twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Galla Ashok's Hero Review: మహేష్ బాబు మేనల్లుడు హిట్ కొట్టాదా.?

    |

    రేటింగ్: 2.5/5
    నటీనటులు : అశోక్ గల్లా, నిధి అగర్వాల్, సత్య, జగపతి బాబు, నరేష్, అజయ్, రవి కిషన్, కోటా శ్రీనివాసరావు
    నిర్మాత : పద్మావతి గల్లా
    దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
    సంగీతం : జిబ్రాన్
    బ్యానర్ : అమర రాజా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్

    సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 'హీరో' మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న క్రమంలో సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాలో అశోక్ కి జంటగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మకర సంక్రాంతి సందర్భంగా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ సహా ప్రమోషన్ కంటెంట్ తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సరిగ్గా అదే తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగి సినిమా తాను చూశానని, చాలా బాగుందని మీరూ చూడండని చెప్పి అంచనాలను మరింత పెంచేశాడు. మ‌రి ఈ సినిమా ఎలా ఏంది, మహేష్ చెప్పినట్టు ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

    కథ

    కథ

    అర్జున్ (అశోక్ గల్లా) సినిమా హీరో కావాలనుకుని ప్రయత్నాలు చేస్తూ ఉండే నేటి తరం కుర్రాడు. తమ అపార్ట్మెంట్ లో వేరే ఫ్లాట్ లో దిగిన సుబ్బు-సుభద్ర(నిధి)తో అర్జున్ ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమాయాణం సాఫీగా జరుగుతూ ఉన్న సమయంలోనే నిధి అగర్వాల్ తండ్రి జగపతిబాబు వచ్చే రావడంతోనే అర్జున్ ఆయనతో గొడవ పెట్టుకుంటాడు. ఆ తరువాత హీరో అవ్వాల్సిన అర్జున్ అనుకోకుండా ఒక క్రైమ్ లో చిక్కుకుంటాడు. మరి ఆ క్రైమ్ నుంచి అర్జున్ ఎలా తప్పించుకున్నాడు? సుబ్బు ప్రేమను అర్జున్ దక్కించుకున్నాడా? అనేదే సినిమా కధ.

    'హీరో'లో ట్విస్టులు

    'హీరో'లో ట్విస్టులు

    చాలా సరదాగా సినిమాని మొదలు పెట్టిన దర్శకుడు ఆ తర్వాత సినిమాలో అనేక రకమైన ట్విస్టులు చూపించారు. అర్జున్ పేరుతో ఉన్న ఇద్దరి కొరియర్లు మారిపోవడం, ఆ కొరియర్ మారిపోవడం వల్ల అర్జున్ జీవితంలో జరిగిన పరిణామాలను చాలా ఆసక్తి కరంగా చూపించారు. తుపాకీ కొరియర్ ద్వారా అందుకున్న అర్జున్ దాని ద్వారా ఒక క్రైమ్ లో చిక్కుకోవడం, ఆ తర్వాత తాను ప్రేమిస్తున్న సుబ్బు తండ్రి ఆపదలో ఉన్నాడు అని అతనిని కాపాడే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత చివరికి తన ప్రేమను దక్కించుకుంటూ తన జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనేది ఈ సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    దర్శకుడు కథలోకి తీసుకువెళ్లేందుకు చాలా సమయం పట్టింది. మొదటి సగ భాగం అంతా కూడా హీరో ఇంట్రడక్షన్ హీరోయిన్ తో ప్రేమలో పడటం, తాను అనుకున్న పని సాధించడం కోసం హీరో పడే కష్టాలను చూపించారు. అయితే మొదటి భాగమంతా కాస్త సాగదీసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగే అవకాశం ఉంటుంది. నేరుగా సినిమాలోకి తీసుకు వెళ్ళకుండా హీరో క్యారెక్టరైజేషన్ ను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడం కోసం దర్శకుడు ఎక్కువ సమయం వెచ్చించినట్లు కనిపిస్తోంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సినిమా మీద ఆసక్తి రేకెత్తించే విధంగా ప్లాన్ చేశారు.

    ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే

    ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే

    సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి నేరుగా సినిమాలోని తీసుకువెళ్లారు. సినిమాలో అసలైన పాత్రల ఎంట్రీ, జగపతి బాబు ఫ్లాష్ బ్యాక్ అంటూ సెకండాఫ్ మొత్తం ఆసక్తికరంగా సాగుతుంది. కానీ డాన్ అంటూ ముందు నుంచి కలరింగ్ ఇచ్చి చివర్లో జగపతి బాబుని సినిమా పిచ్చోడుగా చూపించడం ప్రేక్షకులకు కాస్త ఇబ్బందికరమైన విషయమే చెప్పాలి. అయితే కామెడీ పండించడంలో భాగంగా ఈ మేరకు దర్శకుడు ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద సెకండాఫ్ ఆకట్టుకుంటుంది.

    దర్శకుడి పనితీరు విషయానికి వస్తే

    దర్శకుడి పనితీరు విషయానికి వస్తే

    దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్య అందరికంటే ఎక్కువ మార్కులు వేయించుకునే ప్రయత్నం చేశారు. సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా ఉన్న ప్రేక్షకుడికి క్లైమాక్స్లో సినిమా మీద చాలా లైటర్ వేలో నవ్వించే ప్రయత్నం చేశారు. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయాలని ప్రయత్నించాడు కానీ అది ఎందుకో సఫలం అయినట్లు కనిపించలేదు. నార్మల్ కథనే కాస్త కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినట్లు అనిపించింది. అయితే కామెడీ సన్నివేశాలు, డైలాగులు మాత్రం తెర మీద అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశారు.

    గల్లా అశోక్ నిధి అగర్వాల్ నటన

    గల్లా అశోక్ నిధి అగర్వాల్ నటన

    మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. కొన్ని కొన్ని చోట్ల మేనమామ పోలికలతో కనిపిస్తున్న అశోక్ ఎక్కడా కూడా కొత్త హీరో అనే విధంగా కనిపించలేదు. చాలా ఈజ్ తో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక మరోసారి నిధి అగర్వాల్ తన అందాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. ఆమె పాత్రకు పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. కానీ అశోక్ మాత్రం తనదైన ఫార్మెన్స్ తో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు.

     మిగతా నటీనటుల విషయానికి వస్తే

    మిగతా నటీనటుల విషయానికి వస్తే

    సినిమాలో ఎక్కువ భాగం సత్య తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. ముందు నుంచి సీరియస్ గా కనిపించిన జగపతిబాబు చివరిలో సినిమా ప్రయత్నాల కోణం బయటపడడంతో జనానికి దగ్గరవుతాడు. ఇక నరేష్ కూడా గల్లా అశోక్ తండ్రి పాత్రలో నటించి మెప్పించాడు.

    సత్యం రాజేష్, కోట శ్రీనివాసరావు, దర్శకుడు వీరశంకర్, దర్శకుడు అనిల్ రావిపూడి లాంటివాళ్ళు కనిపించింది ఒక సీన్లోనే అయినా తనదైన మార్క్ వేసుకునే ప్రయత్నం చేశారు. ఇక నటుడు రవికిషన్ ప్రధాన విలన్ గా సలీం భాయ్ పాత్రలో జీవించాడు. మాణిక్ రెడ్డి సలీం భాయ్ కుడిభుజంగా నటించారు, ఆయనకు నటనకు కూడా మంచి మార్కులు పడతాయి. మిగతా పాత్రధారులు తమ పరిధిమేర నటించారు.

    సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే

    సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే

    శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం ఆకట్టుకుంది, స్వయంగా స్క్రీన్ ప్లే అందించడంతో కన్ఫ్యూజ్ అయ్యే విధంగా తెరకెక్కించినట్లు అనిపించింది. ఇక జిబ్రాన్ సంగీతం ఆకట్టుకుంది. ఆయన అందించిన రీ రికార్డింగ్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. కొన్ని కొన్ని షాట్స్ అయితే అద్భుతంగా డీల్ చేయగలిగారు. ఠాగూర్ కళ్యాణ్, శంకర్ అందించిన డైలాగ్స్ మాత్రం ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి.

    ఫైనల్ గా

    ఫైనల్ గా

    హీరో అనేది ఒక రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ సినిమాకు ముంబై మాఫియా లింకులు కలపడంతో కాస్త గజిబిజి అనిపిస్తుంది. రొటీన్ సినిమానే కానీ తనదైన మార్కు వేసుకోవడానికి అశోక్ గల్లా ప్రయత్నించాడు. సూపర్ స్టార్ కృష్ణ జుంబారే సాంగ్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంది. ముఖ్యంగా పండుగకు ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. కాకపోతే బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది.

    English summary
    Galla Ashok's hero movie review and rating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X