twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    FIR movie review ఆకట్టుకొన్న విష్ణు విశాల్.. కానీ..!

    |

    Rating:
    2.0/5
    Star Cast: విష్ణు విశాల్, మంజిమా మోహన్, గౌతమ్ వాసుదేవన్ మీనన్
    Director: మను ఆనంద్

    తమిళంలో రాక్షసుడు (రాట్సాసన్) లాంటి భారీ హిట్‌తో స్టార్ స్టేటస్‌ను సంపాదించుకొన్న విష్ణు విశాల్ తాజాగా నటించిన చిత్రం ఎఫ్ఐఆర్. దేశ భద్రత, ఇన్వెస్టిగేటివ్ కథాంశంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్‌ రావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాల పెరిగాయి. అయితే ఎఫ్ఐఆర్ చిత్రం రాక్షసుడు చిత్రం మాదిరిగానే విష్ణుకు సక్సెస్ అందించిందా? ఎఫ్ఐఆర్ చిత్రం ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయంలోకి వెళితే..

    FIR కథ ఏమిటంటే?

    FIR కథ ఏమిటంటే?

    కెమికల్ ఇంజినీర్‌గా పనిచేసే ఇర్ఫాన్ ఆహ్మాద్ (విష్ణు విశాల్) ఐఐటీలో గోల్డ్ మెడలిస్ట్. కానీ చిన్న కెమికల్ కంపెనీ‌లో పనిచేస్తూ మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. జాజీ అనే ముస్లిం మత సంబంధించిన కంపెనీకి కెమికల్స్ సప్లై చేస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అబూబాకర్ అబ్దుల్లా అనే ఐసీస్ టెర్రిరిస్టు శ్రీలంక, ఇండియాలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్లాన్ చేస్తూ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తుంటాడు. శ్రీలంక, హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లకు ఇర్ఫాన్‌ కారణమనే అనుమానంతో ఎన్ఐఏ అరెస్ట్ చేస్తుంది.

    FIR ‌లో ట్విస్టులు ఇలా

    FIR ‌లో ట్విస్టులు ఇలా

    అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో ఇర్ఫాన్‌కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో జరిగిన పేలుడుకు ఇర్ఫాన్‌కు సంబంధం ఉందా? అబూబాకర్ అబ్దుల్లా ఎవరు? తెలుగు రాష్ట్రాలతో అతడికి ఎలాంటి సంబంధం ఉంది? చివరకు అబూబాకర్ ఆటకు ఎవరు చెక్ పెట్టారు. జాజీ మత సంస్థకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు సంబంధాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానమే ఎఫ్ఐఆర్ సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఎఫ్ఐఆర్ సినిమా విషయానికి వస్తే.. పాత్రల పరిచయం కోసమే చాలా ఎక్కువ సమయం తీసుకోవడం, ఐసీస్, ఎన్ఐఏ లాంటి సంస్థల గురించి ఉపోద్ఘాతం డోస్ కాస్త ఎక్కువగా ఉండటంతో ఫస్టాఫ్ అంతా ఓ డాక్యుమెంటరీ మాదిరిగా అనిపిస్తుంది. తల్లి, కొడుకుల మధ్య సెంటిమెంట్, స్పష్టత లేని లవ్ ట్రాక్ ఇవన్నీ కాస్త గందరగోళంగా కనిపిస్తాయి. కథలో అసలు సమస్యను డీల్ చేసే పాయింట్ కోసం ఇంటర్వెల్ వరకు చాలా నీరసంగా, సహనంతో వేచి ఉండాల్సి వస్తుంది.

    సెకండాఫ్ రొటీన్‌ అంశాలతో

    సెకండాఫ్ రొటీన్‌ అంశాలతో

    అబూబాకర్ అబ్దుల్లా చుట్టు తిరిగే కథ, కథనాలు ఆసక్తికరంగా లేకపోవడం వల్ల సినిమాలో పసలేదని విషయం తొందరగానే అర్ధమవుతుంది. రకరకాల లోపాలు, లాజిక్ లేని అంశాల మధ్య విష్ణు విశాల్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను కాపాడటం కోసం చేసిన ప్రయత్నం కాస్త ఊరట కలిగించే విషయంగా కనిపిస్తుంది. అబూబాకర్ అబ్దుల్లా ఎవరు అనే విషయాన్ని ఆసక్తికరంగా మలచకపోవడంతో సినిమా తేలిపోయినట్టు అనిపిస్తుంది. విష్ణు విశాల్ (ఇర్ఫాన్ ఆహ్మద్)కు సంబంధించిన ట్విస్టు ప్రేక్షకుడిని థ్రిల్ చేయలేకపోవడంతో ఎఫ్ఐఆర్ మూవీ అతి సాధారణ చిత్రం అనే ముద్రను వేసుకొంటుంది.

    దర్శకుడు మను ఆనంద్ టేకింగ్ ఇలా..

    దర్శకుడు మను ఆనంద్ టేకింగ్ ఇలా..

    దర్శకుడు మను ఆనంద్ ఎంచుకొన్న పాయింట్‌ బాగానే అనిపిస్తుంది. కథ, కథనాలు మూసగా ఉండటం, స్టోరికి బలంగా మారే పాత్రలను బలంగా రాసుకోలేకపోవడంతో అతడి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరుగా కనిపిస్తుంది. దేశ భద్రతను సవాల్ చేసే కథలో సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేయలేకపోవడం ఈ సినిమాకు ప్రధానమైన బలహీనత. తల్లి, కొడుకుల సెంటిమెంట్ ఈ సినిమాకు కాస్త బలంగా కనిపిస్తుంది. తల్లి మరణించే సీన్‌ ఎమోషనల్‌గా ఆకట్టుకోవడమే కాకుండా దర్శకుడి ప్రతిభను తెలియజేస్తుంది.

    విష్ణు విశాల్ పెర్ఫార్మెన్స్, ఇతర నటీనటులు

    విష్ణు విశాల్ పెర్ఫార్మెన్స్, ఇతర నటీనటులు

    కథ, కథనాల్లో పేలవం, నాసిరకం, లోపాలు పక్కన పెడితే.. ఇర్ఫాన్‌గా విష్ణు విశాల్ నటన బాగుంది. డిఫరెంట్ గెటప్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొంటాడు. ఎప్పటిలానే ఫైట్స్ బాగా చేశాడు. కీలక సన్నివేశాల్లో హృదయాన్ని కదిలించే ఫెర్ఫార్మెన్స్ చేశాడనిపిస్తుంది. తన వంతు వరకు విష్ణు విశాల్ తన పాత్రకు, సినిమాకు న్యాయం చేశాడనిపిస్తుంది. అర్చన (రెబా మోనిక జాన్)తో ఇర్ఫాన్ లవ్ ట్రాక్ ఆకట్టుకొలేకపోయింది.

    కార్తీక్ లాంటి మిగితా పాత్రలు కథకు కొసమెరుపులా అనిపిస్తాయి. ఎన్ఐఏ బాస్‌గా అజయ్ దేవాన్‌గా గౌతమ్ మీనన్ పోషించిన పాత్ర రొటీన్‌గా ఉండటం కారణంగా ఆకట్టుకొలేకపోయాడు. ప్రార్థనగా మంజిమా మోహన్, అనిషా ఖురేషిగా రైజా విల్సన్, రెబా మోనిక లాంటి పాత్రల లెంగ్త్ ఎక్కువగానే ఉన్నప్పటికీ నామమాత్రంగానే కనిపిస్తాయి.

    టెక్నికల్ విభాగాల పనితీరు..

    టెక్నికల్ విభాగాల పనితీరు..

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కథలో ఉండే ట్విస్టులు, బలహీనతల నడుమ జీకే ప్రసన్న‌కు ఎడిటింగ్ కత్తి మీద సాములానే మారిందనే అభిప్రాయం కలుగుతుంది. పేలవమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. కథను వేగంగా పరిగెత్తించేలా చేయడంలో ప్రసన్న ప్రతిభ తెరపైన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫి అక్కడక్కడ ఆకట్టుకొంటుంది. గ్రాఫిక్ వర్క్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. అశ్వంత్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది.

    ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే?

    దేశ భద్రత, ఉగ్రవాదం, దేశభక్తి, తల్లి కొడుకుల సెంటిమెంట్ లాంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎఫ్ఐఆర్. నాసిరకమైన కథ, కథనాలు, పసలేని సన్నివేశాలు సినిమాకు మైనస్‌గా కనిపిస్తాయి కొన్ని పవర్ ఫుల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ.. గొప్ప సస్పెన్స్, థ్రిల్లర్ అనే ఫీలింగ్‌ను కల్పించడంలో విఫలమైందనిపిస్తుంది. కొన్ని అనవసరమైన అంశాలు కథను బలహీన పరిచాయనే అభిప్రాయం కలుగజేస్తాయి.

    తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని నటులే ఉండటం కారణంగా కనెక్ట్ కావడం కష్టంగా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్, దేశభక్తి, ఉగ్రవాద నేపథ్యంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఎఫ్ఐఆర్ నచ్చే అవకాశం ఉంది. ఓవరాల్‌గా థియేటర్‌కు వెళ్లి చూడాల్సినంత చిత్రమనే ఫీలింగ్ కలిగించలేదని చెప్పవచ్చు.

    FIR లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    FIR లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: విష్ణు విశాల్, మంజిమా మోహన్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, రైజా విల్సన్, రెబా మోనిక తదితరులు
    నిర్మాత: ఆనంద్ జాయ్, సుబ్రా
    దర్శకత్వం: మను ఆనంద్
    సమర్పణ: మాస్ మహారాజా రవితేజ
    ఎడిటింగ్: జీకే ప్రసన్న
    సినిమాటోగ్రఫి: అరుల్ విన్సెంట్
    సంగీతం: అశ్వంత్
    రిలీజ్ డేట్: 2022-02-11

    English summary
    Tamil Actor Vishnu Vishal's FIR movie hits the screen on Feb 11th. Here is the exclusive Review for audience by Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X