గాడి తప్పిన గణా

By Staff

Gana
సినిమా: గణా
విడుదల తేదీ: 10 నవంబర్‌ 2006
నటీనటులు: బ్రహ్మాజీ, సుహాసిని, నాగబాబు, తెలంగాణా శకుంతల తదితరులు..
కెమెరా: వి ఎస్‌ డి ప్రసాద్‌
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవిరాజ్‌
నిర్మాణం: ట్రెండ్‌సెట్‌ ఫిలింస్‌
నిర్మాత: ఆర్‌ అనూప్‌ చక్రవర్తి

చిన్న సినిమాలు కూడా ఫ్యాక్షన్‌ బరిలోకి దిగితే చేసేదేముంది? బ్రహ్మాజీ హీరోగా కొత్త దర్శకుడు (ఏ కారణాల వల్లనో పేరు ప్రకటించలేదు) రూపొందించిన గణా - కత్తులు, రివాల్వర్లు, టాటా సుమోలతో హంగామా చేసినా ఫలించేటట్లు అనిపించడం లేదు. క్లయిమాక్స్‌లో చిన్న సెంటిమెంటు పాయింటుని పెట్టుకుని కథ లేకుండా రెండు గంటలకు పైగా సినిమా తీయడం దుస్సాహసమే. కథ కరవు కావడంతో కథనం బరువై ప్రేక్షక కన్నీళ్లకు నెలవైంది.

రెండు ఊళ్ల మధ్య ఫ్యాక్షన్‌ గొడవలు. ఒక గ్రూపు నాయకురాలైన ఆళ్లగడ్డ ఆదక్క (తెలంగాణా శకుంతల)కీ, పక్క వూరి పెద్ద ప్రకాశ్‌రెడ్డి (నాగేంద్రబాబు) కుటుంబం నాశనం కావాలి. అందుకోసం ఆమె సినిమా ప్రారంభం నుండి క్లయిమాక్స్‌ వరకూ కత్తులతో ప్రయత్నాలు చేస్తుంటుంది. నాగేంద్రబాబు ఎప్పుడూ ఎదురెళ్లక భగవత్‌గీత చదువుకుంటూ బతుకుతుంటాడు. కాబట్టి ఇది వన్‌సైడ్‌ వార్‌. కథని ముందుకు కదిలించదు.

మరో ట్రాకులో నాగేంద్రబాబు నమ్మిన బంటు గణపతి అలియాస్‌ గణా (బ్రహ్మాజీ) ప్రేమ కథ. నాగబాబు కూతురు ప్రియ (సుహాసిని) యజ్ఞం సినిమాలో అమ్మాయిగారిలా ప్రేమలో పడి గణాని వెంబడిస్తుంది. వీరి లవ్‌ కథ కూడా నాగబాబుకి క్లయిమాక్స్‌ వరకూ తెలియదు. కాబట్టి ఇదీ కథని కదిలించదు. ముచ్చటగా మూడో ట్రాకు ఆ అమ్మాయిగారికి గుండె ప్రాబ్లమ్‌. గుండెని మార్చాలి. గుండె కోసం వెతుకుతూ ఉంటారు. ఇదీ ప్రేక్షకుడికి తెలియదు క్లయిమాక్స్‌ వరకూ. కాబట్టి ఇలా కూడా కథ కదలదు. అన్నీ క్లయిమాక్స్‌ వరకూ సాగుతుంటాయి. ఇదీ కథాగమనం.

సాధారణంగా యాక్షన్‌ (చర్య), రియాక్షన్‌ (ప్రతిచర్య) ఉన్న తరహాలో ఉన్న కథలు ఆసక్తి రేపుతాయి. ప్రధాన పాత్ర బ్రహ్మాజికి సినిమా చివరి దాకా సమస్యే రాదు. కాబట్టి దీన్ని ఎలా తప్పించుకుంటాడనే సమస్యే లేదు. నాగేంద్రబాబు క్యారెక్టరు యాక్టివ్‌ అయ్యుంటే మిగతా కథ పరుగుపెట్టేది. నిస్సహాయంగా చూసే నాగబాబు చర్యలు సినిమాని నిస్సారంగా మార్చేశాయి. ఇదంతా అల్లుకున్న స్క్రీన్‌ప్లే సమస్యే. కెమెరా ద్వారా సృష్టించిన డల్‌ మూడ్‌, దానికి తగినట్లు రీరికార్డింగ్‌ ఆసక్తిని మరింత చంపేస్తాయి.

బ్రహ్మాజి, సుహాసిని పరిథుల మేరకు బాగానే నటించారు. మూగవాడిగా ఉత్తేజ్‌ క్యారెక్టర్‌ బాగుంది. రామ్‌జగన్‌ కామెడి కొంత మాత్రమే పేలింది. దుబాయ్‌ ట్రాక్‌ వర్కవుట్‌ కాలేదు. తెలంగాణా శకుంతల అరుపులకే పరిమితమైంది. ముఖ్యంగా క్రాఫ్ట్‌పై సరైన అవగాహన లేకుండా చిన్న సినిమాలని నిర్మించి వాటి విలువని దిగజార్చటం దురదృష్టకరం. బి, సి సెంటర్లు కూడా ఈ సినిమాని భరించడం కష్టమే.

గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X