Funky Twitter Review: ఫంకీ మూవీ ట్విట్టర్ రివ్యూ

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఫంకీ (Funky). మాస్ కా దాస్ విశ్వక్ సేన్, గ్లామర్ క్వీన్ కాయదు లోహర్ జంటగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు.

ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు సురీష్ సారంగమ్ సినిమాటోగ్రఫి, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, నవీన్ నూలీ ఎడిటర్‌గా, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సమర్పించిన ఈ చిత్రం వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్లను ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ల గురించి నెటిజన్స్ అందించిన టాక్ ఏమిటి? క్రిటిక్స్ రివ్యూ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

Funky Twitter Review in Telugu

ఫంకీ మూవీ ప్రీమియర్లను భారీగా నార్త్ అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ సినిమా మొదటి ప్రీమియర్ అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు మొదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన కనిపిస్తున్నది.

ఫంకీ చిత్రం ఫుల్ ఆన్ ఫన్, ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫుల్ ఆన్ ఫంకీగా ఉంటుంది. దర్శకుడు అనుదీప్ ఎప్పడూ నిరాశపరచడు. విశ్వక్ సేన్ ఈ సారి హిట్ కొట్టడం ఖాయం నూటికి నూరు శాతం గ్యారెంటీ అని నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫంకీ మూవీ ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. ఎప్పటిలానే అనుదీప్ వన్ లైనర్ కామెడీ. కొన్ని జోక్స్ వర్కవుట్ అయ్యాయి. చాలా వరకు జోక్స్ ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సిల్లీగా ఉన్నాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉండటంతో కామెడీ సీన్లు ఆర్గానిక్ ఫ్లో మిస్ అయ్యాయి అని క్రిటిక్ వెంకీ తన రివ్యూలో పేర్కొన్నాడు.

ఫంకీ ఫస్టాఫ్ బిలో యావరేజ్‌గా ఉంది. అనుదీప్ వన్ లైనర్స్ సినిమా మొత్తం నాన్ స్టాప్‌గా సాగాయి. కొన్ని జోక్స్ బాగున్నాయి. మరికొన్ని బలవంతంగా నవ్వించేలా ఉన్నాయి. కథ విషయానికి వస్తే వీక. ఎడిటింగ్ ఓకే. డబ్బింగ్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయి. సెకండాఫ్ బాగుంటే.. ఈ సినిమాకు బలంగా మారుతుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫంకీ సినిమాలో జోక్స్ చాలా సిల్లీగా ఉన్నాయి. సినిమాలో కామెడీ సీన్ల తప్పా మరేమి లేదు. జబర్దస్త్ షో స్క్రిప్ట్‌ను మించి ఉంది. దానిని ఎక్స్‌టెంఢ్ చేస్తే ఎలా ఉంటుందో ఫంకీ అలా ఉంటుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫంకీ సినిమా ఫస్టాఫ్ అయిపోయింది. కాదు అనుదీప్, విశ్వక్ సేన్ భయ్యా మీరు ఎడిటింగ్ చేసిన తర్వాత సినిమా చూసుకొన్నారా? మంచి కామెడీ వన్ లైనర్స్ కూడా ఆగం అవుతున్నాయి. ఒక స్ట్రక్చర్ లేదు. ఎడిటింగ్ పూర్‌గా ఉంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: Funky kayadu lohar anudeep kv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X