Game Changer Movie Twitter Review: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ.. సెకండాఫ్ నెవ్వర్ బిఫోర్.. మాస్.. ఊరమాస్ అంటూ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ క్రమంలో ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..
గేమ్ ఛేంజర్ సినిమాకు నా రేటింగ్ 4/5. రాంచరణ్ యాక్షన్‌తో బెస్ట్ పొలిటికల్ డ్రామాగా సినిమాను చూపించాడు. శంకర్ డైరెక్షన్, ఎస్‌జే సూర్య యాక్టింగ్, కియారా అద్వానీ మైమరించే పెర్ఫార్మెన్స్, బీజీఎం, ఆడియెన్స్ ఎక్సలెంట్ రెస్పాన్స్ అందించే సినిమా ఇది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
గేమ్ ఛేంజర్ సినిమా కెరీర్ ఛేంజర్ సినిమా. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత శంకర్ గ్రేట్ కమ్ బ్యాక్. స్టోరీ టెల్లింగ్, స్టెల్లర్ ఫెర్ఫార్మెన్స్, టాప్ ఫెర్ఫార్మెన్స్, అద్బుతమైన సినిమాటిక్ ఎక్సీపిరియెన్స్ మూవీకి అదనపు ఆకర్షణ. రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంది. ఎస్‌జే సూర్య అవుట్ స్టాండింగ్. కియారా అద్వానీ, అంజలి ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
గేమ్ ఛేంజర్ ఫస్టాప్ ఇప్పుడే ముగిసింది. స్టిక్ట్‌గా ఫస్టాప్ యావరేజ్. కథలో ఊహించే సన్నివేశాలున్నాయి. అలాగే కమర్షియల్ మీటర్‌లో సినిమా వెళ్తున్నది. ఐఏఎస్ ఆఫీసర్‌గా రాంచరణ్‌పై తీసిన కొన్నిసన్నివేశాలు చాలా బాగున్నాయి. లవ్ స్టోరీ బోరింగ్‌గా ఉంది. కామెడీ అంత బాగాలేదు. రాంచరణ్ యాక్టింగ్, తమన్ బీజీఎం ఇప్పటి వరకు మేజర్ అసెట్. సెకండాఫ్ కోసం వేసిన సెటప్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చారు.
గేమ్ ఛేంజర్ సినిమా చూశాను. బొమ్మ పెద్ద హిట్ అంటూ ఓ ట్వీట్ చేశారు. రాంచరణ్ కుమ్మేశాడు. థ్యాంక్యూ శంకర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
గేమ్ ఛేంజర్ సినిమా ఫస్టాఫ్ ముగిసింది. ఈ సినిమా ఇప్పటి వరకు యావరేజ్‌గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్టు హైలెట్. శంకర్ డైరెక్షన్ బాగాలేదు. కార్తీక్ సుబ్బరాజ్ కథ అంత గొప్పగాలేదు. స్క్రీన్ ప్లే కూడా అంతంత మాత్రమే. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కావాల్సిన దాని కంటే ఎక్కువ గోల ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
గేమ్ ఛేంజర్ సినిమా ఫస్టాఫ్ చూశాను. శంకర్ తన వింటేజ్ టేకింగ్‌తో కథను గ్రిప్పింగ్‌గా చెబుతున్నాడు. ఫస్టాప్ గ్రాండియర్‌గా, ఎమోషనల్‌గా, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో రాంచరణ్ ఇంప్రెస్ చేశాడు. థమన్ బీజీఎం, పాటల పిక్చరైజేన్, ఎలివేషన్స్ అన్నీ చక్కగా కుదిరాయి. సెకండాఫ్ కోసం మంచిగా రసపట్టు గ్రౌండ్ ప్రిపేర్ చేశారనిపించింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో మునిగిపోయి ఆనందంతో తేలిపోయారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన పుట్ పాత్‌లపై పడుకొంటున్న అభాగ్యులకు బెడ్ షీట్స్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ తార్నాక ప్రాంతంలో జరిగింది అని అభిమానులు ఫోటోలు వీడియోలు షేర్ చేశారు.
ఇండియన్ 2 సినిమాతో డిజాస్టర్ అందుకొన్న శంకర్.. గేమ్ ఛేంజర్ సినిమాను కసితో తీశాడు. సినిమా సెకండాఫ్ మాత్రం నెవ్వర్ బిఫోర్ అనే విధంగా ఉంది అని ఫ్యాన్స్ ఓ ట్వీట్‌ను వేశారు.
గేమ్ ఛేంజర్ సినిమాలో అప్పన్న పాత్రలో ఓ ఎమోషనల్ షాట్ డైరెక్టర్ శంకర్‌నే షాక్ గురి చేసింది. ఆ షాట్‌లో నటనకు రాంచరణ్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం ఖాయమని అంటున్నారు. అదే విషయాన్ని హీరోయిన్ అంజలి కూడా కన్ఫర్మ్ చేసింది.

గేమ్ ఛేంజర్ సినిమా మాస్.. ఊరమాస్. రామ్ నందన్ ఊచకోత మొదలు అంటూ అభిమానులు పోస్టులతో హోరెత్తిస్తున్నారు. మెగా ఫ్యాన్స్‌లో ఓ పండుగ వాతావరణం నెలకొన్నది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా బజ్ క్రియేట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











