Gandhi Tatha Chettu Review: గాంధీ తాత చెట్టు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

మూవీ: గాంధీ తాత చెట్టు
నటీనటులు: సుకృతి వేణి బండ్రెడ్డి (దర్శకుడు సుకుమార్ కూతురు), ఆనంద చక్రపాణి, రాగ్ మయూర్, రఘురామ్, భాను ప్రకాశ్ తదితరులు
రచన, దర్శకత్వం: పద్మావతి మల్లాది
నిర్మాతలు: శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు
సహ నిర్మాతలు: అశోక్ బ్రండ్రెడ్డి, అభినయ్ చిలుకమర్రి
సినిమాటోగ్రఫి: శ్రీజిత్ చెరువుపల్లి, విశ్వ దేవబత్తుల
ఎడిటింగ్: హరిశంకర్ టీఎన్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, కాసర్లశ్యామ్, విశ్వ
ప్రొడక్షన్ డిజైన్: నాని పండు
రిలీజ్ డేట్: 2025-01-24

రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) గాంధేయవాది. తండ్రి (రాఘవేంద్ర) ని చూసి పెంచుకొన్న దేశభక్తిని తన తదుపరి తరానికి బోధించేందుకు రామచంద్రయ్య ఇష్టపడుతుంటాడు. తన కొడుకు కూతురుకు గాంధీ (సుకృతి వేణి) అని పేరు పెట్టుకొంటారు. గాంధీ కూడా తన తాత పాటించే విలువలను అనసురిస్తుంటుంది. సత్యం పలకాలని స్కూల్‌లో కూడా తోటి విద్యార్థులకు బోధిస్తుంటుంది. ఇలా వారి జీవితం ఉన్నత విలువలతో కొనసాగుతుంటే.. ఆ గ్రామంలోకి పరిశ్రమ స్థాపన పేరుతో పెట్టుబడి దారుడు (రాగ్ మయూర్) గ్రామస్థుల భూమిని కొనుగోలు చేసేందుకు అడుగుపెడుతాడు.

రామచంద్రయ్య అనుసరించిన నైతిక విలువలు ఏమిటి? తాత అడుగు జాడల్లో గాంధీ ఎలా నడిచింది? రామచంద్రయ్యకు తన కొడుకుకు మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయి? పారిశ్రామిక వేత్త రాకతో గాంధీ కుటుంబంలో చోటు చేసుకొన్న విపత్కర పరిస్థితి ఏమిటి? తాత కోసం తండ్రి (రఘురామ్)తో గాంధీ ఎందుకు విభేదించింది? తాత రామచంద్రయ్యకు గాంధీ ఇచ్చిన మాట ఏమిటి? తాతకు ఇచ్చిన మాట కోసం గాంధీ ఎంత వరకు వెళ్లింది? పరిశ్రమల పేరుతో గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి వచ్చిన పెట్టుబడిదారుడిని ఊరి నుంచి తరిమి కొట్టడానికి గ్రామస్తులను గాంధీ ఎలా ఏకం చేసింది? అనే ప్రశ్నలకు సమాధానమే గాంధీ తాత చెట్టు సినిమా కథ.

Gandhi Tatha Chettu Movie Review in Telugu  Sukriti Veni bandreddy  Ananda Chakrapani soul of the emotional drama

క్రైమ్, హింస, రక్తపాతం, మితీమీరిన శృంగారం లాంటి నేపథ్యంగా సినిమాలు వస్తున్న నేపథ్యంలో వాటికి భిన్నంగా దర్శకురాలు పద్మావతి మల్లాది ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఆ పాయింట్ రాసుకొన్న ఎమోషన్స్ బాగున్నాయి. పాత్రలను డిజైన్ చేసుకొన్న తీరు మెప్పించేలా ఉన్నాయి. సైమన్ గో బ్యాక్ పాయింట్‌ను కథలో జొప్పించిన విధానం, అలాగే గాంధీపై ఉండే విమర్శలకు ఇచ్చిన వివరణ బాగుంది. కానీ కథ, కథనాల విషయంలో ఇంకా బెటర్‌గా చేసి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. నేటితరం ఆడియెన్స్‌ను రప్పించేలా కొన్ని కమర్షియల్ అంశాలను కూడా కథలో భాగంగా చెప్పగలిగి ఉంటే ఈ మూవీ సంపూర్ణంగా ఉండేదనిపిస్తుంది. అయినా దర్శకురాలి చేసిన ప్రయత్నం అభినందనీయం. ఇలాంటి కథలను ప్రోత్సహించిన నిర్మాతల అభిరుచి కూడా ప్రశంసనీయమని చెప్పవచ్చు.

గాంధీ తాత చెట్టు సినిమాకు కర్త, కర్మ, క్రియ గాంధీ పాత్ర. ఆ పాత్రను సుకృతి అలవోకగా పోషించి మెప్పించారు. కీలక సన్నివేశాల్లో ఎంతో అనుభవం ఉన్న యాక్టర్‌గా హావభావాలు ప్రదర్శించారు. పాత్రకు తగినట్టుగా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ చక్కగా కనిపించేలా చేసింది. ఈ సినిమాను ఒంటిచేత్తో ముందుకు నడిపించిందనే చెప్పాలి. ఇక రామచంద్రయ్యగా ఆనంద చక్రపాణి ఈ మూవీకి మరో బలం. గాంధేయవాదిగా, ప్రకృతి ప్రేమికుడిగా తన క్యారెక్టరలో ఒదిగిపోయాడు. స్క్రీన్‌పై ఆయన ప్రజెన్స్ బాగుంది. సుకృతి, ఆనంద చక్రపాణి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇంకొన్ని సన్నివేశాలు ఉండి ఉంటే.. మరింత ఫీల్ గుడ్‌గా ఉండేదనిపించింది.

ఇక గాంధీ తల్లిదండ్రులుగా యాదమ్మ (లావణ్య), దివాకర్ (రఘురామ్) పాత్రలో నటించిన ఇద్దరూ సహజంగా నటించారు. గాంధీకి స్నేహితులుగా నటించిన భాను ప్రకాశ్, నేహల్ ఆనంద్ చక్కటి తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ మంచి వినోదాన్ని పండించే ప్రయత్నం చేశారు. అలాగే నెగిటివ్ షేడ్‌లో రాగ్ మయూర్ మరోసారి నేచురల్‌గా ఆకట్టుకొన్నాడు. ఇతర పాత్రల్లో నటించిన వారు ఫర్వాలేదనే విధంగా నటించారు.

Gandhi Tatha Chettu Movie Review in Telugu  Sukriti Veni bandreddy  Ananda Chakrapani soul of the emotional drama

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. శ్రీజిత, విశ్వ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె వాతావరణాన్ని కెమెరాలో బంధించిన తీరు బాగుంది. గ్రామీణ జీవితాన్ని చూపించిన విధానం ఆహ్లదకరంగా ఉంది. రీ మ్యూజిక్ బాగుంది. తెలంగాణ యాసలో రాసిన డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఇతర విభాగాల పనితీరు కూడా బాగుంది. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా కథను కథగా తెరకెక్కించిన విధానం చూస్తే.. నిర్మాతల నిజాయితీ కనిపిస్తుంది.

గ్రామీణ జీవితంలో పర్యావరణ ప్రాధాన్యత, పారిశ్రామికత పేరుతో ఊర్లలో జరిగే విధ్వంసం, నైతిక విలువలు అంశాలను బేస్ చేసుకొని రూపొందించిన చిత్రం గాంధీ తాత చెట్టు. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. సుకృతికి మొదటి సినిమా అయినా చాలా అద్బుతంగా నటించింది. కాకపోతే స్లో నరేషన్, మెయిన్ స్ట్రీమ్‌ సినిమాకు కావాల్సిన అంశాలు కొరవడటం వల్ల ఏదో మిస్ అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంది. కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా చూస్తే.. గాంధీ తాత చెట్టు తప్పకుండా మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. కొన్ని సన్నివేశాలు మీ హృదయాన్ని తాకుతాయి. మంచి అనుభూతిని పొందడానికి ఈ సినిమాను థియేటర్లలోనే చూడండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X