Lilly Movie Review ఫస్ట్ పాన్ ఇండియన్ చిల్డ్రన్ మూవీ.. లిల్లీ ఎలా ఉందంటే?

నటీనటులు: బేబి నేహ, బేబి ప్రణతిరెడ్డి, మాస్టర్‌ వేదాంత్‌ వర్మ, రాజ్‌వీర్, మిచెల్‌ షా, రాజీవ్‌ పిళ్లై, శివకృష్ణ తదితరులు
కథ, దర్శకత్వం: శివమ్
నిర్మాతలు: కే బాబు రెడ్డి, సతీష్ కుమార్ జీ
బ్యానర్: గోపురం స్టూడియోస్
మ్యూజిక్: ఆంటో ఫ్రాన్సిస్
రిలీజ్ డేట్: 2023-07-07

లిల్లీ (బేబి నేహ), దివ్య (ప్రణతి రెడ్డి), గూగుల్‌ (వేదాంత్‌ వర్మ) క్లాస్‌మేట్స్‌ మాత్రమే కాదు క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు ఓ రోజు ఆడుకొంటుండగా దివ్య ముక్కు రక్తం కారడం, ఆ తర్వాత స్పృహ కోల్పోవడం జరుగుతుంది. దాంతో దివ్యను పెంచిన మామయ్య దేవా (రాజ్‌వీర్)కు తెలియ జేసి హాస్పిటల్‌కు తరలిస్తారు. దాంతో దివ్య ఆరోగ్యం విషయంలో భయంకరమైన విషయం బయటకు వస్తుంది.

First Pan India Children Film Lilly Movie Review and Rating

చిన్నారి దివ్యకు ఏమైంది? పేదరికంతో బాధపడే దేవాకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? దివ్యకు భయంకరమైన వ్యాధి ఉందని తెలియడంతో స్నేహితుల రియాక్షన్ ఏమిటి? లిల్లీ, వేదాంత్ పరిస్థితి ఏమైంది? దివ్య కోసం ఇద్దరు స్నేహితులు ఏం చేశారనే ప్రశ్నలకు సమాధానమే లిల్లి సినిమా కథ.

మాస్, కమర్షియల్, నాసిరకం కామెడీ సినిమాలు వస్తున్న ప్రస్తుతం చైల్డ్ స్టోరీస్ నేపథ్యంగా సినిమాలు రావడం లేదు. లిల్లి ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. చిన్న పిల్లల్లో ఉండే భావోద్వేగాలను దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారనే చెప్పాలి. మంచి ఎమోషనల్ పాయింట్‌తో దర్శకుడు శివమ్ చెప్పే ప్రయత్నం చేశారు. కథలో ఉండే భావోద్వేగం అందర్నీ కట్టిపడేస్తుంది.

లిల్లీ మూవీలో బేబి నేహ, ప్రణతి రెడ్డి, వేదాంత్‌ వర్మ ముగ్గురు తమ వయసుకు మించిన నటనను ప్రదర్శించారు. నేహా, ప్రణతి, వేదాంత్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఒకరిని మించి మరొకరు ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. రాజ్‌వీర్, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. బడ్జెట్‌ రేంజ్‌కు మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ఆంటో ఫ్రాన్సిస్ అందించిన మ్యూజిక్ సినిమాకు మంచి ఫీల్‌ను అందించింది. సినిమాటోగ్రఫి, ఆర్ట్, ఇతర విభాగాల పనితీరు బాగుంది. కే బాబు రెడ్డి, సతీష్ కుమార్ జీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాను నిర్మించిన తీరు చూస్తే.. వారికి ఇండస్ట్రీపై ఉండే అభిరుచి తెలియజేస్తుంది.

లిల్లీ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది. కడప, తదితర ప్రాంతాల్లో ఈ సినిమాను రాజీ పడుకుండా మంచి అవుట్‌పుట్‌తో చిత్రీకరించారు. చిన్న పిల్లల మధ్య కల్మషం లేని ప్రేమ, స్నేహాన్ని చక్కగా చూపించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఇలాంటి సినిమాలు నిర్మించడం అభినందనీయం. అయితే కమర్షియల్ హంగులను పక్కన పెడితే.. ఈ సినిమా స్లోగా సాగడం కొంత మైనస్. చిన్న పిల్లల ఎమోషన్స్‌తో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి లిల్లీ నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X