Gandeevadhari Arjuna Review. స్టైలిష్ స్పై థ్రిలర్..కానీ..! వరుణ్ తేజ్ హిట్టుకొట్టాడా?

నటీనటులు: వ‌రుణ్‌తేజ్, సాక్షి వైద్య, విమలా రామన్, వినయ్ రాయ్, రవి వర్మ, నరేన్, అభినవ్ గోమటం తదితరులు
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
సమర్పణ: బాపినీడు
సినిమాటోగ్రఫి: ముఖేష్
సంగీతం: మిక్కి జే మేయర్
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
రిలీజ్ డేట్: 2023-08-25

మాజీ రా ఉద్యోగి అర్జున్ ( వరుణ్ తేజ్) యూకేలో సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తుంటాడు. లండన్‌లో వాతావరణ సదస్సుకు హాజరైన భారత కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ (నాజర్) సెక్యూరిటీగా చేరుతాడు. ఇక కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ వద్ద సెక్రటరీగా పనిచేసే ఐరా (సాక్షి వైద్య)తో అర్జున్ ప్రేమలో ఉంటాడు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి మనవరాలిని తన అల్లుడు, సీఎన్‌జీ కంపెనీ అధినేత రణ్‌వీర్ (వినయ్ రాయ్) కిడ్నాప్ చేస్తాడు. తన డిమాండ్లు నెరవేర్చకపోతే సొంత కూతురినైనా చంపేస్తానని రణ్ వీర్ హెచ్చరిస్తాడు. అయితే కేంద్ర మంత్రి మనవరాలిని రక్షించేందుకు ఐరా (సాక్షి వైద్య) సిద్దమవుతారు.

Gandeevadhari Arjuna movie review and Rating: Varun Tej and Praveen Sattarus stylish spy thriller

కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్‌కు యూకేలో ఎవరి నుంచి ఎలాంటి ముప్పు ఉంది? కేంద్ర మంత్రికి సెక్యూరిటీ పర్సన్‌గా అర్జున్ ఎందుకు చేరాడు? అర్జున్‌కు ఉన్న సమస్యను తీర్చడానికి కేంద్ర మంత్రి ఎందుకు ముందుకు వచ్చాడు? ఐరాతో అర్జున్ ఉన్న వ్యక్తిగత విభేదాలేంటి? కేంద్ర మంత్రి కూతురు ప్రియ (విమలారామన్) తన భర్త రణ్‌వీర్ నుంచి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? సొంత కూతురును రణ్‌వీర్ ఎందుకు చంపాలనుకొన్నాడు? కేంద్ర మంత్రికి అల్లుడు రణ్‌వీర్ పెట్టిన డిమాండ్లు ఏమిటి? కేంద్ర మంత్రి మనవరాలిని అర్జున్ కాపాడటంలో సఫలమయ్యాడా? అర్జున్ తల్లికి వచ్చిన సమస్య ఏమిటి? యూకేలో వాతావరణ సదస్సుకు ఏపీలోని లంబసింగికి ఉన్న కనెక్షన్ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే గాండీవధారి అర్జున సినిమా కథ.

Gandeevadhari Arjuna movie review and Rating: Varun Tej and Praveen Sattarus stylish spy thriller

ఏపీలో వాతావరుణ కాలుష్యం, మానవాళికి వ్యర్థాల డంపింగ్ ఎలా ముప్పు వాటిల్లుతుందనే ఎమోషనల్ పాయింట్ చుట్టు అల్లుకొన్న స్పై థ్రిల్లర్ పాయింట్ బాగుంది. కానీ కథను స్క్రిప్టు నుంచి స్క్రీన్ వరకు తీసుకెళ్లే విషయంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు తడబాటుకు గురయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా మొత్తంగా చూస్తే స్టైలిష్ మేకింగ్‌పై పెట్టిన దృష్టి.. కథ, కథనాలు, పాత్రల డిజైన్ పెట్టలేదనే విషయం స్పష్టమవుతుంది. పాత్రల చుట్టూ ఉండే ఎమోషన్స్ విషయంలో రకరకాల సందేహాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. దర్శకుడు తాను చెప్పాలనుకొన్న పాయింట్‌ను ఊరించి ఊరించి చివరకు పేలవంగా ముగించడం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని చెప్పింది.

Gandeevadhari Arjuna movie review and Rating: Varun Tej and Praveen Sattarus stylish spy thriller

గాండీవధారి అర్జున సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే.. యాక్షన్ ఎపిసోడ్స్ కొంత హైలెట్‌గా ఉంటాయి. కానీ సన్నివేశాల్లో బలం లేకుండా యాక్షన్‌తో సరిపెట్టుకోవడం ఈ సినిమాకు మైనస్. కథలో పాత్రలు సౌలభ్యం కోసం వాడుకోవడం చాలా రొటీన్, రెగ్యులర్‌గా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కథ ఎంతకు ముందుకు వెళ్లకపోవడం సహనానికి పరీక్షగా ఉంటుంది. ప్రియ (విమలారామన్) తన తండ్రికి ఉన్న విభేదాలకు నాన్చి నాన్చి చెప్పడం మరో మైనస్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో అసలు కథను మొదలుపెట్టి సాగదీయడం మరో మైనస్. చివర్లో సమాజానికి సందేశాన్ని ఇవ్వడంతో ఏదో రొటీన్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది.

Gandeevadhari Arjuna movie review and Rating: Varun Tej and Praveen Sattarus stylish spy thriller

గాండీవధారి అర్జున సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. యాక్షన్ హీరోగా తన పాత్రలో వరుణ్ తేజ్ ఒదిగిపోయిన విధానం బాగుంది. వరుణ్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. యాక్షన్ సీన్లలో బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ బాగుంది. సాక్షి వైద్య ఫుల్ లెంగ్త్ రోల్‌లో ఉన్నప్పటికీ..కథలో ఎక్కడా ఆమె క్యారెక్టర్ ప్రభావం కనిపించలేదు. అందంగా, అభినయంతో మెప్పించే ప్రయత్నం చేసింది. నాజర్, వినయ్ రాయ్ పాత్రలు ఒకే అనిపిస్తాయి. విమలా రామన్ కథలో కీలకమైన పాత్రను పోషించారు. అభినవ్ గోమటం కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. రవివర్మ ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

Gandeevadhari Arjuna movie review and Rating: Varun Tej and Praveen Sattarus stylish spy thriller

సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే..సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ విభాగం పనితీరు అంతంతా మాత్రమే. బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు అనుసరించన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Gandeevadhari Arjuna movie review and Rating: Varun Tej and Praveen Sattarus stylish spy thriller

యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ప్రవీణ్ సత్తారు రూపొందించిన సినిమా గాండీవధారి అర్జున. అయితే ఇటీవల ఆయన తీసిన ఘోస్ట్ సినిమాకు ఈ సినిమాకు పెద్దగా తేడా కనిపించదు. కథ లేకుండా స్టైలిష్ మేకింగ్‌తో నెట్టుకొచ్చే ప్రయత్నమే ఈ సినిమాలో కనిపిస్తుంది. స్టైలిష్ మేకింగ్, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. మల్టిప్లెక్స్ ఆడియెన్స్‌కు నచ్చే అంశాలు ఉన్న ఈ సినిమా బీ, సీ సెంటర్ల ఆఢియెన్స్‌ను ఆకట్టుకుంటే మంచి విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X