Game On Review ట్విస్టులతో సాగే సైకాలజికల్ థ్రిల్లర్.. గీతానంద్, మధుబాల ఎలా చేశారంటే? గేమ్ ఆన్ సమీక్ష
Rating: 2.75/5
నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, రోజా ఫేమ్ మధుబాల, ఆదిత్య మీనన్, వాసంతి, కిరిటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు
కథ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: దయానంద్
నిర్మాత: రవి కస్తూరి
సినిమాటోగ్రఫి: అరవింద్ విశ్వనాథన్
మ్యూజిక్ డైరెక్టర్: అభిషేక్ ఏ ఆర్
ఎడిటర్: వంశీ అట్లూరి
సాంగ్స్: నవాబ్ గ్యాంగ్, అశ్విన్ - అరుణ్
స్క్రిప్ట్ సూపర్ వైజర్: విజయ్ కుమార్ సీ హెచ్
ఆర్ట్: విఠల్
యాక్షన్ కొరియోగ్రఫి: రామకృష్ణ, నభా స్టంట్స్
స్టైలింగ్: దయానంద్
కొరియోగ్రఫి: మోయిన్
రిలీజ్ డేట్: 2024-02-02
గేమింగ్ కంపెనీలో పనిచేసే గౌతమ్ సిద్దార్థ్ అలియాస్ సిద్దూ (గీతానంద్) తన కంపెనీలో పనిచేసే మోక్ష (బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్)తో బ్రేకప్ అవుతుంది. అంతేకాకుండా జీవితంలో కూడా చాలా విషయాల్లో వైఫల్యం చెందుతాడు. దాంతో లైఫ్ మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకొంటాడు. ఆ సమయంలో వచ్చి ఓ ఫోన్ కాల్‌తో అతడి సూసైడ్ ప్రయత్నాలు బ్రేక్ పడుతుంది. ఫోన్‌లో అవతలి వ్యక్తి ఇచ్చే సలహాలు, సూచనలతో సిద్ధూ గేమ్ ఆడటం మొదలుపెడుతాడు. ఆ గేమ్‌లోకి, అలాగే జీవితంలోకి తార (నేహ సోలంకి) అడుగుపెడుతుంది.
మోక్షతో ఎందుకు బ్రేకప్ జరిగింది? తన క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ (కిరిటి) ఎలా మోసం చేశాడు? సిద్దూని తన తల్లి అర్చన (మధుబాల) చిన్నతనంలోనే ఎందుకు వదిలేసి వెళ్లింది? తన తాత సూర్య నారాయణ (శుభలేఖ సుధాకర్) ఎందుకు జైలుకు వెళ్లాడు? తన జీవితంలోకి వచ్చిన తార ఎవరు? సిద్దూను సైకాలజిస్ట్ మదన్ మోహన్ (ఆదిత్య మీనన్) ఎందుకు గేమ్ ఆడిస్తున్నాడు? ఈ గేమ్‌లో సిద్దూ గెలిచాడా? తన తల్లి అర్చనను క్షమించాడా? ప్రియురాలు తారతో లవ్ ట్రాక్ ఎలా నడిపాడు అనే ప్రశ్నలకు సమాధానమే గేమ్ ఆన్ మూవీ

ఓ హత్య కేసులో సూర్య నారాయణ (శుభలేఖ సుధాకర్) అరెస్ట్ కావడమనే ఓ ఎమోషనల్ సన్నివేశం సినిమాను కనెక్ట్ చేయడానికి ఉపయోగపడిందనే చెప్పాలి. అయితే క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సమయం తీసుకొన్నప్పటికీ.. సైకాలజికల్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మూవీ జోష్‌గా సాగుతుంది. కథలోకి వెళ్లే కొద్ది ట్విస్టులు, వాటి చుట్టు అలుకొన్న కథ మరింత ఇంట్రస్టింగ్, క్యూరియాసిటీ కలుగజేస్తుంది.
గేమ్ ఆన్ సినిమా సెకండాఫ్ విషయానికి వస్తే.. మదర్ సెంటిమెంట్ ఆకట్టుకొనేలా ఉంది. అలాగే మధుబాల క్యారెక్టర్ చుట్టూ సాగే సన్నివేశాలు దర్శకుడు దయానంద్ రైటింగ్ టాలెంట్‌కు అద్దం పడుతాయి. అలాగే సినిమాను రిచ్‌గా తెరకెక్కించిన విధానం బాగున్నాయి. సైకాలజీ గేమ్, ఆదిత్య మీనన్, హీరో గీతానంద్ మధ్య జరిగే క్యాట్ మౌజ్ గేమ్ సినిమాకు పాజిటివ్‌గా మారాయని చెప్పవచ్చు.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. మూవీ భారాన్నంత గీతానంద్ చక్కగా తన భుజాల మీద వేసుకొని మోశాడు. అలాగే క్యారెక్టర్‌కు సంబంధించి డిఫరెంట్ వేరియెన్స్, ఎమోషన్స్‌ను మెచ్యురిటీతో పలికించాడు. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ సీన్లలో తనదైన శైలిలో మెప్పించాడు. ఇక నేహా సోలంకి ఫుల్ రొమాంటిక్‌గా కనిపించింది. బోల్డ్ సీన్లతో గ్లామర్ పంటపడించింది. తన పాత్రలో ఉంటే ట్విస్టులకు తగినట్టు బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నది.
గేమ్ ఆన్ సినిమాలో మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ పాత్రలు గుర్తుండిపోతాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా కథకు యాప్ట్ కావడంతో కొన్ని సీన్లలో ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతారు. వాసంతి, కిరిటి తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, ఆర్ట్, సౌండ్ విభాగాల పనితీరు బాగుంది. అభిషేక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నవాబ్ గ్యాంగ్ అందించిన పాటలు బాగున్నాయి. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు హైలెట్. ఇక నిర్మాత రవి కస్తూరి అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. పాత్రలకు ఎంపిక చేసిన నటీనటులను చూస్తే సినిమాపై ఉండే ఆయన తపన అర్ధమవుతుంది.

ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్‌ఫుల్, కమర్షియల్ అంశాలతో రూపొందిన యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ గేమ్ ఆన్. అయితే ట్రైలర్, ప్రమోషన్స్ కార్యక్రమాలు యాక్షన్, థ్రిల్లర్ అనే ఫీల్‌ను కల్పించాయి. కానీ ఈ కథలో తల్లి, కొడుకులు, తాత, మనవడు మధ్య ఎమోషనల్ కంటెంట్‌ను కూడా ప్రమోట్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఈ సినిమా అన్నివర్గాలను ఆకట్టుకోవడానికి అంశాలు ఉన్నాయి. స్టోరి పాయింట్, స్క్రీన్ ప్లే బాగున్నాయి. కానీ సైకలాజికల్ గేమ్‌కు సంబంధించిన సీన్లలో కంటెంట్ ఇంకా బెటర్‌గా చేసి ఉంటే.. బెస్ట్ సైకాలజికల్ థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది. యూత్, మదర్ సెంటిమెంట్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











