Game Changer First review : "గేమ్ ఛేంజర్" ఫస్ట్ ఎవర్ రివ్యూ.. హాట్ కామెంట్స్ తో టాప్ డైరెక్టర్

ఈ ఏడాదిలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన పలు భారీ సినిమాల్లో దాదాపు మన తెలుగు స్టార్స్ లో కొందరివే వచ్చాయని చెప్పాలి. అంత మంది స్టార్స్ లో కూడా కేవలం ముగ్గురు హీరోలే తమ సినిమాలతో పలకరించగా వారిలో ఒక్కో దాన్ని మించి మరోకటి బిగ్ హిట్స్ అండ్ హైయెస్ట్ గ్రాసర్‌లుగా నిలిచాయి. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 అయితే భారీ రికార్డులు తిరగరాయగా ఈ సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమానే "గేమ్ ఛేంజర్".

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్‌ల కలయికలో దిల్ రాజు లాంటి నిర్మాత భారీ బడ్జెట్‌తో చేసిన సినిమానే ఇది. అయితే ఈ సినిమా నిజానికి ఈ ఏడాదిలోనే రావాల్సి ఉంది. కానీ దీనిని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మూవీని దర్శకుడు శంకర్‌కు కం బ్యాక్ అంటూ మేకర్స్ గట్టి కాన్ఫిడెంట్‌గానే ఉన్నారు.

game changer world first ever review out and viral

ఈ సినిమా గ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమాకి లేని విధంగా ఏకంగా అమెరికాలో భారీ ఈవెంట్ ని చేసి సక్సెస్ అయ్యారు. ఈ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ అంతా హాజరు కాగా భారీ స్థాయిలో ఫ్యాన్స్ కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ ఫస్ట్ ఎవర్ రివ్యూ ఇపుడు బయటకి వచ్చింది.

కాగా ఈ సినిమా మొట్ట మొదటి రివ్యూ ఇచ్చింది ఎవరో కాదు లేటెస్ట్ గా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1500 కోట్లకి పైగా గ్రాస్ ని అందించిన దర్శకుడు సుకుమార్. ఈ సినిమా గ్రాండ్ ఈవెంట్ కి యూఎస్‌లో హాజరైన ఆయన తాను ఈ సినిమా చూసినట్టుగా తెలిపారు. అంతే కాకుండా తనతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా చూసారు అని సుకుమార్ వెల్లడించారు

అయితే తనకి ఈ సినిమా బాగా నచ్చింది అని పలు పాయింట్స్ చెప్పారు సుక్కూ. ఫస్టాఫ్ ఆసమ్‌గా ఉంటే సెకండాఫ్ బ్లాక్ బస్టర్ లెవెల్లో ఉంది అని ఆయన సెలవిచ్చారు. అంతే కాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ పోర్షన్ లు అదిరిపోయాయి అంటూ సుకుమార్ ఇచ్చిన క్రేజీ రివ్యూ ఇపుడు వైరల్ గా మారింది.

ఇక రివ్యూ కాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు అని తెలిపారు. అప్పట్లో తమ "రంగస్థలం" కి మిస్సయ్యిన అవార్డు రామ్ చరణ్ కి ఈ సినిమాతో సాధిస్తాడని సుకుమార్ జోస్యం చెప్పారు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. అయితే మొత్తానికి మెగా ఫ్యాన్స్ మాత్రం సుకుమార్ రివ్యూతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.

More from Filmibeat

Read more about: sukumar shankar pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X