First Time Movie Review: ఫస్ట్ టైమ్ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: సౌరభ్ ధింగ్రా, అఖిల్ సార్థక్, అనికా విక్రమన్, గాయత్రి గుప్తా, మైమ్ గోపి, శివకుమార్ రామచంద్రవరపు, భూపాల్ రాజు, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు తదితరులు
కథ, నిర్మాత, దర్శకత్వం: హేమంత్ ఇప్పలపల్లి
మ్యూజిక్: శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్
సినిమాటోగ్రఫి: వేణు మురళీధర్, రామ్
ఎడిటింగ్: హేమంత్ ఇప్పలపల్లి
బ్యానర్: హేమంత్ ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2026-05-22

స్టూడెంట్ ఆద్య (అనికా విక్రమన్)కు కాలేజీలో తోటి విద్యార్థుల నుంచి చెప్పలేనంత ఫాలోయింగ్ ఉంటుంది. కాలేజీలో ఎవరినీ లెక్క చేయకుండా తన మనసుకు నచ్చిన వాడిని వెతుక్కునే పనిలో ఉంటుంది. అయితే ఆద్యపై తన బావ (భూపాల్ రాజు) కన్నేస్తాడు. ఈ క్రమంలో తన ఫ్రెండ్ (గాయత్రి గుప్తా) చేసిన మోసానికి ఆద్య ఓ సమస్యలో చిక్కుకొంటే ఆది (అఖిల్ సార్థక్) కాపాడుతాడు. దాంతో ఆదితో ఆద్య ప్రేమలో పడుతుంది. ఆదితో ప్రేమలో ఉండగానే ఆద్య ఓ ప్రమాదంలో చిక్కుకొంటారు. వారు ప్రయాణిస్తున్న జెట్ క్లాష్ కావడంతో సముద్రంలో దూకుతారు.

సముద్రంలో దూకిన ఆది, ఆద్యకు ఎదురైన పరిస్థితులు ఏమిటి? ఆద్యను దక్కించుకోవాలనుకొన్న బావ ప్రయత్నాలు ఎలా కొనసాగాయి? ఎలాంటి పరిస్థితుల్లో సౌరభ్ ధింగ్రాను ఆద్య ఎలా కలుసుకొన్నది. ఇలాంటి ప్రేమ కథలోకి ఏలియన్స్, ఆత్మలు, రోబోలు ఎందుకు వచ్చాయి? కలియుగం అంతం తర్వాత ఆద్యను చుట్టుముట్టిన పరిస్థితులు ఏమిటి? భారత ప్రపంచం ఏర్పాటుకు ఆద్య కీలకంగా ఎలా మారింది? భారత ప్రపంచం ఏర్పాటు అయిందా? తనకు నచ్చిన వ్యక్తిని ఆద్య కలుసుకొన్నదా? అనే ప్రశ్నలకు సమాధానమే ఫస్ట్ టైమ్ సినిమా కథ.

First Time Movie Review

ఫస్ట్ టైమ్ సినిమా కథ పైకి నార్మల్ లవ్ స్టోరీలా కనిపించినా.. దర్శకుడు హేమంత్ రాసుకొన్న కథ చాలా డెప్ట్‌తో కూడినది. తెలుగు తెరపై హైలీ టెక్నికల్ వాల్యూస్‌తో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేశాడనే చెప్పాలి. కాన్సెప్ట్ రూపకల్పనలో ఆయన విజన్, పాత్రల రూపొందించిన తీరు బాగుంది. సాంకేతిక విభాగాలపై ఆయనకు ఉన్న పట్టు కారణంగా ఈ సినిమా కొత్త జోనర్‌గా రూపొందించారనే చెప్పాలి. కలియుగం అంతం.. భారత్‌నే కొత్త ప్రపంచం రూపొందించాలనే ఆలోచన చాలా విభిన్నంగా, వినూత్నంగా ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ప్రేమ కథతో లింక్ చేసిన తీరు బాగుంది. ఫస్టాఫ్ కొంత స్లోగా సాగినా.. సెకండాఫ్‌లో ఈ సినిమా టెక్నికల్‌గా బ్రిల్లియెంట్‌గా ఉంటుంది. కొత్త వాళ్లతో నటనను రాబట్టుకొన్న తీరు చూస్తే దర్శకుడి ప్రతిభ తెర మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అనికా విక్రమన్, అఖిల్ సార్థక్, సౌరభ్ ధింగ్రా కొత్త వాళ్లైనా దర్శకుడి విజన్‌కు అనుగుణంగా ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనికా నేచురల్‌గా తన పాత్రలో ఒదిగిపోయింది. అఖిల్ సార్థక్ తన టాలెంట్‌ను నిరూపించుకొనే ప్రయత్నం చేశారు. సౌరభ్ ధింగ్రా నటనపరంగా ఆకట్టుకొన్నాడు. శివ, గాయత్రి గుప్తా, మైమ్ గోపి, అజయ్ రత్నం, అన్నపూర్ణమ్మ తదితరులు ఫర్వాలేదనిపించారు.

ఫస్ట్ టైమ్ సినిమా విషయానికి వస్తే.. భారీగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ఉన్న టెక్నికల్ మూవీ. న్యూ యూనివర్స్‌ను ఎలివేట్ చేసిన విధానం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. క్వాలిటీ వీఎఫ్ఎక్స్ , గ్రాఫిక్ వర్క్‌తో సినిమాను అత్యంత సాంకేతికంగా మలిచిన తీరు బాగుంది. టెక్నికల్‌గా హేమంత్ వన్ మ్యాన్ షోగా కనిపిస్తాడు. ఎడిటింగ్, దర్శకత్వ బాధ్యతలను అద్బుతంగా హ్యాండిల్ చేశాడు. వేణు మురళీధర్, రామ్ సినిమాటోగ్రఫర్స్ పనితీరు బాగుంది. శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. నిర్మాతగా కూడా హేమంత్ ఇప్పలపల్లి అనుసరించిన విలువలు చూస్తే ఈ సినిమా పెద్ద సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.

ఫైనల్‌గా.. ఈ సినిమా కాన్సెప్ట్, విజన్‌కు చూస్తే.. భారీ బడ్జెట్‌తో బిగ్ స్టార్స్‌తో తీస్తే ఈ స్టోరీ రేంజ్ వేరేలా ఉండేదనిపిస్తుంది. అత్యున్నత సాంకేతిక విలువలు ఉన్నప్పటికీ స్టార్ వాల్యూ కారణంగా ఈ సినిమా కథ, కథనాలు ఎలివేట్ కాలేకపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. సైంటిఫిక్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఈ వారం కొత్త జోనర్ సినిమాలు చూడాలనుకొనే వారికి ఫస్ట్ టైమ్ డెఫినెట్‌గా మంచి ఛాయిసే. కానీ అంచనాలు లేకుండా వెళితే మంచి ఫీల్‌తో బయటకు రావొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X