Maidaan First Review: గూస్ బంప్స్ కలిగించే స్పోర్ట్స్ డ్రామా.. పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన అజయ్ దేవగన్!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మైదాన్. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత బోని కపూర్, అరునవ జాయ్ సేన్‌గుప్తా, ఆకాష్ జాయ్ సేన్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరించారు. బాదాయి హో మూవీ ఫేమ్ అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, ప్రియమణి, గజరాజ్ రావు, రుద్రనీల్ ఘోష్, మధుర్ మిట్టల్ తదితరులు నటించిన ఈ సినిమా మే 11వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితానికి సంబంధించిన బయోపిక్ లాంటి సినిమా ఇది. 1951 నుంచి 1962 వరకు హెల్లింకీ‌లో ఒలంపిక్స్ నుంచి 1962లో జరిగిన ఏషియన్స్ గేమ్స్‌లో భారత జట్టు బంగారు పతకం గెలుచుకొనే వరకు జరిగిన సంఘటనలు, ఫుట్ బాల్ అసోసియేషన్‌లో రాజకీయాలను భావోద్వేగంగా తెరకెక్కించారు.

First Review of Maidaan Movie  Ajay Devgn steal the show with award Winning Performance

మైదాన్ సినిమాకు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్ అందించగా.. తుషార్ క్రాంతి రే, ఫైడోర్ ల్యాస్ లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్లు ఈ సినిమాకు పనిచేశారు. దేవ్ రాజ్ జాదవ్, షెహనాజ్ మోసానీ లాంటి ప్రతిభావంతులు ఈ మూవీకి సహకారం అందించారు.

ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. అంతర్జాతీయ స్థాయిలో భారత ఫుట్ బాల్ వైఫల్యం చెందుతున్న క్రమంలో సయ్యద్ అబ్దుల్ రహీం (అజయ్ దేవగణ్) అనే కోచ్ టీమ్ ఇండియాకు కోచ్‌గా నియమితులు అవుతారు. బెంగాల్ ఫుట్ బాల్ అసోసియేషన్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురు అవుతుంది. అయితే టీమ్‌కు యువ రక్తాన్ని అందించిన రహీం.. మెరుగైన ఆటను ప్రదర్శించేలా చేస్తారు. కానీ టాప్ జట్లపై విజయం సాధించలేకపోవడంతో కోచ్ పదవి నుంచి ఉద్వాసనకు గురి అవుతాడు.

First Review of Maidaan Movie  Ajay Devgn steal the show with award Winning Performance

అదే సమయంలో ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురి అవుతాడు. అయితే భారత్ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో గెలిచే సత్తా ఉంది. కాబట్టి కోచ్‌గా ఉంటానని బోర్డును కోరుతాడు. చివరకు ఆయనకు మళ్లీ కోచ్‌ను కట్టబెడుతారు. ఆ తర్వాత టీమ్ ఇండియాను విజయ పథంలోకి నడిపించరా? క్యాన్సర్ వ్యాధితో ఎలా పోరాటం చేశారు? రహీం జీవితంలో భార్య (ప్రియమణి) ఎలాంటి పాత్రను పోషించారనేది సినిమా కథ.

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా పరిశ్రమలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామాలో అత్యుత్తమ చిత్రం మైదాన్. అజయ్ దేవగన్ అద్బుతంగా నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు అవార్డులు రావడం ఖాయం. ఇక ఈ సినిమా పవర్‌ఫుల్, ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా సెకండాఫ్ ఊపిరి బిగపట్టి చూసేలా.. మీకు తెలియకుండానే.. సినిమాలో లీనమై.. మైమరిచిపోయి చప్పట్లు కొడుతూనే ఉంటారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా ఏప్రిల్ 8వ తేదీన ప్రీమియర్లు ప్రదర్శించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X