Game Changer Censor Review: గేమ్ ఛేంజర్‌ సెన్సార్ రివ్యూ.. రాంచరణ్ మూవీకి అలాంటి సర్టిఫికేటా?

గ్లోబ‌ల్ స్టార్ రాంచ‌ర‌ణ్, సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌ కానున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ బోర్డు అధికారుల స్పందన వివరాల్లోకి వెళితే..

గేమ్ ఛేంజర్ సినిమా గత మూడేళ్లుగా మెగా అభిమానులను ఊరిస్తున్నది. శంకర్ ఈ సినిమాను రకరకాలుగా చెక్కుతూ ఎవరూ ఊహించిన విధంగా ఖర్చు పెట్టించారు. స్టోరి డిమాండ్ చేయడంతో దిల్ రాజు కూడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను అత్యంత రిచ్‌గా రూపొందించే ప్రయత్నం చేశారు.

Game Changer Censor Review  CBFC officials certifies Clean for Ram Charan Movie

గేమ్ ఛేంజర్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ముందు వేసుకొన్న ప్లాన్ కంటే రెండు, మూడు రెట్లు పెరిగిపోయిందనే విషయం ట్రేడ్ వర్గాల్లో వినిపించింది. ఇక ఈ సినిమాకు సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తున్నది. కేవలం పాటలకే 90 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలు టీజ‌ర్‌, ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ క్రమంలో ఈ సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులకు ప్రదర్శించారు.

సెన్సార్ బోర్డు సభ్యులకు ప్రదర్శించిన గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా నిడివి 165 నిమిషాలు అంటే.. 2 గంటల 45 నిమిషాలు. మద్యానికి సంబంధించిన కొన్ని పదాలపై అభ్యంతరం తెలిపి.. వాటిని తొలగించాలని సూచించారు. చట్ట ప్రకారం, కేరళ అనే పదాలను మార్పుల చేయాలని కోరారు. కొన్ని పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో దుర్గా శక్తి నాగ్‌పాల్‌ను సుచిత్ర పాండే మార్చారు.

Game Changer Censor Review  CBFC officials certifies Clean for Ram Charan Movie

ఇక పద్మశ్రీ లాంటి టైటిల్స్‌ను సినిమా టైటిల్స్‌లో ఉపయోగించుకోకూడదు. గతంలో మోహన్ బాబు పేరుకు ముందు పద్మ అవార్డును తొలగిస్తూ సెన్సార్ నిర్ణయం తీసుకొన్నది. అయితే గేమ్ ఛేంజర్ సినిమాలో బ్రహ్మనందం పేరుకు ముందు ఉన్న పద్మశ్రీని తొలగించాలని సెన్సార్ అధికారులు సూచించారనే విషయం సెన్సార్ బోర్డు రిలీజ్ చేసిన సర్టిఫికెట్‌లో స్పష్టమైంది. సెన్సార్ సర్టిఫికెట్‌ను పరిశీలిస్తే.. క్లీన్‌ సర్టిఫికెట్ ఇచ్చినట్టు కనిపించింది.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్ ఫ్యాన్స్, సిని అభిమానులను కట్టిపడేస్తుంది. ద్వితీయ భాగంలో కథను ఎమోషనల్‌గా, గ్రిప్పింగ్‌గా చెప్పడంలో దర్శకుడు శంకర్ సక్సెస్ అయ్యాడు అనే విషయం తాజాగా స్పష్టమైంది.

More from Filmibeat

Read more about: game changer cbfc ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X