GaayaPadda Simham Movie Review: గాయపడ్డ సింహం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరీ, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓఐ, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు
సమర్పణ: పవన్ సాదినేని
డైరెక్టర్: కశ్యప్ శ్రీనివాస్
నిర్మాతలు: కల్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ భన్సాల్
సినిమాటోగ్రఫి: విద్యా సాగర్ చింతా,
ఎడిటర్: విప్లవ్ నైషాడం,
మ్యూజిక్: స్వీకార్ అగస్తి,
కథ: సూర్య ప్రకాశ్ జోస్యుల,
ప్రొడక్షన్ డిజైన్: చంద్రికా గొర్రెపాటి
రిలీజ్ డేట్: 2026-05-01

మధ్య తరగతి కుటుంబానికి చెందిన దరహాస్ (తరుణ్ భాస్కర్) సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి (మానస చౌదరీ)తో ప్రేమలో పడుతాడు. అయితే కనీసం అమెరికాలో స్థిరపడితే తప్ప తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయలేనని తన ప్రియురాలి తండ్రి కండీషన్ పెడుతాడు. దాంతో ఓ ప్రయత్నం చేసి అమెరికాలో అడుగుపెడుతాడు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల దరహాస్‌ను అక్కడి నుంచి తిప్పి పంపిస్తారు. దాంతో లవ్ బ్రేకప్ అవుతుంది. తన లవ్ బ్రేకప్‌కు కారణమైన ట్రంప్‌పై పగ తీర్చుకోవాలని అనుకొంటాడు. ఈ క్రమంలో క్షుద్ర విద్య తెలిసిన భైరవ దాస్ (శ్రీవిష్ణు)తో ట్రంప్‌పై చేతబడి చేయించాలని అనుకొంటాడు. ఈ వ్యవహారంలో సత్య లాజిస్టిక్ ఓనర్ బ్రూటల్ ధర్మ (జేడీ చక్రవర్తి) వర్గం జోక్యం చేసుకోని దరహాస్‌ను వెంటాడుతుంటారు.

GaayaPadda Simham Movie Review

దరహాస్ ఎలాంటి ప్రయత్నాల ద్వారా అమెరికాకు వెళ్లాడు? అమెరికాకు వెళ్లిన దరహాస్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎందుకు ఇండియాకు బలవంతంగా తిప్పి పంపించారు? అమెరికాలో ఉండే ట్రంప్‌పై ఎలా పగ తీర్చుకోవాలని అనుకొన్నాడు? యూఎస్‌లో ఉండే ట్రంప్‌పై భైరవ దాస్‌తో ఎలా చేతబడి చేయించాలని అనుకొన్నాడు? ఐపీఎస్ పాసైన భైరవదాస్ క్షుద్ర విద్యలను ఎందుకు నేర్చుకొన్నాడు? ట్రంప్‌పై భైరవదాస్ చేసిన చేతబడి వర్కవుట్ అయిందా? దరహాస్‌ను సత్య లాజిస్టిక్ ఓనర్ బ్రూటల్ ధర్మ మనుషులు ఎందుకు వెంటాడారు? బ్రేకప్ తర్వాత శాలిని (ఫరియా అబ్దుల్లా)తో జరిగిన పెళ్లి చూపులు సఫలమయ్యాయా? అనే ప్రశ్నలకు సమాధానమే గాయపడ్డ సింహం సినిమా కథ.

శాలినితో దరహాస్ పెళ్లి చూపుల ఎపిసోడ్‌తో కథను ఆసక్తికరంగా ప్రారంభించినప్పటికీ.. కథనంలో వేగం లేకపోవడంతో కాస్త నెమ్మదిగా కథలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే బ్రూటల్ ధర్మ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందో అప్పటి నుంచి కథలో వేగంగా కదలికలు చోటు చేసుకొని రకరకాల ట్విస్టులతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసిన తీరు బాగుంటుంది. ఇక భైరవ దాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా స్వరూపమే మారిపోతుంది. సెకండాఫ్‌లో ట్రంప్‌పై చేతబడి అంశాలు, అలాగే బ్రూటల్ ధర్మ వర్గం కార్యకలాపాలు సినిమాను సరైన ట్రాక్‌లో పెట్టేలా చేశాయని చెప్పొచ్చు. ఇక కథలో భాగంగా క్లైమాక్స్‌ను ముగించిన తీరు ఫీల్ గుడ్‌గా ఉంటుంది.

అలాగే పార్ట్ 2 సినిమాకు పోరాట సింహం అంటూ శ్రీవిష్ణు క్యారెక్టర్‌కు ఇచ్చిన లీడ్ ఇంకా బాగుంది. ఓవరాల్‌గా చిన్న పాయింట్‌ను లాగి లాగి కథను నడిపించినా.. ఎక్కడా బోర్ లేకుండా క్యారెక్టర్లను బాగా డిజైన్ చేయడం ఈ సినిమాకు బ్యూటీగా అనిపిస్తుంది. పంచ్ డైలాగ్స్, పోకిరి, పెళ్లి చూపులు, సలార్, అర్జున్ రెడ్డి సినిమాల రెఫరెన్సులు, స్పూఫులు బాగా వర్కవుట్ అయ్యాయి. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కంటెంట్ మీద పెట్టిన శ్రద్ద ప్రతీ ఫ్రేమ్‌లోను కనిపిస్తుంంది. స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ఎంగేజ్‌మెంట్ ఎలిమెంట్‌గా మారింది.

మిడిల్ క్లాస్ అబ్బాయిగా, భగ్న ప్రేమికుడిగా తరుణ్ భాస్కర్ తన క్యారెక్టర్‌లో ఫ్రెష్‌గా కనిపించారు. రకరకాల ఎమోషన్స్‌ను బాగా పెర్ఫార్మ్ చేశాడు. చాలా రోజుల తర్వాత బ్రూటల్ ధర్మగా జేడీ చక్రవర్తి తన మార్కు యాక్టింగ్‌ను చూపించాడు. జేడీ చాలా కొత్తగా తెరపైన కనిపించాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, హావభావాలు చక్కగా కుదిరాయి. ఇక ఈ సినిమాకు బ్యాక్ బోన్ శ్రీ విష్ణు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే తపనతో ఉంటే వ్యక్తిగా, క్షుద్ర విద్యలు చేసే మాంత్రికుడిగా చాలా డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించాడు. సెకండాఫ్‌లోను, క్లైమాక్స్‌లో శ్రీ విష్ణు సినిమాను నడిపించిన తీరు ప్లస్ పాయింట్‌గా మారింది. శుభలేఖ సుధాకర్, ఫరియా అబ్దుల్లా సినిమాకు బలంగా మారారు. కశ్యప్ శ్రీనివాస్ యాక్టర్‌గా కూడా ఆకట్టుకొన్నాడు

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్ ఈ మూవీకి పెద్ద అసెట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను బలంగా, ఫీల్ గుడ్‌గా మార్చడంలో స్వీకార్ అగస్తీ తన ప్రతిభను బ్రహ్మండంగా చాటుకొన్నాడు. ఈ సినిమాకు విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫి స్టోరీ మూడ్‌ను, క్యారెక్టర్ల ఇంపాక్ట్‌ను బాగా క్రియేట్ చేసింది. విప్లవ్ నైషాడం ఎడిటింగ్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా చేసింది. కల్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ భన్సాల్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ వారం చూడాల్సిన సినిమాల జాబితాలో గాయపడ్డ సింహాం సినిమాను చేర్చుకోవచ్చు. వినోదంతోపాటు యాక్టర్ల పెర్ఫార్మెన్స్‌ను బాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X