twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదేం ఫిట్టింగ్..మాస్టర్?(రివ్యూ)

    By Staff
    |
    Fitting Master
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్:ఇవివి.సినిమా
    నటీనటులు:అల్లరి నరేష్,మదాలసా శర్మ,షాయేజి షిండే,
    సుధ,చంద్రమోహన్,సైరాబాను తదితరులు.
    స్క్రిప్టు:తాడి బలరామ్,వేగేష్న సతీష్
    డాన్స్:చిన్ని ప్రకాష్ అండ్ కో
    ఆర్ట్:కెవి సుబ్బారావు
    సంగీతం:ఎస్.చిన్నా
    ఫైట్స్:రామ్ లక్ష్మన్,విజయ్
    కెమెరా:ప్రసాద్ బాబు
    కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం,నిర్మాత:ఇవివి సత్యనారాయణ
    రిలీజ్ తేది:14,జనవరి 2009

    'ఫిటింగ్ మాస్టర్' టైటిల్,ఇవివి దర్శకత్వం,అల్లరి నరేష్ హీరో అనగానే అంతా మరో కామిడీ సినిమాని ఆశించి ఆవేశంగా ధియోటర్లోకి దూకుతారు. అయితే మీరు తప్పులో కాలేసారంటూ ఇవివి ..శోభనబాబు,రోజాల సర్పయోగం సినిమాను మార్చి మనమందు పెడతాడు. దాంతో ఇదేం ఫిట్టింగ్ రా బోబోయ్ అనుకుంటూ పారిపోయి బ్రతుకు జీవుడా అనుకుంటూ వచ్చేస్తారు.రొట్టకొట్టుడు కధ,నీరసమైన కథనం,కొద్దిగా కూడా పేలని డైలాగులుకల్గిన ఈ సినిమా ఏ వర్గాన్ని టార్గెట్ చేసినా వర్కవుట్ అవటం కష్టమే.

    జిమ్ మాస్టర్ గా పనిచేసే సంపత్(అల్లరి నరేష్)..ప్రేమలంటే అసహ్యం. దాంతో అలాంటిదేమన్నా పొరపాటున కంటబడితే ఎదుటివాళ్ళకి(చూసేవాళ్ళకు) విరక్తి పుట్టేలా క్లాస్ పీకుతూంటాడు. ఇది వింతగా అనిపించిన ఓ డబ్బున్న పనిపాటా లేని అమ్మాయి మేఘన(మదాలస శర్మ) అతన్ని ఎలా గయినా ప్రేమ ముగ్గులోకి దింపుతానని ప్రతిజ్ఞ పూని రంగంలోకి దూకుతుంది. దాంతో ఇలాంటి అవాకాశం కోసం చూస్తున్నట్లు సంపత్ దానికీ బ్రేక్ వేసి ఆ అమ్మాయి ఇంటికెళ్ళి తల్లి తండ్రులను కలిసి మీ అమ్మాయి జాగ్రత్త అని చెప్పేసి..కన్నవాళ్ళ ప్రేమ చాలా గొప్పది అని పనిలో పనిగా క్లాస్ పీకేసి బయిటపడతాడు. ఏమిటీ ఇతగాడికి మెంటలా..వయిస్సులో ఉండి ఇలాంటి విచిత్రమైన కబుర్లు చెబుతున్నాడేంటి అని ఆశ్చర్యపడే లోగా ఒక వ్యక్తిని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చంపేస్తాడు. అలాగే తన ప్రేమ రాయిబారం నడపటానికి మేఘన అన్నని అమెరికానుంచి ఆమె పిలిస్తే అతన్ని చంపేస్తాడు. ఎవరీ సంపత్..ఎందుకిలా చంపుతున్నాడు. చంపే సమయంలో అతనికి ఎందుకు గతం గుర్తు వస్తున్నట్లు పాజిటివ్ ఫిల్మ్ కనపడుతోంది. అన్న విచిత్రమైన సమాధానాలు స్వయంగా తెలుసుకోవాలంటే...తెరమీద చూడటమే ఉత్తమం. అప్పటి దాకా ఆగలేని వారికో క్లూ..హీరోకో ఎన్టీఆర్ రాఖీ లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.

    ఎక్కడా చిన్నమెత్తు కామెడీ అనేది లేకుండా..,ఇవివి తన స్వీయ బ్యానర్ పై తీసిన ఈ సినిమా ఏ కోణంలోను సంతృప్తి పరచదు. తన కొడుకుని యాక్షన్ హీరోగా చూపాలన్ని తపనతో ఫైట్స్ చేయించటానికి ఈ సినిమా తీసాడని చూసేవారికి అర్ధమవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో హీరో ప్రత్యేకంగా పగ తీర్చుకోవాలను కధ అని ఫిక్సయి తీయాలంటే పోలిక అని కాదు కాని గజనీ రేంజ్ స్టాండర్డ్ (ఫెరఫెక్ట్ స్క్రిప్టు ఉండాలి..అలాగే గజనీలో ఇంటర్నెల్ కాంప్లిక్ట్ జ్ఞాపక శక్తి తగ్గిపోవటం,విలన్ కి తెలిసి తప్పించుకోవాలని చూడటం ఉంటాయి) అంతేగాని వెళ్ళి సైలెంట్ గా చంపేసి తన పని చూసుకుంటున్నాడంటే అది సహనానికి పరీక్షే. పోనీ అలా పగ తీర్చుకునే ప్రాసెస్ లో అతను ఏదన్నా తెలుసుకుని పదిమందికి ఉపయోగపడేలా తయారయితే ఓ భారతీయుడు సినిమానో,రాఖీనో అయ్యేది. అలాంటిదేం లేకపోవటమే నధింగ్ మాస్టర్ గా మిగిల్చింది.

    ఇన నటీనటుల్లో నరేష్ ఎప్పటిలాగేనే బాగా చేద్దామనే ప్రయత్నం చేసాడు. కానీ మరి జిమ్ ట్రైనర్ అనీ అందరినీ పైట్స్ చేసి చిత్కక్కొట్టేస్తున్నాడంటే నమ్మశక్యం కాదు. అలాగే హీరోయిన్ గా మదాలసా శర్మ తన భారీ అందాలుతో తెరనిండా పరిచింది.రౌడీ అయిపోవాలనే జీవీతాశయం తో నరేష్ చేసే హత్యలను మీదేసుకునే పాత్రలో అలీ కనిపించినా నవ్వించలేకపోయాడు. అలాగే అలీ అనుచరులుగా జయ ప్రకాష్ రెడ్డి,చలపతిరావు ఈ మధ్య కాలంలో ఇలాంటి నీరసమైన పాత్రు చేసుండి ఉండరు. దర్శకుడుగా ఇవివి కమిట్ మెంట్ తో తీసినట్లుండదు.

    ఎందుకంటే చెప్పే విషయం అమ్మాయిలను...కొంత మంది ప్రేమ,పెళ్ళి అని మోసగించి,కెమెరాలలో బంధించి మార్కెటింగ్ చేసుకుంటున్నారని.. అయితే ఇవివి ఆ వంకతో చాలా ఎక్సపోజింగ్ చేయిస్తూండటం ఏది ఆశించి అనేది అర్ధమవుతుంది. నీతులు చెప్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి తగ్గట్లుగానే సినిమా తీయాలనేది ఓ సీనియర్ దర్శకుడుగా ఆయనకు తెలియంది కాదు. ఎక్కడో పొరబడ్డారు అనిపిస్తుంది. ఓ ఆమె,అప్పుల అప్పారావు,ఆ ఒక్కటీ అడక్కు,ఏవండి ఆవిడొచ్చింది,సీతారత్నంగారబ్బాయి వంటి సినిమాలు తీసిన దర్శకుడేనా ఈ సినిమా తీసిందని అనుమానం వస్తుంది. అలాగే ఎప్పుడూ ఇవివి సినిమాల విజయాలకు తోడుండే వేగెష్న సతీష్ కలం ఈ సారి సరైన మాటలు రాయలేక పోయింది.

    ఏదైమైనా ఈ మధ్య వరస విజయాలతో చిన్న చిత్రాల పెద్ద హీరోగా వెలుగుతున్న నరేష్ కి తండ్రే విలన్లా తయారై పెళ్ళయింది కానీ,ఫిట్టింగ్ మాస్టర్ వంటి పెద్ద ఫ్లాప్ లివ్వటం దారుణం. ఇక ఇప్పటికీ ఈ సినిమాకి వెళ్ళాలనిపిస్తే..బయిలుదేరటమే మేలు. ఎందుకంటే మౌత్ టాక్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా ఎక్కువ కాలం నిలబడేటట్లు కనపడటం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X