Ganaa Movie Review నూతన నటీనటుల మంచి ప్రయత్నం.. యాక్షన్, థ్రిల్లర్ ఎలా ఉందంటే?
నటీనటులు: విజయ్ కృష్ణ, యోగిషా, తేజు, నాగమహేష్, జబర్దస్త్ అప్పారావు, దొరబాబు తదితరులు
సమర్పణ: రాధ, మమత
బ్యానర్: సత్యకృష్ణ ఆర్ట్స్
ఎడిటర్: నందమూరి హరి, ఎన్టీఆర్
మ్యూజిక్: చిన్ని కృష్ణ
సినిమాటోగ్రఫి: సన్ని డీ
నిర్మాత: మేడపాటి సాయికృష్ణారెడ్డి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: విజయ్ కృష్ణ
రిలీజ్ డేట్: 2023-03-17

నేర సామ్రాజ్యాన్ని, అక్రమ దందాలను విస్తరించే క్రమంలో గణా ఎలాంటి దారుణాలకు చేశాడు? గణా వ్యాపారాలకు ఆయన సోదరుడు దాము అడ్డుగా నిలిచాడా? మాజీ ఎమ్మెల్యేతో కలిసి గణాకు చెక్ పెట్టాడా? తన ప్రేయసి సౌమ్య తండ్రిని చంపేందుకు గణా ఎందుకు ఒప్పుకొన్నాడు? గణాను సౌమ్య ఎందుకు అపార్థం చేసుకొన్నది. గణా గత జీవితంలో ప్రియ ఎవరు? ప్రియ ఏ పరిస్థితుల్లో చనిపోయింది అనే ప్రశ్నలకు సమాధానమే గణా సినిమా కథ.
గణా చిత్రం గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందింది. రెండు వర్గాల ఎత్తులు పైఎత్తులు, లవ్, ఎమోషనల్ అంశాలు సినిమాను ఆసక్తికరంగా మార్చుతాయి. హీరోగానే కాకుండా దర్శకుడిగా విజయ్ కృష్ణ చూపిన ప్రతిభకు అభినందించాలి. నటుడిగా పలు సన్నివేశాల్లో చూపించిన ఫెర్ఫార్మెన్స్ బాగుంటుంది. యోగిషా, నాగ మహేష్‌తోపాటు ఇతర నటీనటుల ఒకే అనిపించారు. జబర్దస్త్ అప్పారావు, దొరబాబు కామెడీ బాగుంటుంది.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమా వరకు వస్తే.. సన్ని అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. కథ, కథనాలను హైలెట్ చేసేలా మ్యూజిక్ కీలకంగా మారింది. నందమూరి హరి ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. మేడపాటి సాయికృష్ణారెడ్డి, సత్యకృష్ణా బ్యానర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా గణా సినిమా విషయానికి వస్తే. కథలో కొన్ని లోపాలు సినిమాకు ప్రతికూలంగా మారుతాయి. అలాగే కథలో బలం ఉన్నప్పటికీ చిన్న చిత్రం కావడం, పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం కూడా కొంత మైనస్‌గా మారిందని చెప్పవచ్చు. పెద్ద హీరోలతో చేస్తే మంచి విజయం సాధించగల చిత్రంగా గణాను చెప్పవచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కొన్ని ట్విస్టులు ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతాయి. చిన్ననటులు, పరిమితమైన బడ్జెట్‌తో తమ ప్రతిభను చాటుకొనేందుకు నటీనటులు, సాంకేతిక నిపుణులు చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. వ్యయప్రయాసల కోర్చి.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తీరు.. సినిమాపై వారికి ఉన్న అంకితభావం కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











