చెంబోలు గీతా భాస్కర్, శరణ్య ప్రదీప్, హర్షవర్థన రాణే, సత్యం రాజేశ్ తదితరలుు కనిపించారు. వరుణ్ అన్నగా రాజా చెంబోలు నటించారు. ఈ చిత్రంలో రాజాకు మంచి గుర్తింపు ఉండే పాత్ర దక్కింది. బరువైన పాత్రను చాలా అవలీలగా, ఎలాంటి తడబాటు లేకుండా నటించడం ప్లస్ పాయింట్. ముఖ్యంగా

    తరుణ్ భాస్కర్ తల్లి..

    తరుణ్ భాస్కర్ తల్లి..

    సాయి పల్లవికి మేనత్తగా పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ చక్కగా నటించారు. ఆమె పాత్ర ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతుంది. హర్షవర్థన్ రాణే చాలా చిన్నపాత్ర. పెద్దగా గుర్తుంచుకొనే పాత్ర కాదు. సాయి పల్లవికి అక్కగా శరణ్య ప్రదీప్ ఆకట్టుకొన్నది. తెలంగాణ యాసకు తగినట్టు హావభావాలను, కీలక సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. వరుణ్ స్నేహితుడి పాత్రలో సత్యం రాజేశ్ అడపాదడపా నవ్వులు పూయించారు. తనదైన నటనతో రాజేశ్ వినోదాన్ని పంచాడు.

    మల్లీశ్వరిని మళ్లీ గుర్తొచ్చేలా

    మల్లీశ్వరిని మళ్లీ గుర్తొచ్చేలా

    ఫిదా సినిమా ఫీల్‌గుడ్ చిత్రమని గట్టిగా చెప్పడానికి సంగీతం వెన్నెముకగా నిలిచింది. శక్తి కాంత్ అందించిన సంగీతం చాలా బాగుంది. ప్రధానంగా ఆడియోలో వినగానే వెంటాడిన పాటలు, తెర మీద కూడా అదే ఫీలింగ్ కల్పించాయి. సందర్భోచితంగా అన్ని పాటలు సరిగ్గా కుదిరాయి. ‘వచ్చిందే..పిల్లా మెల్లగా వచ్చిందే.. క్రీమ్ బిస్కెట్ వచ్చింది', ‘ఏదో జరుగుతుంది', ‘హేయ్ పిల్లగాడా', ‘ఊసుపోదు.. ఊరుకోదు' పాటలు సినిమా నుంచి వచ్చిన తర్వాత వెంటాడుతూనే ఉంటాయి. పిల్లగాడా పాట మాత్రం పాత మళ్లీశ్వరీ చిత్రంలో భానుమతి పాడిన పరుగులు తీయాలి.. గిత్తలు ఉరకలు వేయాలి అనే పాటను గుర్తుకు తెస్తుంది. ఈ పాటలన్నీ మనసుకు హత్తకు పోవడానికి సాయి పల్లవి అభినయంతో చేసిన ఓ మాయ కూడా ఓ కారణం కావొచ్చు.

    చాలా రిచ్‌గా సన్నివేశాలు..

    చాలా రిచ్‌గా సన్నివేశాలు..

    సినిమాను మనోరహంగా, మనోరంజకంగా మలిచిన తీరు సూపర్. విజయ్ సీ కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. నిజామాబాద్, బాన్సువాడ ప్రాంతాల్లోని లోకేషన్లు.. అమెరికాలోని లొకేషన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలోని అందాలు మరోవైపు.. అమెరికాలోని పోష్ లోకేషన్లను అద్భుతంగా తెరకెక్కించారు.

    అద్బుతంగా ప్రొడక్షన్ వ్యాల్యూస్

    అద్బుతంగా ప్రొడక్షన్ వ్యాల్యూస్

    శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఫిదా చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఓ దృశ్యకావ్యంగా, ఫీల్‌గుడ్ మూవీగా మలుచిన తీరు ఆయన నిర్మాణ విలువలకు అద్దం పట్టాయి. గ్రామీణ ప్రాంతంలోని సీన్లు చాలా రిచ్‌గా ఉన్నాయి.

    మార్తాండుడు మళ్లీ మెరిసాడు..

    మార్తాండుడు మళ్లీ మెరిసాడు..

    ఫిదా చిత్రానికి మార్తండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించాడు. ఆయన పనితీరును ఒంక పెట్టడానికి ఎక్కడ అవకాశం లేదు. కానీ సెకండాఫ్‌లో సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే స్లోగా ఉందనే భావన తగ్గి మరింత ఆకట్టుకునే విధంగా ఉండేది.

    చివరగా..

    చివరగా..

    ఒక అంద‌మైన ప‌ల్లెటూరు, అంద‌మైన మట్టి మ‌నుషుల జీవితాల నేపథ్యంగా సాగే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ ఈ చిత్రం. ఇటీవల వచ్చిన అనేకమైన ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో ఉత్తమమైనది. సూపర్ మార్కెట్‌కు వెళ్లే వినియోగదారుడికి అన్ని ఒకచోట దొరికినట్టే.. కొంచెం వినోదం, మరికొంచెం రొమాన్స్, కొంచెమంత బాధ, ఉద్వేగం, కామెడీ అన్నీ అంశాలు ఈ చిత్రంలో ప్రేక్షకుడికి దొరుకుతాయి. ఎలాంటి ఆలోచనలు, మొబైల్‌ను స్విచ్ఛాఫ్ చేసి చక్కగా సీట్లో ఒదిగిపోతే రెండుగంటల వ్యవధిలో అన్ని భావాలు మీ మనసులో కదలాడటం ఖాయం.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    కథ, కథనం
    సాయి పల్లవి, వరుణ్ తేజ్ నటన
    మ్యూజిక్
    డైరెక్షన్

    నెగిటివ్ పాయింట్స్
    సెంకడాఫ్‌లో కొంచెం ఎక్కువ లెంగ్త్

    క్లైమాక్స్

    తెర ముందు.. తెర వెనుక

    తెర ముందు.. తెర వెనుక

    నటీనటులు: వరుణ్ తేజ్, సాయి పల్లవి, రాజా చెంబోలు, సాయిచంద్, శరణ్య ప్రదీప్, గీతా భాస్కర్, హర్షవర్థన్ రాణే
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శేఖర్ కమ్ముల
    నిర్మాత: దిల్ రాజు
    సినిమాటోగ్రఫీ: విజయ్ సీ కుమార్
    సంగీతం: శక్తికాంత్
    ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేశ్
    బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
    రిలీజ్ డేట్: 2017 జూలై 21

    English summary
    Director Sekhar Kammula's Telugu movie Fidaa is a romance drama starring Varun Tej and Sai Pallavi. Dil Raju has bankrolled Fidaa under his banner Sri Venkateswara Creations and he has made sure that the film has brilliant production values. Shakthi Kanth's music, Vijay C Kumar's picturisation, beautiful locales, fights and dialogues are the attractions on the technical front, say the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X