GaayaPadda Simham Twitter Review: గాయపడ్డ సింహం ట్విట్టర్ రివ్యూ..

GaayaPadda Simham Twitter Review: టాలీవుడ్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా గాయపడ్డ సింహం (GaayaPadda Simham). ఈ సినిమాను దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించగా, పవన్ సాదినేని సమర్పిస్తున్నారు. కామెడీ-థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరీ, విష్ణు ఓఐ, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. అదనంగా జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు కీలక పాత్రలతో సినిమాకు మరింత బలం చేకూర్చారు. కామెడీ, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని కల్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ భన్సాల్ సంయుక్తంగా నిర్మించారు.

ఇక టెక్నికల్‌గా విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీని విద్యాసాగర్ చింతా అందించగా, ఎడిటింగ్ బాధ్యతలను విప్లవ్ నైషాదం నిర్వహించారు. సంగీతాన్ని స్వీకార్ అగస్తి సమకూర్చగా, కథను సూర్య ప్రకాశ్ జోస్యుల అందించారు. ప్రొడక్షన్ డిజైన్‌ను చంద్రికా గొర్రెపాటి చూసుకున్నారు. ఫన్, థ్రిల్, యూత్‌ఫుల్ ఎలిమెంట్స్ మేళవింపుగా రూపొందించారు. కామెడీ టైమింగ్, థ్రిల్లింగ్ ట్విస్ట్‌లతో తెరకెక్కిన ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది. ఈ నేపథ్యంలో సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన ట్వీట్లు, వారి అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

GaayaPadda Simham Twitter Review in telugu   tarun bhaskers Youthful Comedy Thriller movie Positive Buzz

గాయపడ్డ సింహం చూసిన ఓ ప్రేక్షకుడు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ "ఈ సినిమా చాలా ఫ్రెష్‌గా, ఎంటర్టైనింగ్‌గా ఉంది. కామెడీ చాలా నేచురల్‌గా ఉంది, ఎక్కడా ఫోర్స్ చేసిన ఫీలింగ్ లేదు. కథ కూడా బాగుంది. ముఖ్యమైన సన్నివేశాల్లో BGM మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. మొత్తానికి ఇది తప్పకుండా చూడదగ్గ సినిమా" అని ట్వీట్ చేశారు.

మరో ప్రేక్షకుడు ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. "ఈ సినిమాలో శ్రీవిష్ణు ఎంట్రీతో 30 నిమిషాలు నాన్‌స్టాప్ ఫన్ వచ్చింది. సెకండ్ హాఫ్‌లో స్పూఫ్స్ బాగా వర్క్ అయ్యాయి. మొత్తంగా సినిమాలో కంటిన్యూస్‌గా ఫన్ బ్లాక్స్ ఉండి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ పక్కా ఎంటర్టైనర్" అని ట్వీట్ చేశారు.

మరో ప్రేక్షకుడు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. "ఈ సినిమా మంచి ఎంటర్టైనర్‌గా అనిపించింది. కామెడీ ఎక్కువగా ఉండి, చాలా వరకు బాగా వర్క్ అయింది. తరుణ్ భాస్కర్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత జేడీ చక్రవర్తి స్క్రీన్‌పై కనిపించడం ప్లస్ అయింది. వన్‌లైనర్స్, కామెడీ ట్రాక్స్ బాగా పనిచేశాయి. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు థియేటర్స్‌లో బాగా క్లిక్ అవుతాయి. మ్యూజిక్ డీసెంట్‌గా ఉంది. శ్రీవిష్ణు తన ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఈ వీకెండ్‌కు బెస్ట్ మూవీ.. మస్ట్ వాచ్" అని ట్వీట్ చేశారు.

మరో అభిమాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.."శ్రీవిష్ణు ఈ సినిమాతో బిగ్ ఎంటర్టైనర్ ఇచ్చాడు. రైటింగ్ చాలా మాస్‌గా, కామెడీ అదిరిపోయింది. స్పూఫ్స్‌కి థియేటర్ మొత్తం కేకలతో మార్మోగింది. ఈ సమ్మర్‌లో బెస్ట్ ఎంటర్టైనర్లలో ఒకటి... తప్పకుండా థియేటర్‌లో చూడాల్సిందే" అని ట్వీట్ చేశారు.

మరో సినీ అభిమాని ఈ సినిమాపై స్పందిస్తూ.. "ఈ సినిమా ఫుల్‌గా ఎంటర్టైన్ చేసింది. శ్రీవిష్ణు మూవీని ఈజీగా క్యారీ చేశాడు. సెకండ్ హాఫ్‌లో స్పూఫ్స్ బాగా వర్క్ అయ్యాయి. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు నాన్‌స్టాప్ నవ్వులు పడ్డాయి" అని ట్వీట్ చేశారు.

ఈ సినిమా చూసిన మరో ప్రేక్షకుడు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ఫస్ట్ హాఫ్ నుంచి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందని పేర్కొన్నారు. సినిమాలో కామెడీ బాగా వర్క్ అయ్యిందని, మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పారు. అలాగే తరుణ్ భాస్కర్ టైమింగ్ సూపర్‌గా ఉందని ప్రశంసించారు. ఇక జేడీ చక్రవర్తి ఎంట్రీ విన్టేజ్ వైబ్‌తో స్పెషల్‌గా అనిపించిందని, ట్రంప్‌పై చేసిన చెతబడి సీన్ హిలేరియస్‌గా ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.మొత్తంగా ఫస్ట్ హాఫ్ స్మూత్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా సాగిందని ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మరోకరు తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిందని తెలిపారు. తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని, థియేటర్‌లో నవ్వులు పండించిందని చెప్పారు. అలాగే జేడీ చక్రవర్తి ఎంట్రీకి థియేటర్ మొత్తం ఒక్కసారిగా అరుస్తూ, విన్టేజ్ వైబ్‌ను ఫీల్ అయ్యారని పేర్కొన్నారు. ఇక శ్రీ విష్ణు ఎంట్రీ తన పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిందని, అతని ప్రెజెన్స్ కూడా ఆకట్టుకుందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X