twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Game Over మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Game Over Movie Review And Rating || గేమ్ ఓవర్ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

    Rating:
    3.5/5
    Star Cast: తాప్సీ పన్ను, వినోదిని వైద్య నాథన్, అనీష్ కురువిల్ల, సంచన నటజరాజన్, రమ్య సుబ్రమణియన్, పార్వతి
    Director: అశ్విన్ శరవణన్

    ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా రంగంలో కన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. హీరో బేస్డ్, రోటీన్ కమర్షియల్ సినిమాల నుంచి ప్రేక్షకులు క్రమక్రమంగా బయటకు వస్తున్నారు. కొత్త తరహా చిత్రాలను ఆదరిస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఈ ట్రెండును తమకు అనుకూలంగా మలుచుకుంటూ పలువురు యువ దర్శకులు సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ 'గేమ్ ఓవర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

    వీడియో గేమ్ కాన్సెప్టుకు, నిజ జీవితానికి ముడి పెడితూ ఒక విభిన్నమైన కథతో 'గేమ్ ఓవర్' సినిమా సాగుతుంది. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీలో శుక్రవారం విడుదలైంది. మరి దీని కథా కమామిషు ఏమిటి? దీని ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అనేది రివ్యూలో చూద్దాం.

    స్వప్న అనే వీడియో గేమ్ డిజైనర్ కథ

    స్వప్న అనే వీడియో గేమ్ డిజైనర్ కథ

    అమృత(సంజన నటరాజన్) అనే అమ్మాయి కిరాతకమైన హత్యతో సినిమా మొదలైంది. ఒక ఉన్మాది ఒంటరిగా ఉండే అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వారి తల నరికి, పెట్రోలు పోసి తగలబెట్టి అత్యంత దారుణంగా హత్యలు చేస్తుంటాడు. కట్ చేస్తే... సినిమా కథ స్వప్న(తాప్సీ పన్ను) అనే వీడియో గేమ్ డిజైనర్ జీవితం వైపు టర్న్ అవుతుంది. న్యూ ఇయర్ రాత్రి తనపై జరిగిన రేప్ సంఘటనతో మానసికంగా కృంగిపోయిన ఆమె చీకటిని సహించలేని రుగ్మతతో బాధపడుతూ ఉంటుంది.

    టాటూ వెనక అసలు స్టోరీ

    టాటూ వెనక అసలు స్టోరీ

    డిసెంబర్ 31న స్వప్న తన చేతిపై టాటూ వేయించుకుంటుంది. అప్పటి నుంచి తన జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దాన్ని రిమూవ్ చేసుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. ఇంతకీ టాటూ వెనక కథేంటి? అమృతకు, సప్న చేతిపై ఉన్న టాటూకు లింకేంటి? అనే విషయాన్ని ఆసక్తికర స్క్రీన్ ప్లేతో వివరించే ప్రయత్నం చేశారు.

    తాప్సీ పెర్ఫార్మెన్స్

    తాప్సీ పెర్ఫార్మెన్స్

    సినిమా మొత్తం కూడా తాప్సీ పోషించిన స్వప్న పాత్ర చుట్టే తిరుగుతుంది. తాప్సీ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో దర్శకుడు సృష్టించిన పాత్రకు జీవం పోసింది. చీకటి అంటే భయపడే మానసిక రుగ్మతతో బాధపడే అమ్మాయి పాత్రలో జీవించింది. నటిగా తనలోని ఉత్తమ కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో సక్సెస్ అయింది. తాప్సీకి సహాయకురాలిగా కళ్లమ్మ పాత్రలో వినోదిని వైద్యనాథన్ మెప్పించింది. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు.

    టెక్నికల్ అంశాల పరంగా...

    టెక్నికల్ అంశాల పరంగా...

    థ్రిల్లర్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా కుదిరితేనే స్క్రీన్ పై దర్శకుడు చెప్పాలనుకున్న కథ బాగా ఎలివేట్ అవుతుంది. ఈ చిత్రానికి ఎ.వసంత్ అందించిన సినిమాటోగ్రఫీ, రోన్ ఏతాన్ యోహాన్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యాయి. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి.

    బ్రిలియంట్ స్క్రీన్ ప్లే

    బ్రిలియంట్ స్క్రీన్ ప్లే

    ‘గేమ్ ఓవర్' కథకు బ్రిలియంట్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ జోడించి ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు సీట్లో కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఉపయోగించని ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సినిమా సాగుతుంది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హీరో అని చెప్పొచ్చు.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    • హీరోయిన్ తాప్సీ పెర్ఫార్మెన్స్
    • బ్రిలియంట్ స్క్రీన్ ప్లే
    • బ్యాగ్రౌండ్ మ్యూజిక్
    • మైనస్ పాయింట్స్

      • మొదటి భాగంలో సాగదీత కాస్త ఎక్కువగా ఉండటం
      • కొన్ని చోట్ల కన్ ప్యూజన్ ఉండటం
      • సినిమా ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటి?

        సినిమా ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటి?

        సాధారణంగా వీడియో గేమ్ ఆడేపుడు మూడు లైఫ్ లైన్స్ ఉంటాయి. ఈ మూడు అయిపోతే ‘గేమ్ ఓవర్' అయిపోతుంది. మొదటి రెండు లైఫ్ లైన్స్ చాలా మంది ఈజీగా పోగొట్టుకుంటాం. అయితే చివరి లైఫ్ లైన్ విషయంలో మాత్రం చాలా కష్టపడి గెలిచేందుకు ఫైట్ చేస్తారు. మన జీవితం కూడా అంతే. ఏ దారి లేనపుడు... లైఫ్ ఎండ్ అయ్యే పరిస్థితి వచ్చినపుడు ప్రాణాలకు తెగించి పోరాడకపోతే అంతా ముగిసిపోతుందనే పాయింట్ స్వప్న పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

        తాప్సీ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ

        తాప్సీ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ

        తాప్సీ కెరీర్లో ‘గేమ్ ఓవర్' వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పింక్, బద్లా లాంటి చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న ఈ ఢిల్లీ బ్యూటీ ఈ సినిమా ద్వారా మరొక మెట్టు ఎక్కిందని చెప్పక తప్పదు.

        చివరగా...

        చివరగా...

        ‘గేమ్ ఓవర్' రొటీన్ చిత్రాలకు పూర్తి భిన్నమైన సినిమా. కమర్షియల్ అంశాలు, వినోదం ఆశించి వెళితే నిరాశ తప్పదు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు, కొత్త కాన్సెప్టులను ఈజీగా అడాప్ట్ చేసుకోగల వారికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది.

        గేమ్ ఓవర్

        గేమ్ ఓవర్

        నటీనటులు: తాప్సీ పన్ను, వినోదిని వైద్య నాథన్, అనీష్ కురువిల్ల, సంచన నటజరాజన్, రమ్య సుబ్రమణియన్, పార్వతి.

        సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్
        ఎడిటర్: రిచర్డ్ కెవిన్
        రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్
        మాటలు: వెంకట్ కాచర్ల
        ఛాయా గ్రహణం: ఎ.వసంత్
        సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా)
        నిర్మాత: ఎస్.శశికాంత్
        దర్శకత్వం: అశ్విన్ శరవణన్
        విడుదల తేదీ: జూన్ 14, 2019

    English summary
    Game Over Movie Telugu Review by Filmibeat. Taapsee Pannu's Game Over is a multi-layered and concept-oriented film, drected by Ashwin Saravanan and produced by S.Sashikanth. The film is produced jointly by Y NOT Studios and Reliance Entertainment and presented by Anurag Kashyap. The music is composed by Ron Ethan Yohann.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X