Game Changer Movie Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: రాంచరణ్, అంజలి, కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ తదితరులు
దర్శకత్వం: ఎస్ శంకర్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
స‌హ నిర్మాత‌: హ‌ర్షిత్
సమర్పణ: శ్రీమతి అనిత
కథ: కార్తీక్ సుబ్బరాజ్
రచనా సహకారం: ఎస్‌యు వెంక‌టేశ‌న్‌, వివేక్
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌ తిరుణ్ణావుక్క‌ర‌సు
సంగీతం: ఎస్‌ ఎస్‌ త‌మ‌న్
డైలాగ్స్: సాయి మాధ‌వ్ బుర్రా
లైన్ ప్రొడ్యూసర్స్: న‌ర‌సింహా రావు ఎన్, ఎస్‌ కే జ‌బీర్‌ లైన్
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: అవినాష్ కొల్ల‌
కొరియోగ్రాఫ‌ర్స్‌: అన్బ‌రివు
కొరియోగ్రాఫర్స్: ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ
సాహిత్యం: రామ్ జోగ‌య్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్
బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్
రిలీజ్ డేట్: 2025-01-10.

ఐపీఎస్ (IPS) ఆఫీసర్‌ నుంచి ఐఏఎస్ (IAS)గా మారిన రామ్ నందన్ (రాంచరణ్) సొంత ఊరు వైజాగ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఏపీలో సీఎం బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్)‌కు పార్టీ పరంగా, ప్రభుత్వంలో అవినీతి పరంగా కుమారులు బొబ్బిలి మోపిదేవి (ఎస్‌జే సూర్య), రామచంద్ర (జయరామ్) నుంచి తలనొప్పులు ఉంటాయి. అనుకోకుండా సీఎం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతాడు. ఆ సమయంలో కుమారులిద్దరూ సీఎం కుర్చిపై ఆశలు పెట్టుకొంటారు. కానీ సీఎం సత్యమూర్తి మాత్రం రామ్ నందన్‌ను ముఖ్యమంత్రిగా, తన వారసుడిగా ప్రకటిస్తాడు.

Game Changer Movie Review in Telugu  Ram Charan One Man Show hits the bulls eye

రామ్ నందన్ ఐపీఎస్ నుంచి ఐఏఎస్‌కు ఎందుకు మారాడు? సీఎం సత్యమూర్తికి కుమారుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? రామ్ నందన్‌ను సత్యమూర్తి సీఎంగా ఎందుకు ప్రకటించాడు? సీఎం పదవిని రామ్ నందన్ ఎందుకు నిరాకరించాడు? ముఖ్యమంత్రి పదవిని మోపిదేవీకి అప్పగించి అతడికి రామ్ నందన్ ఎలాంటి షాక్ ఇచ్చాడు? దీపిక (కియారా అద్వానీ)తో ప్రేమాయణానికి ఎందుకు బ్రేక్ పడింది? రామ్ నందన్ తన తల్లిదండ్రులు అప్పన్న (రాంచరణ్), పార్వతి (అంజలి)కి ఎందుకు దూరమయ్యాడు? అప్పన్నకు సీఎం సత్యమూర్తికి ఉన్న విభేదాలు ఏంటి? చివరకు మోపిదేవీ సీఎం పదవిపై ఆశలకు రామ్ నందన్ ఎలా చెక్ పెట్టి.. ఏపీని రాక్షస పాలన నుంచి ఎలా కాపాడాడు? అనే ప్రశ్నలకు సమాధానమే గేమ్ ఛేంజర్ సినిమా కథ.

గేమ్ ఛేంజర్ సినిమా కథ విషయానికి వస్తే.. గత ఐదేళ్ల క్రితం నుంచి ఆంధ్ర ప్రదేశ్ జరిగిన అస్తవ్యస్త పాలన టార్గెట్‌గా చేసుకొని దర్శకుడు శంకర్ సంధించిన పొలిటికల్ సెటైర్ ఈ సినిమా. ఏపీ మాజీ సీఎం, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పాత్రల మధ్య జరిగిన రాజకీయ ఘర్షణ వాతావరణాన్ని కథకు ఇంధనంగా వాడుకొని.. స్వచ్చమైన ప్రజా పాలనను సాగించే ఓ కలెక్టర్ కథగా శంకర్ తెరకెక్కించారు. ఏపీలో ప్రతిపక్ష నాయకుడిని పూర్తిగా టార్గెట్ చేసుకొని అవినీతిపై సీనీ అస్త్రాన్ని సంధించే ప్రయత్నం చేయడంలో దర్శకుడు శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఆయన విజన్ గాడి తప్పిందనిపిస్తుంది.

ఏపీలో ఇసుక, ఐరన్ మైనింగ్, గంజాయి వ్యాపారం చేసే మోపిదేవీ, రామచంద్రారెడ్డి అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసే కలెక్టర్ కథతో సినిమాను ముగించి.. మధ్యలో తన కాలేజీలో లవ్ స్టోరీతో ఫస్టాప్‌ను నెగ్గుకొచ్చాడు. అయితే రొటీన్‌గా సాగుతుందనిపించే సమయంలో బ్రహ్మండమైన ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై హైప్ క్రియేట్ చేయడంలో శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

Game Changer Movie Review in Telugu  Ram Charan One Man Show hits the bulls eye

ఫస్టాఫ్‌లో పెంచి అంచనాలకు తగినట్టుగానే అప్పన్న, సత్యమూర్తి జర్నీ, అలాగే పార్వతీతో ప్రజా పోరాటాలను ఆసక్తికరంగా తెరకెక్కించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు. సెకండాఫ్‌లో రామ్ నందన్, పార్వతి (తల్లి కొడుకులు) మధ్య సెంటిమెంట్ ఎమోషనల్‌గా మార్చేసిందనే చెప్పాలి. మదర్ సెంటిమెంట్ సీన్లు బాగా వర్క్ అయ్యాయి. అంతా బాగానే వెళ్తుందనే సమయంలో ఎలక్షన్ ఎత్తుగడ సినిమాపై ఉన్న పాజిటివ్‌ ఫీలింగ్‌ను నెగిటివ్‌గా మార్చింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు ఊరమాస్ సన్నివేశాలతో రొడ్డ కొట్టుడు ఫైట్స్‌తో సినిమాను ముగించడం నిరాశే అని చెప్పాలి.

ఇక కథ, కథనాల విషయాలు పక్కన పెడితే...నటీనటులు పోటీ పడి పెర్ఫార్మెన్స్‌ను ఇచ్చారు. రామ్ నందన్‌గా, అప్పన్నగా రాంచరణ్ తన నటనా విశ్వరూపాన్ని చూపించాడు. కలెక్టర్‌గా, ప్రజా నాయకుడిగా రెండు పాత్రల్లో అద్బుతమైన వైవిధ్యాన్ని చూపించాడు. ఇక మోపిదేవీగా ఎస్‌జే సూర్య పవర్ ప్యాక్ట్ క్యారెక్టర్‌తో అల్లాడించాడు. రామ్ చరణ్‌‌తో నువ్వా నేనా అనే విధంగా నటించాడు. ఇక పార్వతి పాత్రలో అంజలి ఉత్తమ నటనను, సినిమాకు కావాల్సిన బోలెడంత ఎమోషన్‌ను అందించింది. కొన్ని సీన్లలో కంటతడి పెట్టించే భావోద్వేగాన్ని పండించింది. శ్రీకాంత్, జయరామ్, సముద్రఖని తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సునీల్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు, తిరు సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. పాటలు సినిమాలో కనువిందుగా చిత్రీకరించారు. గ్రాఫిక్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇతర విభాగాల పనితీరు ఫర్వాలేదనిపించేలా ఉంది. దిల్ రాజు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

గేమ్ ఛేంజర్ సినిమా పవర్ ప్యాక్ట్ క్యారెక్టర్లతో రూపొందిన రెగ్యులర్ పొలిటికల్ డ్రామా. ఏపీ ఎన్నికలకు ముందు వచ్చి ఉంటే ఈ మూవీ ఇంపాక్ట్ మరో విధంగా ఉండేదనిపించింది. అయితే ఇప్పటికే ప్రత్యక్షంగా ఏపీ రాజకీయాలను చూసిన వారికి ఈ డ్రామా తెర మీద ఏ మేరకు నచ్చుతుందో చూడాలి. అయితే ఈ సినిమాలో కొన్ని లాజిక్స్‌ను శంకర్ గాలికి వదిలేయడం మింగుడు పడని విషయం. కానీ మదర్ సెంటిమెంట్‌ను ఎలివేట్ చేసిన తీరు బాగుంది. రాంచరణ్, సూర్య, అంజలి, శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్‌తో చూసి మంచి అనుభూతిని పొందాలంటే.. థియేటర్‌లోనే చూస్తే థ్రిల్ ఉంటుంది. సంక్రాంతి పండుగ సమయంలో మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X