Gandhi Talks Movie Review: గాంధీ టాక్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరీ, సిద్దార్థ్ జాదవ్, మహేష్ మంజ్రేకర్ తదితరులు
దర్శకత్వం: కిషోర్ పాండురంగ్ బెలెకర్
నిర్మాతలు: ఉమేష్ కుమార్ భన్సాల్, రాజేష్ కేజ్రివాల్, మీరా చోప్రా, కిషోర్ పాండురంగ్ బెలేకర్
మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
సినిమాటోగ్రఫి: కరణ్ బీ రావత్
ఎడిటింగ్: ఆశీష్ మాత్రే
బ్యానర్: జీ స్టూడియోస్, క్యూరియస్, మూవీ మిల్
రిలీజ్ డేట్: 2026-01-30
రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ బిజినెస్ మ్యాన్ మోహన్ బోస్‌మ్యాన్ (అరవింద్ స్వామి) ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలుతుంది. విమాన ప్రమాదంలో భార్య, కూతురు మరణిస్తారు. తల్లి గుండెపోటుకు గురవుతుంది. తాను చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోతుంది. తన బిజినెస్‌లో పెట్టుబడి పెట్టిన వాటాదారులు ఉన్నట్టుండి తమ డబ్బును వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయిస్తారు. దాంతో డబ్బు ఇవ్వకలేని పక్షంలో ఇంటిని వేలం వేసి డబ్బు చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంద్రభవనం లాంటి ఇంటిలో ఆయన ఒంటరిగా బతుకుతుంటాడు. ఇదిలా ఉండగా, ముంబైలోని మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసే మహాదేవ్ (విజయ్ సేతుపతి) కటిక పేదరికంలో జీవిస్తుంటాడు. తల్లి అస్వస్థతకు గురై భారంగా మారిపోతుంది. పూటకు తిండి తినలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో తన చేతికి వచ్చిన జీతం డబ్బులను తనకు కాకుండా మోహన్ బోస్‌మ్యాన్ చేస్తాడు. దాంతో మోహన్‌పై కోపం పెంచుకొన్న మహాదేవ్ ఆయన ఇంటిని లూటీ చేయడానికి ప్లాన్ వేస్తాడు?
అత్యంత ధనికుడైన మోహన్ బోస్‌మ్యాన్ మెడకు కష్టాలు చుట్టుకొన్నప్పుడు ఆయన రియాక్షన్ ఏమిటి? కోర్టు కేసులు, ప్రత్యర్థుల దాడులను ఆయన ఎలా ఎదుర్కొన్నాడు? మహాదేవ్‌కు ఎలాంటి ఇబ్బందిని మోహన్ కలిగించాడు. మోహన్ ఇంటిలో దోపిడికి ప్లాన్ చేసిన మహాదేవ్‌కు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడు? మహాదేవ్‌తో గాయత్రి (అదితి రావు హైదరీ) రిలేషన్‌షిప్ ఎలా కొనసాగింది? మోహన్‌కు తన ఆర్థిక కష్టాలను సమర్ధవంతంగా ఎదుర్కొని తన ప్రొఫెషనల్ లైఫ్‌ను గాడిలో పెట్టారా? మహాదేవ్ దోపిడి ప్లాన్ సక్సెస్ అయిందా? మహాదేవ్ కష్టాలు గట్టెక్కాయా? గాయత్రితో మహాదేవ్ లవ్ లైఫ్ హ్యాపీ ఎండింగ్ అయిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

గాంధీ టాక్స్ సినిమా గురించి చెప్పాల్సి వస్తే.. డైలాగ్స్ లేకుండా చేసిన మూకీ చిత్రం. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ఆధారంగా కథ, పాత్రలు ముందుకు కొనసాగుతాయి. డైలాగ్ వెర్షన్ లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలతో కొత్త అనుభూతిని అందించే విధంగా చేసిన ప్రయోగం మాత్రమే. ఇలాంటి ప్రయోగాలకు టాలెంటెడ్ యాక్టర్లు తప్పనిసరి అనేది కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. దర్శకుడు కిషోర్ పాండురంగ బెలెకర్ అందుకు తగినట్టుగానే అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అదితిరావు హైదరీ, గోవింద్ నామ్‌దేవ్, మహేష్ మంజ్రేక్ లాంటి వాళ్లను ఎంచుకొని వారి బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా పాత్రలను రాసుకొన్నారు.
నేటి తరం ప్రేక్షకులు లౌడ్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్, సింగిల్ లైనర్ పంచ్‌లకు అలవాటు పడిపోయి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా డైలాగ్స్ లేకుండా మూవీని రూపొందించడం అతిపెద్ద ఛాలెంజ్. అలాంటి సవాల్‌ను దర్శకుడు కిషోర్ ఆర్టిస్టుల ప్రతిభతో సమర్దవంతంగా ఎదుర్కొన్నాడు. కానీ ఆడియెన్స్‌ను కట్టిపడేసే కథను, స్క్రీన్ ప్లేను రూపొందించుకోవడంలో తడబాటుకు గురయ్యాడు. కథ, కథనాల్లో గొప్ప ట్విస్టులు లేకపోవడం, సన్నివేశాలు సాగదీసినట్టు ఉండటం ఈ సినిమాకు మైనస్. కాకపోతే డిఫరెంట్ చిత్రాలను, ప్రయోగాలను ఆదరించే వారికి గాంధీ టాక్స్ ఇష్టపడే ఛాన్స్ ఉంది.
సంపన్న వ్యాపారవేత్తగా అరవింద్ స్వామి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఎమోషనల్‌గా, సీరియస్, ఫన్ ఎలిమెంట్స్‌తో మోహన్ పాత్రను మెప్పించే విధంగా నటించాడు. ఇక విజయ్ సేతుపతికి తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌కి తగిన విధంగా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉండే క్యారెక్టర్‌లో జీవించాడు. సెకండాఫ్‌లో తన పాత్రతో కొన్నిసార్లు నవ్వించడమే కాకుండా ఎమోషనల్‌గా ఆకట్టుకొన్నాడు. గాయత్రిగా అదితి రావు హైదర్ పాత్ర చిన్నదైనా గ్లామర్ డోస్‌తో క్రేజీగా కనిపించింది. మిగితా పాత్రలు ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉన్నాయి.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమా మూకీ మూవీ. కాబట్టి ఏఆర్ రెహ్మాన్ తన మ్యూజిక్‌తో డామినేట్ చేయడానికి కావాల్సినంత స్వేచ్ఛ లభించింది. చాలా సన్నివేశాలను తన బీజీఎంతో అర్ధవంతంగా మార్చారు. చాలా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫి మరో ప్లస్ పాయింట్. డిఫరెంట్ షేడ్ లైటింగ్‌తో సీన్లను రిచ్‌గా మార్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
గాంధీ టాక్స్ అంటే పొలిటికల్ థ్రిల్లర్ అనుకొంటే పొరపాటే. ఈ సినిమా కేవలం డబ్బు చుట్టూ తిరిగే ఆర్థిక అంశాలతో కూడిన మానవ సంబంధాల కథ. గాంధీ నోటు విలువను చెప్పే ఎమోషనల్ రైడ్. కథ, కథనాలు ఇంట్రెస్టింగ్‌గా ఉండి ఉంటే ఈ సినిమాను గొప్పగా ఓ ఎమోషనల్ థ్రిల్లర్ అయి ఉండేది. కేవలం అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అదితి రావు హైదరీ పెర్ఫార్మెన్స్ చూసేందుకు మాత్రే వెళ్లాలి. లెక్కలు వేసుకొని అన్ని సినిమాల మాదిరిగా చేసే మూవీ కాదు. ఓ డిఫరెంట్ మూవీ. ఈ సినిమాను చూడటానికి కొంత ఓపిక కావాలి. డిఫరెంట్ సినిమాలను ట్రై చేద్దామనే కొంత టేస్ట్ ఉండాలి. అంచనాలు లేకుండా వెళితే.. ఎలాంటి డిజాపాయింట్‌మెంట్ ఉండదు. కాబట్టి థియేటర్‌లో చూసేందుకు ప్రయత్నించండి.


Click it and Unblock the Notifications











