GaayaPadda Simham First Review: గాయపడ్డ సింహం మూవీ ఫస్ట్ రివ్యూ
టాలీవుడ్ యువ దర్శకుడు పవన్ సాదినేని సమర్పణలో యంగ్ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గాయపడ్డ సింహం. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరీ, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓఐ, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కామెడీ, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని కల్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ భన్సాల్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: విద్యా సాగర్ చింతా, ఎడిటర్: విప్లవ్ నైషాడం, మ్యూజిక్: స్వీకార్ అగస్తి, కథ: సూర్య ప్రకాశ్ జోస్యుల, ప్రొడక్షన్ డిజైన్: చంద్రికా గొర్రెపాటి తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఫన్ ఎలిమెంట్స్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై వస్తున్న ఫీడ్ బ్యాక్, సెన్సార్ రిపోర్ట్, రన్ టైమ్ వివరాల్లోకి వెళితే..

దరహాస్ (తరుణ్ భాస్కర్) తన ప్రేమను, ప్రేయసిని దక్కించుకొనేందుకు అమెరికా వెళ్తాడు. అయితే లవ్ బ్రేకప్ అయి బలవంతంగా ఇండియాకు అమెరికా నుంచి పంపించవేయబడుతాడు. అయితే ఇండియాకు తిరిగి వచ్చిన దరహాస్‌ను స్థానికంగా పోలీసులు, సత్య గ్రూప్ వెంటాడుతారు. వారి నుంచి తప్పించుకోవడానికి క్యాట్ మౌస్ గేమ్ మొదలవుతుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ తన జీవన్మరణ పోరాటం చేస్తాడు. దరహాస్ లవ్ బ్రేకప్ ఎందుకైంది? బలవంతంగా ఇండియాకు ఎందుకు పంపించబడ్డాడు? స్థానికంగా పోలీసులు, సత్య గ్యాంగ్ ఎందుకు వెంటాడారు? ఈ పరిస్థితుల నుంచి దరహాస్ ఎలా బయటపడ్డాడు? చివరకు తన ప్రేమను గెలుచుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవాసీయులకు అక్కడ నెలకొన్న ప్రతికూల పరిస్థితులపై సెటైరికల్‌గా రాసుకొన్న పాయింట్. దర్శకుడు డిజైన్ చేసిన పాత్రలు, సన్నివేశాలు క్రేజీగా ఉన్నాయనే విషయం ప్రోమోలతో స్పష్టమైంది. సెన్సార్ రివ్యూ తర్వాత ఈ సినిమా గురించి పూర్తిగా పాజిటివ్ టాక్ వినిపిస్తున్నది. తరుణ్ భాస్కర్, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు మధ్య కామెడీ సన్నివేశాలు ఆకట్టుకొంటాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ ప్రతినిధుల నుంచి మంచి స్పందన వచ్చిందనే విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది.
గాయపడ్డ సింహం సినిమాకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్ని డైలాగ్స్, సన్నివేశాల్లో మార్పులు మినహా ఈ సినిమాకు పెద్దగా కట్స్ లేకుండా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ సూచించిన ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేసి.. కొన్నింటికి చిత్ర యూనిట్ వివరణ ఇచ్చారు. దాంతో సంతృప్తి చెందిన సెన్సార్ అధికారులు ఈ చిత్రానికి యూఏ (U/A 16+) సర్టిఫికెట్ ఇచ్చారు.
ఆద్యంతం వినోద భరితంగా, సెటైరికల్ కామెడీతో సాగే ఈ చిత్రాన్ని ఎక్కువగా సాగదీయకుండా ఫిలిం యూనిట్ జాగ్రత్తలు తీసుకొన్నది. ఎడిటింగ్ పరంగా క్రిస్పీగా కట్ చేశారు. దాంతో ఈ చిత్రం నిడివి సుమారుగా 2 గంటల 20 నిమిషాలు అంటే.. 140 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. సెన్సార్ రిపోర్టు ఆధారంగా ఈ చిత్ర విజయంపై దర్శకుడు కశ్యప్, నటీనటుల్లో తరుణ్ భాస్కర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, బాక్సాఫీస్ స్టోరీల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవుతూనే ఉండండి..


Click it and Unblock the Notifications


