Funky Movie Review: ఫంకీ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.0/5

ఫంకీ (Funky)
నటీనటులు: విశ్వక్ సేన్, కాయదు లోహర్, వీకే నరేష్, ఈశ్వరీరావు, సంపత్ రాజ్, దిల్ రాజు, హరీష్ శంకర్, అనుదీప్ కేవీ, కల్యాణ్ శంకర్ (స్పెషల్ అప్పీయరెన్స్) తదితరుల
దర్శకత్వం: అనుదీప్ కేవీ
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సినిమాటోగ్రఫి: సురేష్ సారంగమ్ ,
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్,
ఎడిటర్‌: నవీన్ నూలీ గా,
ఆర్ట్ డైరెక్టర్‌: జానీ షేక్
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
రిలీజ్ డేట్: 2026-02-13

Funky Movie Review and Rating in Telugu  Vishwak Sen  Anudeep failed to impress

కోమల్ (విశ్వక్ సేన్) తొలిసారి దర్శకత్వం చేపట్టి ఫంకీ అనే సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ముందు అనుకొన్న బడ్జెట్ కంటే భారీగా బడ్జెట్ పెరిగిపోవడంతో సుదర్శన్ (వీకే నరేష్)కు ఆరోగ్యం క్షీణిస్తుంది. దాంతో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి కోమల్‌ను తప్పించి.. మూవీని పూర్తి చేయాలని చిత్ర (కాయదు లోహర్) రంగంలోకి దిగుతుంది.

ఫంకీ బడ్జెట్ పెరిగిపోవడానికి కారణం ఏమిటి? నిర్మాత సుదర్శన్‌కు ఆరోగ్యం క్షీణించిన తర్వాత దర్శకుడు కోమల్ పరిస్థితి ఏమిటి? కోమల్‌ను తప్పించి నిర్మాతగా చిత్ర రంగ ప్రవేశం చేసిన తర్వాత ఏం జరిగింది? కోమల్‌తో చిత్ర ఎలా ప్రేమలో పడింది? ఫంకీ సినిమాను తక్కువ బడ్జెట్‌తో పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని కోమల్ నిలుపుకొన్నాడా? ఫంకీ సినిమాను చిత్ర, కోమల్ ఎలా పూర్తి చేశాడు? ఫంకీ సినిమా పూర్తి కావడానికి చిత్ర, కోమల్ పడిన తంటాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

జాతి రత్నాల తర్వాత అనుదీప్ కామెడీకి ఫ్యాన్స్ ఏర్పడటంతో అదే తరహాలో మూసతో సినిమాలు రావడం జరుగుతూనే ఉంది. కథ లేకుండా కేవలం సింగిల్ లైనర్స్‌తో పంచ్ డైలాగ్స్ పేలితే సినిమాలు హిట్టవుతాయనే అసలు విషయాన్ని అనుదీప్ గ్రహించలేదనే ఫంకీ చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. డైలాగ్స్ కోసం సన్నివేశాలు రాశారా? సన్నివేశాలను పేర్చి కథ చెప్పాలనుకొన్నారా? ఇలాంటి గలీజ్ కాన్సెప్ట్‌ను, హీరోగా విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ ఎలా ఓకే చేశారనే అనే ప్రశ్నల, సందేహాలు, అనుమానాలు ఫంకీ చూస్తున్నంత సేపు వెంటాడుతూనే ఉంటాయి. సింగిల్ పాయింట్‌లో ఎలాంటి వేరియేషన్స్ లేకుండా సినిమా చివరి సన్నివేశం వరకు లాగి లాగి విసుగు పుట్టించే ప్రయత్నమే కనిపించింది. కానీ ఎక్కడా ఈ సినిమా ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగిస్తుందనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. స్క్రీన్ మీద సీన్లు వస్తుంటాయి. పోతుంటాయి కానీ.. సినిమా మేకింగ్‌లో ఉండే ఓ పర్సస్ ఎంత వెతికినా కనిపించదు. కేవలం అక్కడక్కడ పంచ్ డైలాగ్స్ పేలాయి. చాలా వరకు బలవంతంగా డైలాగ్స్ సన్నివేశాల్లో ఇరికించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ తరహా సిల్లీ కామెడీకి అనుదీప్ కేవీ వదులుకొంటే బాగుంటుందనేది సలహా మాత్రమే.

ఇక వరుసగా ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న విశ్వక్ సేన్ ఈ సినిమాను ఒప్పుకోవడం వెనుక పాజిటివ్ అంశాలు ఏమిటో అర్ధం కాదు. ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేని పాత్రలో కనిపించాడు. తనకు ఉన్న టాలెంట్, సినిమాపై ఉన్న పట్టు చూస్తే ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడనే అభిప్రాయం కలుగుతుంది. కానీ కొన్ని సన్నివేశాల్లో ఆయన ఈజ్‌తో నటించిన తీరు, అలాగే సిస్టర్ సెంటిమెంట్ సాగే సన్నివేశాల్లో నటుడిగా తాను ఏమిటో మరోసారి చెప్పాడు. ఇక ఈ సినిమా చూడటానికి ఒకే ఒక కారణంగా కాయదు లోహర్ కనిపించింది. గ్లామర్ పరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకొన్నారు. మంచి కథలు, పాత్రలు ఎంచుకొంటే లాంగ్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉందనే ఫీలింగ్ కలిగింది. వీకే నరేష్ తన మార్క్ కామెడీతో ఆకట్టుకొన్నారు. ఇక దిల్ రాజు, హరీష్ శంకర్, కల్యాణ్ శంకర్, అనుదీప్ ప్రత్యేక పాత్రల్లో కనిపించి జోష్ కలిగిస్తారు. ఈశ్వరీ రావు తదితరులు ఫర్వాలేదనిపించారు

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. భీమ్ సిసిరోలియో స్థాయికి మ్యూజిక్ లేదు. వరుసగా మ్యూజిక్‌తో సంచలనాలు క్రియేట్ చేస్తున్న భీమ్స్.. ఈ సినిమా విషయంలో తన మార్కు చూపించుకోలేకపోయారు. రెండు పాటలు మినహా పెద్దగా ఆకట్టుకొనే అంశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్కువుట్ కాలేదనే చెప్పాలి. ఇక నవీన్ నూలీ ఈ సినిమా విషయంలో పూర్తిగా ట్రాక్ తప్పాడనిపిస్తుంది. ఈ సినిమా అతుకుల బొంతలా ఉందనే విధంగా ఎడిటింగ్ విభాగం పనితీరు ఉంది. సినిమాటోగ్రఫీ విషయంలో సురేష్ సారంగం పూర్తిగా మార్కులు కొట్టేశారు. నాగవంశీ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ ఎప్పటిలానే హై క్లాస్‌లో ఉన్నాయి. కానీ కథ, కథనాలే గాలికి వదిలేశారా? అనేది సినిమా చూసిన తర్వాత హాట్ టాపిక్‌గా మారింది.

ఫంకీ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. మంచి కంటే చెడు విషయాలే డామినేట్ చేశాయి. కేవలం వన్ లైనర్స్ డైలాగ్స్‌తో హిట్టు కొట్టాలనే విషయం పెద్ద సాహసమే అని చెప్పాలి. సినిమా మేకింగ్ గురించి చాలా నీతులు చెప్పిన యూనిట్.. ఫంకీ మూవీ విషయంలో అదే తప్పు చేశారు. ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. కానీ అన్నీ చెబితే చాలా గలీజ్‌గా ఉంటుంది. మీకు ఓపికగా ఉంటే.. ఫంకీ సినిమాను చూసే సాహసం చేయొచ్చు.

More from Filmibeat

Read more about: Funky vishwak sen kayadu lohar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X