గంగోత్రి..ఖంగోత్రి!

By Staff

Gangothri
-జలపతి
చిత్రం: గంగోత్రి
నటీనటులు: అర్జున్‌, ఆదితి అగర్వాల్‌, ప్రకాష్‌ రాజు,
సుమన్‌, సీత, శకుంతల, తనికెళ్ళభరణి
సంగీతం: కీరవాణి
నిర్మాత: సి.అశ్వనీదత్‌
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: కె.రాఘవేంద్రారావు

దర్శకుడు కె.రాఘవేంద్రరావు 'బాబు' అనే చిత్రంతో కెరీర్‌ ను ప్రారంభించారు. అనంతరం జ్యోతి, త్రిశూలం వంటి మంచి చిత్రాలు తీశారు. ఇప్పుడు ఆయన రూపొందించిన వందో చిత్రం 'గంగోత్రి'ని చూస్తే..వయసుతో, అనుభవంతో పాటు ఆయన 'ఫిల్మ్‌ మేకింగ్‌ స్టైల్‌' పెద్దగా పరిణితి చెందలేదనిపిస్తోంది. తొలి చిత్రాలు బాగుండి..వందో చిత్రం ఇంతలా ఖంగోత్రిలా ఉందంటే..ఆయన ప్రస్తుతం 'అవుట్‌ ఆఫ్‌ టచ్‌'లో ఉన్నారనే చెప్పవచ్చు. 'ఫ్యాక్షన్‌ స్పెషలిస్ట్‌' రైటర్‌ చిన్నికృష్ణ, 'చంటి' వంటి చిత్రకథకు 'ఇంద్ర' టైప్‌ లో కొంచెం ఫ్యాక్షన్‌, గంగా నది టచ్‌ చేసి 'గంగోత్రి' అనే కథను రూపొందించాడు. ఏ మాత్రం వాస్తవికత లేని ఈ చిత్రంలో ఆద్యంతం 'పాతకాలపు జ్ఞాపకాలే' కన్పిస్తాయి. హీరోగా పరిచయం అయిన అర్జున్‌ తో ఇలాంటి 'హెవీ' చంటి తరహా సినిమా రూపొందిచడం సాహసమే. పరమబోర్‌ గా ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు కూడా తిలకించడం సాహసమే. కీరవాణి సంగీతం మినహా మరేదీ బాగాలేని ఈ చిత్రం కథ ఇలా ఉంది..

ప్రకాష్‌ రాజ్‌ ఫ్యాక్షన్‌ నాయకుడు. అతనికి నమ్మిన బంటు సుమన్‌. సుమన్‌, సీతల కుమారుడు అర్జున్‌. ప్రకాష్‌ రాజ్‌ కు కలగక కలగక పుట్టిన కూతురు బతకాలంటే..'గంగోత్రి' అనే పేరు పెట్టాలని, 15 ఏళ్ళు వచ్చేవరకు ఉత్తరభారతదేశంలోని గంగోత్రికి వెళ్ళాలని ఓ పండితుడు చెప్పుతాడు. ఈ అమ్మాయికి తోడు-నీడగా అర్జున్‌ ఉంటాడు. వీళ్లు ఇద్దరు పెద్దయ్యాక ప్రేమలో పడుతారు. కానీ, తన కూతురును 'దురుద్దేశం'తోనే ప్రేమిస్తున్నాడని ప్రకాష్‌ రాజు భావిస్తాడు.

దీంతో సుమన్‌, ప్రకాష్‌ రాజ్‌ ల మధ్య వార్‌. ప్రకాష్‌ రాజ్‌ సుమన్‌ ఇంటిపై బాంబుల వర్షం కురిపిస్తాడు. దీంతో అర్జున్‌ గారు రెచ్చిపోయి గంగోత్రిని ఏడాదిలోపు పెళ్ళిచేసుకుంటానని ఛాలెంజ్‌ చేసి 'గంగోత్రి'కి వెళుతాడు. ఆ పుణ్యక్షేత్రానికి హీరోయిన్‌ వచ్చి పెళ్ళిచేసుకుంటుందా లేదా అనేది క్లైమాక్స్‌.

అల్లు అర్జున్‌ డాన్స్‌ లు బాగానే చేసిన ముఖం అందంగా లేకపోవడంతో పాటు నటించే సత్తా కూడా లేకపోవడంతో అతన్ని చూడడం చాలా కష్టంగా ఉంటుంది. ఆదితి ఫర్వాలేదు. రాఘవేంద్రరావు ఈ సన్నని అమ్మాయి మీద ఏకంగా 'భారీ పండ్ల'నే విసిరాడు. సినిమా మరీ అతి సాధారణం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X