Game Changer First Review: గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ.. ఆ రెండు సినిమాలను మించి.. వావ్ శంకర్, రాంచరణ్!
గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రం విడుదలకు సిద్దమైంది. అంజలి, కియారా అద్వాణీ, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించారు. ఈ మూవీ జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. అయితే ఇటీవల ఈ సినిమాను వీక్షించిన చిరంజీవి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
చిరంజీవి తన సన్నిహితులతో చెప్పిన ప్రకారం.. ఫస్టాఫ్ భారీ సెట్టింగులతో అద్బుతంగా అందమైన లొకేషన్లలో తెరకెక్కించిన విధానంతో సినిమా సరదాగా సాగిపోతుంది. ప్రధాన కథలోకి తీసుకెళ్లిన విధానం.. అనుసరించిన స్క్రీన్ ప్లే చక్కగా కుదిరింది. ఫస్టాఫ్ ఫన్, ఎమోషనల్ అంశాలతో ఎంటర్‌టైనింగ్‌గా వెళ్తుంది అని చెప్పినట్టు తెలిసింది.

ఇక సెకండాఫ్‌లో రాంచరణ్, అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ పాత్రలు పోటాపోటీగా కనిపిస్తాయి. వారి పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటాయి. చరణ్ నటన ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ఇప్పటి వరకు చెర్రీని చూసిన తీరు వేరు.. ఈ సినిమా తర్వాత యాక్టర్‌గా చరణ్ మరో మెట్టు ఎక్కుతాడు అని తన సంతోషాన్ని పంచుకొన్నారట.
ఇక అంజలి నటన మీరు ఊహించని విధంగా ఉంటుంది. ఈ సినిమాతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది. ఈ ఏడాది ఆమెకు ఉత్తమ నటి అవార్డు రావడం గ్యారెంటి. తన ఫెర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోతుంది అని చిరంజీవి కితాబిచ్చినట్టు సమాచారం.

ఇక గేమ్ ఛేంజర్ ఎన్నో మలుపులు తిరుగుతూ అనుక్షణం ప్రేక్షకుడిని కొత్త అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా సినిమాలో మదర్ సెంటిమెంట్ ప్రతీ ఒక్కరిని కదిలిస్తుంది. ప్రీ క్లైమాక్స్ సాగే సన్నివేశాల్లో శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. రాంచరణ్, శ్రీకాంత్ మధ్య సన్నివేశాలు కథకు కీలకంగా మారుతాయి.
ఇక ఎస్‌జే సూర్య పొలిటిషిన్‌గా మరోసారి బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇటీవల వచ్చిన సరిపోదా కంటే మిన్నగా ఆకట్టుకొంటాడు. కలెక్టర్ పాత్రలో రాంచరణ్‌తో పోటాపోటీగా సాగే సన్నివేశాల్లో వారిద్దరి మధ్య పేస్ ఆఫ్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. కథను శంకర్ డీల్ చేసిన విధానం చూస్తే.. జెంటిల్మన్, ఒకే ఒక్కడు స్థాయి సినిమాను మించి చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది అని చిరంజీవి తన సన్నిహితులకు తన రివ్యూను ఇచ్చినట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











