twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Gaalivaana Web Series Review : రాధిక, సాయి కుమార్ లు నటించిన థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?

    |

    ఓటీటీ: జీ5
    రేటింగ్: 2.5/5
    నటీనటులు: రాధిక శరత్ కుమార్, సాయి కుమార్, నందినీ రాయ్, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, ఆశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్, శరణ్య తదితరులు
    దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
    నిర్మాత: శరత్ మరార్
    సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ
    సంగీతం: హరి గౌర

    సీనియర్‌ నటుడు సాయి కుమార్‌, రాధిక శరత్‌ కుమార్‌లు ప్రధాన పాత్రలలో నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ గాలివాన. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సిరీస్ కి అనేక భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించిన శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరించగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. బీబీసీతో కలిసి జీ5, నార్త్‌స్టార్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించాయి. టీజర్, ట్రైలర్ తో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..

     కథ:

    కథ:

    సరస్వతి (రాధిక శరత్ కుమార్) కు ఇద్దరు కుమారులు అజయ్, మార్తాండ్ ఒక కుమార్తె శ్రావణి(చాందిని చౌదరి. అయితే అజయ్, కొమర్రాజు (సాయి కుమార్) కుమార్తె గీత ప్రేమించుకుంటారు. కుమార్తెకు మరొకరితో పెళ్లి నిశ్చయం చేసిన కొమర్రాజు... విషయం తెలిసి తప్పనిసరి పరిస్థితుల్లో అజ‌య్‌కు ఇచ్చి పెళ్లి చేస్తాడు. నూతన దంపతులు వైజాగ్ లో హనీమూన్ లో ఉన్న సమయంలో ఒక యువకుడు హత్య చేస్తాడు. ఆ తర్వాత కారులో పారిపోతూ ఎక్కడో వైజాగ్ నుంచి గోదావరి జిల్లాలోని కొమర్రాజు లంకలో ఉన్న సరస్వతి ఇంటి ముందుకు వచ్చాక గాలివాన కారణంగా యాక్సిడెంట్ కు గురవుతాడు. గాయాలతో ఉన్న యువకుడిని మార్తాండ్ కాపాడతాడు. చికిత్స అందించడానికి సిద్ధమవుతున్న క్రమంలో తమ వాళ్ళని చంపింది అతనేనని తెలుస్తుంది. అతన్ని ఒక షెడ్ లో ఉంచగా తెల్లారేసరికి హత్య చేయబడ్డాడు. అయితే అతనిని చంపింది ఎవరు? నూతన దంపతులను అతడు ఎందుకు హత్య చేశాడు? రెండు హత్యలకు మర్డర్ చేసిన వాడి హత్యకు ఏమైనా సంబంధం ఉందా? లేదా? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

    గాలివాన ట్విస్టులు

    గాలివాన ట్విస్టులు


    ఈ సిరీస్ లో మొత్తం ఎపిసోడ్స్ ఉన్నాయి. సిరీస్ లోని మొదటి ఎపిసోడ్ ప్రారంభమైన కాసేపటికే దంపతుల మర్డర్ తో కథలోకి తీసుకు వెళ్ళాడు దర్శకుడు. అసలు వాళ్ళిద్దరినీ చంపింది ఒక దొంగ అనుకుని కేసుని లైట్ గా తీసుకుందాం అనుకున్న పోలీసులకు సరస్వతి, కొమర్రాజు కుటుంబీకుల వింత ప్రవర్తన అనుమానం తెప్పిస్తుంది. దానికి తోడు కొమర్రాజు కొడుకు చేసిన ఒక పనికి కుటుంబం అంతా ఇరకాటంలో పడుతుంది. అయితే వారి వివాహం చేయడానికి కొమర్రాజు తొలుత నిరాకరించడంతో అతనేనని అనుమానం కలిగినా చివరికి ఎవరు? ఎందుకు? ఎవరిని చంపారు అనే విషయాన్ని రివీల్ చేశాడు దర్శకుడు

    దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే

    దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే


    ఇది బీబీసీ మినీ సిరీస్ 'వన్ ఆఫ్ అజ్'కు అఫీషియల్ అడాప్షన్ అని ముందే వెల్లడించారు. అయితే విదేశాల్లో జరిగిన కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చుకునేప్పుడు మనవాళ్ళు దాన్ని ఒప్పుకునేవిధముగా మార్చడం చాలా అవసరం. అయితే దాన్ని అలా మార్చడంలో శరణ్ కొప్పిశెట్టి సక్సెస్ అయ్యాడు. అయితే మొదటి ఎపిసోడ్ మిగతా ఎపిసోడ్స్ మీద ఆసక్తి కలిగించింది కానీ ఆ తర్వాత మూడు ఎపిసోడ్స్ ఆశించిన రీతిలో సాగలేదనే చెప్పాలి. ఎందుకంటే క్యారెక్టర్స్‌ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేక పోయారని చెప్పచ్చు. దానికి కారణం జనాన్ని ఎక్కువగా మోహరించారు కానీ వారి మధ్య ఎమోషన్స్ ను బిల్డ్ చేయలేకపోయారు. అయితే మిగతా అన్ని విషయాలు శరణ్ కొప్పిశెట్టి బాగా మేనేజ్ చేయగలిగారు.

    కనెక్టివిటీ మిస్సింగ్:

    కనెక్టివిటీ మిస్సింగ్:


    తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఎడాప్షన్ బాగుంది కానీ క్యారెక్టర్స్‌ మధ్య కనెక్టివిటీ మిస్సయింది. చాలా పాత్రలను చూపారు కానీ ఆ పాత్రలు ఎలా కనెక్ట్ అయ్యాయి అనేది చూపడంలో విఫలం అయ్యారు. సర్వసతి కుమారుడు మార్తాండ్భర్త నుంచి విడాకులు తీసుకుని, కుమార్తె కస్టడీ కోసం పోరాడుతున్న మహిళతో ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది చూపలేదు. నందిని రాయ్ కుటుంబం కోసం పోలీసుగా ఉంటూనే డ్రగ్స్ అమ్మినట్టు చూపారు అది పాప కోసం అనిపించారు కానీ ఆమె భర్త ఏడి అంటే ఎవరం చెప్పలేం.. ఇలా కొన్ని పాత్రల కనెక్టివిటీ కుదిరి ఉంటే బాగుండేది.

     నటీనటుల విషయానికి వస్తే

    నటీనటుల విషయానికి వస్తే


    ఆయుర్వేద వైద్యులు కొమర్రాజుగా సాయి కుమార్, ముగ్గురు పిల్లలను పెంచిన ఒంటరి తల్లి సరసబాటి గా రాధికా శరత్ కుమార్‌ను ఎంపిక చేయడం సిరీస్ కు ప్లస్ అయ్యింది. ఒకరకంగా వారు నటించకుండా జీవించారు. సాయికుమార్ భార్యగా ఆశ్రిత వేముగంటి, రాధికా పిల్లలుగా చైతన్య కృష్ణ, చాందిని చౌదరి అందరూ ఆయా పాత్రలు సరిపోయారు. పోలీస్ అధికారిణిగా నందిని రాయ్, సరస్వతి కోడలిగా శరణ్య... ప్రతి ఒక్కరూ పాత్రకు తగ్గట్లు నటించారు. 'తాగుబోతు'గా కాకుండా పోలీస్‌ కానిస్టేబుల్గా రమేష్ నటన బాగుంది. మిగతా వాళ్ళు కొత్త ముఖాలే కానీ తమ పరిధి మేర నటించారు.

     టెక్నికల్ గా

    టెక్నికల్ గా


    వెబ్ సిరీస్ నిర్మాణ విలువలు అత్యద్భుతమైన విజువల్స్‌తో అత్యుత్తమంగా ఉన్నాయి. దర్శకుడు అత్యంత సత్తా ఉన్న నటీనటులను ఎంపిక చేయడమే కాకుండా ఆసక్తికరమైన కథాంశాన్ని కూడా ఎంచుకుని, దాన్ని చక్కగా తెరకెక్కించాడు. ముఖ్యంగా కొన్ని చోట్ల ఎమోషనల్ డ్రామా సన్నివేశాలు బాగా కుదిరాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిరీస్ కు తగినట్టు కుదిరింది. ఇక ఎడిటింగ్ కూడా చక్కగా కుదిరింది.

     ఫైనల్ గా

    ఫైనల్ గా

    కొన్ని చిన్న చిన్న మైనస్ పాయింట్స్ పక్కన పెడితే ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఇంట్రెస్టింగ్‌గా క్లీన్ అండ్ హెల్తీ థ్రిల్లర్ గాలివాన వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఎంజాయ్ చేసే విధంగా రూపొందించడంలో నిర్మాత శరత్ మరార్ సక్సెస్ అయ్యాడు.

    English summary
    Radikaa Sarathkumar, Sai Kumar starrer Gaalivaana Web Series is streaming in zee 5 app. here is the exclusive review of the web series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X