twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    First Day First Show Review అనుదీప్ షో వెరీ పూర్.. నాసిరకం కామెడీతో!

    |

    Rating: 2/5

    తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన జాతి రత్నాలు చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. దర్శకుడు అనుదీప్ రూపొందించిన ఈ చిత్రం ఊహకు అందని విధంగా కలెక్షన్లు సాధించింది. అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే అందించి.. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణను దర్శకులుగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో.

    ఈ సినిమాను ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ పూర్ణోదయ నిర్మించడం విశేషంగా మారింది. ఖుషి సినిమా, పవన్ కల్యాణ్ అంశాల నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం జాతి రత్నాలు అందించిన అనుభూతిని ప్రేక్షకులకు మిగిల్చిందా? పూర్ణోదయ సంస్థను ప్రతిష్టపెంచే విధంగా ఈ చిత్రం నిలిచిందా అనే వివరాల్లోకి వెళితే..

    FDFS కథ ఏమిటంటే?

    FDFS కథ ఏమిటంటే?

    నారాయణఖేడ్‌కు చెందిన శ్రీను (శ్రీకాంత్ రెడ్డి) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని. అదే గ్రామానికి చెందిన లయ (సంచిత బాషు) కూడా పవన్ కల్యాణ్ అంటే చెప్పలేనంత ఇష్టం. పవన్ కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే అంతే ఇష్టంగా ప్రేమించుకొంటారు. అయితే ఖుషి సినిమా రిలీజ్‌కు ముందు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కావాలని శ్రీనును లయ కోరుతుంది. దాంతో ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం టికెట్ల వేట శ్రీను ప్రారంభిస్తాడు.

    FDFS లో ట్విస్టులు

    FDFS లో ట్విస్టులు

    లయ కోసం ఖుషి సినిమా టికెట్ సంపాదించడానికి శ్రీను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రియురాలి మనసు గెలుచుకోవడానికి ఎలాంటి అవస్థలు పడ్డాడు? తన అభిమాన నటుడి సినిమా తొలి రోజు తొలి ఆట చూడటానికి ఎలాంటి అవమానాలు భరించాడు. చివరకు ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ సంపాదించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే First day first show కథ.

    FDFS ఎలా ఉందంటే?

    FDFS ఎలా ఉందంటే?

    First day first show మూవీ విషయానికి వస్తే.. మళ్లీ నాటు కామెడీ, ఫన్ అంశాలపై ఆధారపడ్డారనే విషయం సినిమా ఆరంభమైన కొద్ది సేపట్లోనే స్పష్టమవుతుంది. అయితే నాసిరకం కామెడీ, పేలవమైన సన్నివేశాలతో రొటీన్‌గా సాగిపోతుంది. అయితే సింగిల్ పాయింట్ ఎజెండాతో కథను సాగదీయడం సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. సుదీర్ఘంగా సాగే సన్నివేశాలు చాలా రెగ్యులర్ ఫార్మాట్‌తో సాగుతాయి. అక్కడ కొన్ని సన్నివేశాలను అనుదీప్ టీమ్ బాగా రాసుకొంది. కానీ అవి జాతిరత్నాలు మాదిరిగా మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాయి. ఫస్టాఫ్, సెకండాఫ్ ఫ్లాట్ నేరేషన్‌తో ముందుకు సాగడంతో వైవిధ్యం కనపడని మూవీ అనేది అర్దమవుతుంది.

    విఫలమైన అనుదీప్ టీమ్

    విఫలమైన అనుదీప్ టీమ్

    అనుదీప్ రాసుకొన్న పాయింట్ బాగుంది కానీ.. పూర్తి కథా వస్తువుగా విస్తరించడంలో టోటల్ టీమ్ దారుణంగా విఫలమైందని చెప్పవచ్చు. జాతి రత్నాలు మూవీలో చవకబారు ఫన్ ఉన్నప్పటికీ.. మీనింగ్ ఫుల్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమా ఫన్ చాలా డీ గ్రేడ్‌తో ఉంటుంది. వృద్ధుడి మరణం సీన్, దాని నిడివి ఇబ్బందికరంగా ఉంటుంది. దర్శకులు వంశీ, లక్ష్మీనారాయణ టేకింగ్ కూడా అంతగా ఆకట్టుకోదు.

    నటీనటుల ప్రదర్శన ఎలా ఉందంటే?

    నటీనటుల ప్రదర్శన ఎలా ఉందంటే?

    ఇక శ్రీనుగా శ్రీకాంత్ రెడ్డి పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తో మంచి ఈజ్‌ను ప్రదర్శించాడు. పలు సీన్లను తన ఫెర్ఫార్మెన్స్‌తో ఎలివేట్ చేశాడు. తన పాత్ర పరిధి మేరకు నూటికి నూరుశాతం న్యాయం చేశాడు. ఇక సంచిత కూడా లయ పాత్రలో ఒదిగిపోయింది. తొలి సినిమా అయినప్పటికీ మంచి హావభావాలు ప్రదర్శించింది. ఇక ఈ సినిమాకు వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్. ప్రభాస్ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి కనిపించింది అరకొర సీన్లైనా ఫర్వాలేదనిపించారు.

     మ్యూజిక్, ఇతర విభాగాల గురించి

    మ్యూజిక్, ఇతర విభాగాల గురించి

    ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. రాధాన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రామ్ మిర్యాల పాడిన పాట ఆడియోపరంగాను, తెర మీద కూడా జోష్‌గా సాగుతుంది. మిగితా విభాగాలు ఒకే అనిపించాయి. పూర్ణోదయ బ్యానర్ గత సినిమాల ప్రతిష్టను చూసుకొంటే.. ఇలాంటి సినిమాను చేయకుండా ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. తన తొలి సినిమాకు నిర్మాత శ్రీజ అనుసరించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    రూరల్ కామెడీ, తెలంగాణ నేటివిటిని ప్రధానంగా నమ్ముకొని చేసిన ఫన్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో. ఖుషి, పవన్ కల్యాణ్ పేర్లు చెప్పి ప్రేక్షకులను సంతృప్తి పరచడం కష్టం. పవర్ స్టార్ ఫ్యానిజం అనేది ఒక ఎమోషన్. ఆ సినిమా స్థాయి, పవర్ స్టార్ లెవెల్‌కు తగిన కథ, కథనాలపై కసరత్తు చేయాల్సి ఉండాల్సింది. ఇలా నాసిరకమైన కామెడీ, పేలవమైన సీన్లతో మ్యాజిక్ చేయలేమనేది ఈ సినిమా ఓ మంచి గుణపాఠంగా మారుతుంది. మరో రెండు రోజులు ఆగితే... ఈ సినిమా ఫలితం ఏమిటో స్పష్టంగా బోధపడటం ఖాయం. ఈ సినిమాపై నెలకొన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో టీమ్ విఫలమైందనే చెప్పాలి.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    శ్రీకాంత్ రెడ్డి, సంచిత యాక్టింగ్
    రధన్ మ్యూజిక్

    మైనస్ పాయింట్స్
    కథ, స్క్రీన్ ప్లే
    డైరెక్షన్
    డైలాగ్స్
    కామెడీ, ఎమోషన్స్ పండకపోవడం

    FDFS లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    FDFS లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: శ్రీకాంత్ రెడ్డి, సంచిత భాషు, వెన్నెల కిషోర్, అనుదీప్, లక్ష్మినారాయణ, ప్రభాస్ శ్రీను, తనికెళ్ల భరణి, శ్రీనివాసరెడ్డి తదితరులు
    నిర్మాత: శ్రీజ ఏడిద
    కథ, స్క్రీన్ ప్లే: అనుదీప్ కేవీ
    దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి
    సంగీతం: రధన్
    సినిమాటోగ్రఫి: ప్రశాంత్ అంకిరెడ్డి
    ఎడిటింగ్: గుల్లపల్లి సాంబశివరావు
    బ్యానర్: ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్, మిత్రవింద మూవీస్
    రిలీజ్ డేట్: 2022-09-02

    English summary
    First day first show (FDFS) is released on September 2nd. Here is the Telugu filmibeat exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X